iDreamPost

పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశా! సీనియర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

పెళ్లి చేసుకుని తాను పెద్ద తప్పు చేశానని.. ఓ సీనియర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేసింది? ఆ హీరోయిన్ ఎవరు? ఆ వివరాలు..

పెళ్లి చేసుకుని తాను పెద్ద తప్పు చేశానని.. ఓ సీనియర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేసింది? ఆ హీరోయిన్ ఎవరు? ఆ వివరాలు..

పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశా! సీనియర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ఇండస్ట్రీకి వచ్చే హీరోలు, హీరోయిన్ లు ఓ రేంజ్ కు వచ్చాకే సెటిల్ అవ్వాలని అనుకుంటారు. కానీ కొన్ని కొన్ని ఊహించని కారణాల వల్ల కొందరు నటీ, నటులు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కొన్నాళ్లకే పెళ్లి చేసుకుని సెటిల్ అవుతారు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ 30 సంవత్సరాలు దాటినా గానీ.. కెరీర్ కెరీర్ అంటూ బ్యాచిలర్ లైఫ్ నే ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఓ సినియర్ హీరోయిన్ తాను ఆ ఏజ్ లో పెళ్లి చేసుకుని జీవితంలో పెద్ద తప్పు చేశానని షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

రేవతి.. 90వ దశకంలో తన నటనతో ఎంతో మంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. డైరెక్టర్ రేలంగి నరసింహరావు తెరకెక్కించిన ‘మానసవీణ’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం ‘గాయం’లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి క్యారెక్టర్లు చేస్తూ.. బిజీగా ఉంటోంది. లోఫర్, సైజ్ జీరో, మేజర్ లాంటి ఎన్నో తెలుగు చిత్రాల్లో కీలక పాత్రల్లో మెరిసింది. ఇక దర్శకురాలిగా కూడా తనదైన ముద్రవేసుకుంది.

ఇదిలా ఉండగా..  తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేవతి.. తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించింది. “నేను 17 సంవత్సరా వయసులోనే నటించడం ప్రారంభించాను. మూడు ఏళ్లు నటించిన తర్వాత 20 సంవత్సరాలకే పెళ్లి చేసుకున్నాను. వివాహం తర్వాత ఏడాది పాటు నటించలేదు. కానీ ఆ తర్వాత ఇష్కీ వాసల్, దేవర మగన్ లాంటి మంచి చిత్రాలు చేశాను. పెళ్లి తర్వాత చాలా సినిమాలు చేయలేకపోయాను. దాంతో ఇంత త్వరగా పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశాననిపించింది. ఎన్నో మంచి మూవీలు చేసిన తర్వాత వివాహం చేసుకుంటే బాగుండేదనిపించింది” అంటూ చెప్పుకొచ్చింది రేవతి. 1966 జూలై 8న కొచ్చిలో జన్మించిన రేవతి.. మాతృభాష మలయాళంతో పాటుగా తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తల్లి పాత్రలు పోషిస్తూ.. ఇండస్ట్రీలో రాణిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి