Swetha
అసలెందుకో ఈ మధ్య టాలీవుడ్ సినిమాల జర్నీ సరిగా సాగడం లేదు. భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయినా సినిమాలు ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. సంక్రాంతి తర్వాత ఇది కదా సినిమా అంటే అనే ఫీల్ అయినా సినిమా ఒక్కటి కూడా థియేటర్ లో పడలేదు.
అసలెందుకో ఈ మధ్య టాలీవుడ్ సినిమాల జర్నీ సరిగా సాగడం లేదు. భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయినా సినిమాలు ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. సంక్రాంతి తర్వాత ఇది కదా సినిమా అంటే అనే ఫీల్ అయినా సినిమా ఒక్కటి కూడా థియేటర్ లో పడలేదు.
Swetha
అసలెందుకో ఈ మధ్య టాలీవుడ్ సినిమాల జర్నీ సరిగా సాగడం లేదు. భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయినా సినిమాలు ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. సంక్రాంతి తర్వాత ఇది కదా సినిమా అంటే అనే ఫీల్ అయినా సినిమా ఒక్కటి కూడా థియేటర్ లో పడలేదు. మధ్య కొన్ని సినిమాలు వచ్చి హోప్ ఇచ్చాయి కానీ.. ఆ ఎనర్జీ ఆడియన్స్ కు సరిపోలేదు. దీనితో అసలు బాక్స్ ఆఫీస్ ఏమైపోతుందో అని దర్శక నిర్మాతలు కంగారు పడిపోయారు. కానీ సెప్టెంబర్ విజయాలు టాలీవుడ్ కు ఊరట కలిగించాయి.
లిటిల్ హార్ట్స్ లాంటి చిన్న సినిమా , ఓజి లాంటి పెద్ద సినిమా.. ఈ రెండిటి మధ్యలో మిరాయ్ , కిష్కింధపురి లాంటి మిడ్ రేంజ్ సినిమాలు.. సక్సెస్ అందుకోవడంతో నిర్మాతలకు భరోసా కలిగించింది. ఓజి మీద ఎప్పటినుంచో క్రేజ్ ఉంది. అనుకున్నట్టుగానే అది సక్సెస్ అందుకుంది. ఇక మిరాకిల్ ఏమైనా ఉందంటే అది లిటిల్ హార్ట్స్ సినిమానే. ఈటీవీ విన్ నుంచి వచ్చి 2.5 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా ఎలాంటి స్టార్స్ , టెక్నీషియన్స్ లేకుండానే థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యేలోపు దాదాపు రూ.25 కోట్ల షేర్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది.
మళ్ళీ ఇలాంటి సినీ ఫెస్టివల్ సంక్రాంతి సీజన్ లోనే కనిపించబోతుంది. చిరంజీవి , ప్రభాస్ , నవీన్ పోలిశెట్టి , రవితేజ ల సినిమాలు సంక్రాంతికి రాబోతున్నాయి. అవన్నీ కూడా మంచి టాక్ సంపాదించుకున్నాయంటే ఇక 2026 కి గుడ్ స్టార్ట్ దక్కినట్టే. ఇక వచ్చే మూడు నెలల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇలాంటి జోష్ ఏ కనిపిస్తే.. ఇక బాక్స్ ఆఫీస్ కు తిరుగు ఉండదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.