iDreamPost

భార్య కోసం అంగ ప్రదక్షిణలు చేసిన సీనియర్ హీరో.. వీడియో వైరల్

Hero Circumambulation For Wife: చాలా తక్కువ మంది భార్య కోసం ఆలోచిస్తారు. భార్య గెలుపు కోసం ఆలోచిస్తారు. భార్య గెలవాలని కోరుకుంటారు. అలాంటి వారిలో సినీ రంగానికి చెందిన వారు కూడా ఉంటారు. తాజాగా ఒక సీనియర్ హీరో తన భార్య కోసం గుడిలో అంగ ప్రదక్షిణలు చేశారు.

Hero Circumambulation For Wife: చాలా తక్కువ మంది భార్య కోసం ఆలోచిస్తారు. భార్య గెలుపు కోసం ఆలోచిస్తారు. భార్య గెలవాలని కోరుకుంటారు. అలాంటి వారిలో సినీ రంగానికి చెందిన వారు కూడా ఉంటారు. తాజాగా ఒక సీనియర్ హీరో తన భార్య కోసం గుడిలో అంగ ప్రదక్షిణలు చేశారు.

భార్య కోసం అంగ ప్రదక్షిణలు చేసిన సీనియర్ హీరో.. వీడియో వైరల్

కొంతమంది భర్తే లోకంగా, భార్యే ప్రపంచంగా జీవిస్తుంటారు. వారి శ్రేయస్సు కోసం దేవాలయాలను సందర్శిస్తుంటారు. దేవుళ్లను మొక్కుతుంటారు. కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి మరీ మొక్కులు తీర్చుకుంటారు. ఇటీవల ఓ వ్యక్తి తన బావమరిది కోసం ఏకంగా 70 కి.మీ. మోకాళ్ళపై నడిచి ప్రేమను చాటుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బావమరిది త్వరగా కోలుకుంటే ఐనవోలు మల్లన్న ఆలయానికి మోకాళ్లపై నడుచుకుంటూ వస్తానని మొక్కుకున్నాడు. బావమరిది ఆరోగ్యం కుదుటపడడంతో మొక్కు చెల్లించుకున్నాడు. ఇలా తాము అనుకున్నది జరిగితే మొక్కు చెల్లించుకునేది ఒకరు.. అనుకున్నది జరగాలి అంటూ అంగ ప్రదక్షిణలు చేసేది కొందరు.

తాజాగా ఒక సీనియర్ హీరో తన భార్య కోసం గుడిలో అంగ ప్రదక్షిణలు చేశారు. ఆ హీరో అనేక తెలుగు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. అల్లు అర్జున్, మహేష్ బాబు, బాలకృష్ణ వంటి హీరోలతో నటించారు. ఈయన కూతురు కూడా ఇప్పుడు ఒక స్టార్ నటి అయిపోయారు. ఒక పక్క నెగిటివ్ రోల్స్ చేస్తూ.. మరో పక్క లీడ్ రోల్స్ చేస్తూ సత్తా చాటుతున్నారు. ఆమె బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలో కూడా నటించారు. ఆమె మరెవరో కాదు వరలక్ష్మి శరత్ కుమార్. ఆమె తండ్రే ఇప్పుడు సినీ నటి రాధికా శరత్ కుమార్ కోసం గుడిలో అంగ ప్రదక్షిణలు చేశారు. 

A senior hero who performed Anga Pradakshina for his wife 01

దీనికి కారణం రాధికా శరత్ కుమార్ మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో విరుద్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తొలివిడతలో భాగంగా తమిళనాడులో ఏప్రిల్ 19న ఎన్నికల పోలింగ్ జరిగింది. జూన్ 4న ఫలితాల వెల్లడి కారణంగా.. రాధికా గెలవాలని నటుడు, బీజేపీ నేత శరత్ కుమార్ విరుద్ నగర్ లోని శ్రీ పరాశక్తి మరియమ్మన్ గుడిలో అంగ ప్రదక్షిణలు చేశారు. ఆయన భార్యతో పాటు నరేంద్ర మోదీ కూడా ప్రధానిగా గెలవాలని.. మూడోసారి ఆయన ప్రధాని కావాలని.. ఎంపీగా రాధికా విజయం సాధించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగానే భార్య రాధికా, సన్నిహితుల సమక్షంలో ఆయన పొర్లు దండాలు పెట్టారు. శరత్ కుమార్ తో పాటు రాధికా కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి