iDreamPost
android-app
ios-app

18 ఏళ్ల తర్వాత.. కల్కి సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇస్తున్న నటి ఎవరంటే?

Senior Artist In Kalki 2898 AD Movie: కల్కి 2898 ఏడీ మూవీపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు మూవీ టీమ్ ఇస్తున్న అప్ డేట్స్ చూస్తుంటే మూవీ మీద అంచనాలు ఆకాశానికి చేరుతున్నాయి.

Senior Artist In Kalki 2898 AD Movie: కల్కి 2898 ఏడీ మూవీపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు మూవీ టీమ్ ఇస్తున్న అప్ డేట్స్ చూస్తుంటే మూవీ మీద అంచనాలు ఆకాశానికి చేరుతున్నాయి.

18 ఏళ్ల తర్వాత.. కల్కి సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇస్తున్న నటి ఎవరంటే?

ప్రస్తుతం తెలుగు సినిమా లవర్స్, ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కల్కి 2898 ఏడీ మూవీ కోసమే ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ నుంచి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మూవీలో ఇప్పటికే చాలానే అద్భుతాలు చూశారు. ఇంకా మరెన్నో దాచారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిలీజ్ వరకు ఒక్కో విషయాన్ని చెప్పుకుంటూ పోయినా కూడా స్క్రీన్ మీద మాత్రం మీరు మెస్మరైజ్ అయ్యే స్టఫ్ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ఈ కల్కి సినిమాతో ఒక నటి దాదాపుగా 18 ఏళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది అని మీకు తెలుసా? అధికారికంగా సినిమా యూనిట్ ఆ విషయాన్ని కన్ఫామ్ చేశారు.

కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్, ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొణె కాకుండా.. డజనకు పైగా బిగ్ స్టార్స్ ఉన్నారు అనే మాట అందరికీ తెలిసిందే. అయితే ఇందులో అందరినీ రివీల్ చేయలేదు. ట్రైలర్ లో కూడా కొందరిని మాత్రమే హైలెట్ చేశారు. ఇంకా హైలెట్ చేయకుండా దాచి ఉంచిన క్యామియోలు చాలానే ఉన్నాయి. వాటి గురించి వస్తున్న గాసిప్స్ వింటుంటే ప్రభాస్ ఫ్యాన్స్ గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అయితే ఈ సీనియర్ నటిని ట్రైలర్ లో కూడా రివీల్ చేశారు. కానీ, కేవలం రెండు మూడు ఫ్రేములు మాత్రమే ఉంటుంది. అందుకే ఇప్పుడు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి.. ఆమె కల్కిలో నటిస్తోంది అనే విషయాన్ని కన్ఫామ్ చేశారు.

ఒకప్పుడు టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగింది. అయితే ఆ నటి దాదాపుగా 18 ఏళ్లుగా తెలుగు తెరకు దూరంగా ఉంటోంది. ఇప్పుడు మళ్లీ కల్కి 2898 ఏడీ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఆమె మరెవరో కాదు.. సీనియర్ హీరోయిన్ శోభన. కల్కి సినిమా ట్రైలర్ లో ఆమె ఫేస్ రివీల్ చేశారు. కానీ, చాలా తక్కువ సమయం కావడంతో అంతా గుర్తుపట్టలేదు. ఇప్పుడు తాజాగా పోస్టర్ రావడంతో అందరూ వావ్ అంటున్నారు. పైగా ఆమె క్యారెక్టర్ కూడా రివీల్ చేశారు. శోభన చేస్తున్న పాత్ర పేరు మరియం. కల్కి సినిమాలో ఎంతో మంది మార్పు కోసం, కొత్త ఆశ కోసం, కల్కి రాకకోసం ఎదురుచూస్తున్నట్లు చూపించారు. వారిలో శోభన కూడా ఒకరిగా చూపించారు.

ఇంక కల్కి సినిమా విషయానికి వస్తే.. రన్ టైమ్ 2 గంటల 55 నిమిషాలకు లాక్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. అలాగే యూ/ఏ సర్టిఫికేట్ కూడా దక్కింది అంటున్నారు. ఇంక వీటన్నింటికి మించిన వార్త ఏంటంటే.. కల్కి మూవీ సెన్సార్ రివ్యూ బాగా వైరల్ అవుతోంది. సినిమా ఇండియన్ సినిమాలోనే మాస్టర్ పీస్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో ఉంది సినిమా అంటూ కితాబు ఇచ్చేశారు. యాక్షన్, ఎమోషన్, ఇతిహాస గాథలకో కూడిన కల్కి 2898 ఏడీ మూవీ వరల్డ్ వైడ్ గా ఉన్న ప్రేక్షకులను మెప్పిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. మరి.. 18 ఏళ్ల తర్వాత కల్కి సినిమాతో శోభన ఏంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmarsbahisHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet giriş