iDreamPost

రేణుకాస్వామి ఎవరు? అతనికి పవిత్ర గౌడకి సంబంధమేంటీ? వెలుగులోకి సంచలన నిజాలు!

Renukaswamy Murder Case: కన్నడ ఇండస్ట్రీలో చాలెంజింగ్ హీరో దర్శన్ అరెస్ట్ కావడం తీవ్ర సంచలనం రేపింది. తన ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్య మెసేజ్ పంపుతున్నాడని ఓ వ్యక్తిని హత్య చేయించిన ఘటనలో దర్శన్ ని అరెస్ట్ చేశారు పోలీసులు.

Renukaswamy Murder Case: కన్నడ ఇండస్ట్రీలో చాలెంజింగ్ హీరో దర్శన్ అరెస్ట్ కావడం తీవ్ర సంచలనం రేపింది. తన ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్య మెసేజ్ పంపుతున్నాడని ఓ వ్యక్తిని హత్య చేయించిన ఘటనలో దర్శన్ ని అరెస్ట్ చేశారు పోలీసులు.

రేణుకాస్వామి ఎవరు? అతనికి పవిత్ర గౌడకి సంబంధమేంటీ? వెలుగులోకి సంచలన నిజాలు!

సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు వరుసగా సెలబ్రెటీలు అరెస్ట్ అవుతున్నారు.ఇప్పటికే బెంగుళూరు రేవ్ పార్టీలో తెలుగు నటి హేమ అరెస్ట్ అయ్యారు. బాలికపై అత్యాచారం కేసులో మాలీవుడ్ నటుడు కులికల్ జయచంద్రన్ అరెస్ట్ అయ్యాడు. తాజాగా హత్య కేసులో కన్నడ ఛాలెంజింగ్ హీరో దర్శన్ అరెస్ట్ చేశారు కామాక్షి పాళ్య పోలీసులు. తమ అభిమాన హీరో అరెస్ట్ కావడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ హత్య కేసులో దర్శన్ తో పాటు మరో పదిమందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కన్నడ ఇండస్ట్రీలో ఎంతో గొప్ప స్టార్ డమ్.. కోట్ల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో దర్శన్ హత్య కేసులో అరెస్ట్ కావడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.వివరాల్లోకి వెళితే..

కన్నడ ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరు దర్శన్. ఆయన నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. అలాంటి అగ్ర హీరో ఇప్పుడు హత్య కేసులో అరెస్ట్ కావడంతో చర్చనీయాంశంగా మారింది. స్టార్ హీరో అయి ఉండి దర్శన్ ఓ మామూలు వ్యక్తిని ఎందుకు చంపాడు అన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ హత్యకు గురైన రేణుకాస్వామి ఎవరు? ఆయన పవిత్ర గౌడ విషయంలో ఏం తప్పు చేశాడు? దర్శన్ ఫ్యామిలీకి స్వామికి ఉన్న సంబంధం ఏంటీ? అన్న విషయంపై చర్చ నడుస్తుంది. అందుతున్న సమాచారం మేరకు రేణుకస్వామి చిత్రదుర్గంలో లక్ష్మీ వెంకటేశ్వర బరంగేసి నివాసి. ఆయన ఓ మెడికల్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. శనివారం (జూన్ 8) ఇంటి నుంచి బయలుదేరిన స్వామి శవమై కనిపించాడు. దీంతో పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు.

పోలీసులు దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. రేణుకాస్వామి హత్య కేసులో హీరో దర్శన్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే మైసూర్ లోని ఫామ్ హౌజ్ లో అరెస్ట్ చేసి బెంగుళూరు‌కు తరలించారు. రేణు స్వామి శనివారం ఇంటి నుంచి బయలు దేరి ఆదివారం సుమనహళ్లిలోని సత్య అనుగ్రహ అపార్ట్‌మెంట్ సమీపంలో కల్వర్ట్ లో శవంగా కనిపించాడు. రేణుకా స్వామిని తీవ్రంగా కొట్టి హత్యచేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో కొంతమందిని అరెస్ట్ చేసి విచారించగా వారు హీరో దర్శన్ సూచన మేరకు హత్య చేసినట్లు అంగీకరించడంతో ఆయను అరెస్ట్ చేశారు. హత్యకు గల కారణం ఇటీవల మృతుడు రేణుకాస్వామి.. నటి పవిత్ర గౌడకు అసభ్య మెసేజ్, అశ్లీల ఫోటోలు పంపడంతో ఆమె దర్శన్ కి ఫిర్యాదు చేసింది. దీంతో కోపంతో దర్శన్.. రేణుకా స్వామిని హత్య చేయించడానికి రౌడీలను ప్రేరేపించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే చనిపోయిన రేణుకాస్వామి.. దర్శన్ అతని ఫ్యామిలీకి హార్డ్ కోర్ అభిమాని. దర్శన్, విజయలక్ష్మి కుటుంబ గురించి ఆలోచించే రేణుకాస్వామి.. పవిత్ర గౌడ నిండు కుటుంబంలో చిచ్చు పెట్టిందన్న ద్వేశంతో ఆ పని చేసినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ఓ వ్యక్తి మృతికి కారణం అయిన దర్శన్ ని అరెస్ట్ చేయడం.. ఆయన కెరీర్ కి మచ్చ అంటున్నారు అభిమానులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి