iDreamPost
android-app
ios-app

ట్రైలర్ రివ్యూ: 24 ఏళ్ల తర్వాత వస్తున్న గ్లాడియేటర్ 2.. ఈసారి అంతకు మించి!

Gladiator 2 Trailer Review In Telugu: గ్లాడియేటర్ ఈ చిత్రానికి వరల్డ్ సినిమాలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పుడు ఈ మూవీకి సరిగ్గా 24 ఏళ్ల తర్వాత సీక్వెల్ రాబోతోంది. అందుకు సంబంధించి ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు.

Gladiator 2 Trailer Review In Telugu: గ్లాడియేటర్ ఈ చిత్రానికి వరల్డ్ సినిమాలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పుడు ఈ మూవీకి సరిగ్గా 24 ఏళ్ల తర్వాత సీక్వెల్ రాబోతోంది. అందుకు సంబంధించి ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు.

ట్రైలర్ రివ్యూ: 24 ఏళ్ల తర్వాత వస్తున్న గ్లాడియేటర్ 2.. ఈసారి అంతకు మించి!

వరల్డ్ సినిమాలో కొన్ని కొన్ని మూవీస్ కు ఒక చరిత్ర ఉంది. వాటికి భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ ఉన్నారు. వందల కొద్ది సినిమాల్లో వాటి రిఫరెన్స్ ఉంటుంది. యాక్షన్, ఎమోషన్, డ్రామా ఇలా ఏ ఆస్పెక్ట్ తీసుకున్న ఆ మూవీస్ ని తలదన్నే చిత్రాలు రావడం అసాధ్యం అని చెప్పచ్చు. కొన్నిసార్లు అలాంటి మూవీస్ ని మరిపించాలి అంటే మళ్లీ అదే సినిమా రావాలి ఏమో? ఇప్పుడు ఈ చిత్రం విషయంలో అదే జరుగుతోంది. గ్లాడియేటర్ అనే సినిమాకి ఒక చరిత్ర ఉంది. ఆ సినిమాకి కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆ లిస్టులో మేకర్స్, స్టార్ హీరోలు కూడా ఉన్నారు. ఇప్పుడు సరిగ్గా 24 ఏళ్ల తర్వాత మల్లీ గ్లాడియేటర్ కి సీక్వెల్ వస్తోంది. తాజాగా ఆ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

2000 సంవత్సరంలో హాలీవుడ్ నుంచి వచ్చిన ఈ గ్లాడియేటర్ సినిమాకి ఎంతో గొప్ప హిస్టరీ ఉంది. ఈ మూవీని 103 మిలియన్ డాలర్లతో తెరకెక్కిస్తే ఏకంగా 465.4 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సినిమా గురించి తల్చుకునే అభిమానులు ఇంకా ఉన్నారు. మ్యాక్సిమస్ డెసిమస్ మెరీడియస్(రస్సెల్ క్రోవ్) యాక్షన్ కు ప్రతి సినిమా అభిమాని ఫిదా అయిపోయాడు. ఆ మూవీకి సీక్వెల్ అంటే.. అది కూడా ఇన్నేళ్ల తర్వాత దానికి న్యాయం చేయగలుగుతారా? అనే ప్రశ్న కచ్చితంగా వస్తుంది. అయితే ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఆ అనుమానం తీరిపోతుంది. ఎందుకంటే ఈ గ్లాడియేటర్ ట్రైలర్ ఎంతో అద్భుతంగా ఉంది.

గ్లాడియేటర్ సినిమాలో యాక్షన్ ఎక్కువే.. కానీ, గ్లాడియేటర్స్ చేసుకునే యుద్ధాలను ఎక్కువ చూపించారు. ఫీల్డ్ లో జరిగే యుద్ధాలు కాస్త తక్కువగా ఉంటాయి. కానీ, ఈసారి అన్ని విధాలుగా ఈ సినిమాని ఫుల్ ఆఫ్ యాక్షన్ డ్రామాగా మార్చేసినట్లు కనిపిస్తోంది. బానిసలు- గ్లాడియేటర్స్ గా మారతారు- గ్లాడియేటర్స్ స్వేచ్ఛను పొందుతారు అంటూ గట్టిగానే కథను చెప్పబోతున్నారు. ఇందులో హారోని ఒక అనాథగా పరిచయం చేశారు. అతడిని ఒక గ్లాడియేటర్స్ యజమాని సొంతం చేసుకుంటాడు. అతను మ్యాక్సిమస్ ని చూసి స్ఫూర్తిని పొందుతాడు. అతనిలా గొప్ప పోరాట యోధుడు కావాలి అనేది అతని లక్ష్యం. కథ పరంగా మాత్రం మొదటి భాగానికి కాస్త పోలికలు కనిపిస్తున్నాయి.

ఆ రోజుల్లో ఉన్న టెక్నాలజీతోనే గ్లాడియేటర్ ని ఒక మాస్టర్ పీస్ లా తీశారు. ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకుని అంతకన్నా అద్భుతంగా చూపిస్తున్నారు. పైగా రోమ్ నగరాన్ని ఎంతో అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఎంపరర్ ని ఎదిరించాలి అనేది హీరో కోరిక.. రోమ్ నగరాన్ని స్వాధీనం చేసుకోవాలి అనేది మరొకరి కోరిక.. తన జీవితాన్ని తనకు నచ్చినట్లు జీవించాలి.. దానికి ఎవరు అడ్డొచ్చినా చంపాలి అనేది ఎంపరర్ కోరిక. మొత్తానికి ఒక మంచి మాస్టర్ పీస్ అయితే లోడ్ అవుతోంది. ఈసారి అంతకు మించే ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, మీరు కచ్చితంగా కమోడస్ పాత్ర చేసిన జాక్విన్ ఫీనిక్స్ ని మాత్రం మిస్ అవుతారు. ఈ మూవీ నవంబర్ 22న థియేటర్లలోకి రాబోతోంది. మరి.. గ్లాడియేటర్ 2 ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి