iDreamPost
android-app
ios-app

Chandrakanth: పవిత్ర కోసం ఆత్మహత్య చేసుకున్నాడు.. కానీ ఇకపై కష్టాలన్నీ ఆమెకే!

  • Published May 18, 2024 | 9:14 AM Updated Updated May 18, 2024 | 9:14 AM

సీరియల్‌ నటుడు చంద్రకాంత్‌ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడి భార్య, తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. ఆ వివరాలు..

సీరియల్‌ నటుడు చంద్రకాంత్‌ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడి భార్య, తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. ఆ వివరాలు..

  • Published May 18, 2024 | 9:14 AMUpdated May 18, 2024 | 9:14 AM
Chandrakanth: పవిత్ర కోసం ఆత్మహత్య చేసుకున్నాడు.. కానీ ఇకపై కష్టాలన్నీ ఆమెకే!

టీవీ సీరియల్‌ యాక్టర్‌ చంద్రకాంత్‌ శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. నటి పవిత్ర మృతిని జీర్ణించుకోలేక అతడు చనిపోయినట్లు సన్నిహితులు చెబుతున్నారు. పవిత్ర జయరామ్‌, చంద్రకాంత్‌లకు త్రినయని సీరియల్‌ సమయంలో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి.. లివిన్‌రిలేషన్‌లో ఉన్నారు. త్వరోలనే పెళ్లి చేసుకోవాలని భావించారు. ఇక పవిత్ర మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక చంద్రకాంత్‌కు కూడా వివాహం అయ్యింది. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పవిత్రతో పరిచయం ఏర్పడిన నాటి నుంచే అతడు.. కుటుంబానికి దూరంగా ఉంటున్నట్లు తెలిసింది.

చంద్రకాంత్‌ భార్య పేరు శిల్ప. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరికి ఐదేళ్లు, ఒకరికి ఆరేళ్ల వయసు. ఇక చంద్రకాంత్‌-శిల్ప ఇద్దరిది కూడా లవ్‌ మ్యారేజ్‌. 11 ఏళ్ల క్రితం తన తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా సరే.. చంద్రకాంత్‌ను వివాహం చేసుకుంది శిల్ప. ఆమె తన అత్తమామతో కలిసి ఉంటుంది. ఇక త్రినయని సీరియల్‌ సమయంలోనే చంద్రకాంత్‌కు పవిత్రతో పరిచయం అయ్యిందని.. అప్పటి నుంచి కుటుంబానికి దూరంగా ఉంటున్నట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య నుంచి విడాకులు తీసుకుని.. పవిత్రను వివాహం చేసుకుందామనుకున్నాడు చంద్రకాంత్‌.

పవిత్ర మీద పిచ్చి ప్రేమతో.. ఆమె లేని లోకంలో ఉండలేనంటూ చంద్రకాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ చంద్రకాంత్‌ తీసుకున్న నిర్ణయం వల్ల అతడి తల్లిదండ్రులు, భార్య, బిడ్డలు అన్యాయం అయ్యారు. పవిత్ర కోసం చంద్రకాంత్‌ చనిపోయాడు. ఇప్పుడు పిల్లల పోషణ భారం, అతడి తల్లిదండ్రుల బాధ్యత శిల్ప మీద పడింది. వారి బాగోగులు ఎవరు చూడాలి.. పిల్లల భవిష్యత్తు ఏంటి.. అనేవి పెద్ద సమస్యలుగా మారాయి. ఇలాంటి కష్ట సమయంలో ఆమెకు అండగా ఎవరుంటారు అని ప్రశ్నిస్తున్నారు. ఇక బతికున్ననాళ్లు చంద్రకాంత్‌.. పవిత్ర కోసం శిల్పను పట్టించుకోలేదు.. ఆమెను చిత్రహింసలు పెట్టేవాడు అని తెలుస్తోంది. చంద్రకాంత్‌ బతికుండగా ఆమెకు కష్టాలే.. ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా బాధలే.. ఆమె కష్టం ఎవరికి రాకూడదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక పవిత్ర చనిపోయిన నాటి నుంచి చంద్రకాంత్‌ డిప్రెషన్‌లోకి వెళ్లాడు. తన పాప లేని లోకంలో తాను ఉండలేను అని భావించాడు. ఆమె గురించి వరుస పోస్టులు చేస్తూ వచ్చాడు. ఇక పవిత్ర బర్త్‌ డే రోజున.. రెండు రోజులు ఆగంటూ పోస్ట్‌ చేశాడు చంద్రకాంత్‌. కానీ దాన్ని ఎవరూ సీరియస్‌గా పట్టించుకోలేదు. అన్నట్లుగానే శుక్రవారం నాడు అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. పవిత్రకు యాక్సిడెంట్‌ జరిగిన కారులో చంద్రకాంత్‌ కూడా ఉన్నాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. పవిత్రే తన జీవితం అంటూ ఎమోషనల్‌ అయ్యాడు చంద్రకాంత్‌.