iDreamPost
android-app
ios-app

Sekhar Kammula: 15 సంవత్సరాల తర్వాత లీడర్ 2. హీరో ఎవరంటే?

  • Published Feb 01, 2024 | 2:23 PM Updated Updated Feb 01, 2024 | 2:23 PM

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో అంతా సిక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే సుమారు 15 సంవత్సరాల క్రితం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఓ చిత్రానికి.. ఇప్పుడు సిక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో అంతా సిక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే సుమారు 15 సంవత్సరాల క్రితం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఓ చిత్రానికి.. ఇప్పుడు సిక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

  • Published Feb 01, 2024 | 2:23 PMUpdated Feb 01, 2024 | 2:23 PM
Sekhar Kammula: 15 సంవత్సరాల తర్వాత లీడర్ 2. హీరో ఎవరంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల చిత్రాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. ముఖ్యంగా యూత్ ఈ దర్శకుడి చిత్రాలకు ఫిదా అవ్వాల్సిందే. అంత అద్భుతంగా రియాలిటీని తెరపైన చూపించి.. అందరిని సరికొత్త ప్రపంచానికి తీసుకుని వెళ్తాడు శేఖర్ కమ్ముల. ఇప్పుడు టాలీవుడ్ లో దాదాపు ఎంతో ప్రముఖ నటులకు.. మంచి డెబ్యూస్ అందించి వారిని ప్రేక్షకులకు పరిచయం చేసింది కూడా ఈ దర్శకుడే. దీనితో ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల చిత్రాలకు, ఆయన కథలకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆఖరిగా ఆయన దర్శకత్వం వహించిన సినిమా “లవ్ స్టోరీ”. ఆ తర్వాత ఈ దర్శకుడి నుంచి ఎటువంటి అప్ డేట్ లేదు. కానీ, ఇప్పుడు సుమారు 15 సంవత్సరాల క్రితం వచ్చిన ఓ హిట్ చిత్రానికి సిక్వెల్ గా .. శేఖర్ కమ్ముల నెక్స్ట్ ఫిల్మ్ వుండబోతుందనే వార్త వినిపిస్తోంది.

2010లో సమకాలీన రాజకీయ వ్యవస్థల గురించి శేఖర్ కమ్ముల తెరపైన చూపించిన తీరు ఎవరు మర్చిపోలేరు. అదే దగ్గుబాటి రానా ప్రధాన పాత్ర పోషించిన “లీడర్” సినిమా. పైగా లీడర్ రానా కు డెబ్యూ ఫిల్మ్ అవ్వడంతో అభిమానులకు ఆ చిత్రం చాలా స్పెషల్. ఈ చిత్రానికి ముందు వరకు హ్యాపీ డేస్, గోదావరి, ఆనంద్ లాంటి సాఫ్ట్ సినిమాలు తీసిన శేఖర్ కమ్ముల, తనలోని మరొక యాంగిల్ ను లీడర్ ద్వారా చూపించాడు. రాజకీయంగా సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను కళ్ళకు కట్టినట్లు.. మంచి ఎమోషన్ తో తెర పైన చూపించాడు. ఆ సమయంలో లీడర్ సూపర్ డూపర్ హిట్ కాకపోయినా .. మంచి కలెక్షన్లే తెచ్చిపెట్టింది. ఒకవేళ ఇప్పడున్న రీరిలీజ్ ట్రెండ్ లో లీడర్ ను విడుదల చేస్తే.. బాక్స్ ఆఫీస్ రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం. అంతేకాకుండా రానా కు కూడా ఆ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే, ఎప్పటినుంచో లీడర్ చిత్రానికి సిక్వెల్ కావాలని డిమాండ్ చేస్తున్నారు మూవీ లవర్స్.

కాగా, దానికి తగినట్టే శేఖర్ కమ్ముల కూడా కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ధనుష్, నాగార్జునలతో ముంబై బ్యాక్ డ్రాప్ లో మల్టీ స్టారర్ తీస్తున్నాడు ఈ దర్శకుడు. అయితే ఇదే ఏషియన్ బ్యానర్ కు మూడో కమిట్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్నీ తాజాగా ప్రకటించారు. కానీ క్యాస్టింగ్ ఎవరనేది రివీల్ చేయలేదు. అయితే, అక్కడ నడుస్తున్న టాక్ ప్రకారం ఈ చిత్రం “లీడర్-2” అని భావిస్తున్నారు. ఇప్పడున్న రాజకీయ పరిస్థితులతో పాటు.. రాష్ట్ర విభజన జరిగాక పరిస్థితుల్లో వచ్చిన ఎన్నో మార్పులను.. లీడర్ 2 లో చూపించబోతున్నట్టు తెలిసింది. ఇప్పటివరకు ఈ వివరాలు మాత్రమే బయటకు వచ్చాయి.

ఇక ఈ సిక్వెల్ లో రానానే కొనసాగుతాడా లేక మరో హీరో ఎంట్రీ ఇస్తాడా. ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది. ఇలా మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం వేచి చూడాలి. రానా ఇప్పటికే నేనే రాజు నేనే మంత్రి ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో చేశాడు. కాబట్టి రాక్షస రాజు కూడా ఈ నేపథ్యంలోనే ఉంటుంది. అలా చూసినట్లయితే లీడర్ 2కి ఎస్ చెబుతాడా లేదానేది వేచి చూడాలి. కానీ, అభిమానులు మాత్రం లీడర్-2 లో కూడా రానా నే కంటిన్యూ అయితే.. బావుంటుందని భావిస్తున్నారు. ఇకపోతే ధనుష్, నాగార్జున మూవీ పూర్తవ్వడానికి ఇంకో సంవత్సరం పడుతుంది. ఆలోపు లీడర్ 2 స్క్రిప్ట్ ఒక కొలిక్కి వచ్చేలా ఉంది. ఇక శేఖర్ కమ్ములకు రానాతో పాటు మరో ఇద్దరు ఆప్షన్లలో ఉన్నారట. ఎవరెనేది ఇప్పట్లో బయటకు రాకపోవచ్చు. కాబట్టి దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరి, లీడర్-2 సిక్వెల్ విషయంలో నడుస్తున్న టాక్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap