iDreamPost
android-app
ios-app

Mahesh babu మహేష్ నోటి వెంట యాత్ర డైలాగ్

  • Published May 02, 2022 | 8:32 PM Updated Updated May 02, 2022 | 8:32 PM
  • Published May 02, 2022 | 8:32 PMUpdated May 02, 2022 | 8:32 PM
Mahesh babu మహేష్ నోటి వెంట యాత్ర డైలాగ్

స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర ఆధారంగా రూపొందిన యాత్ర సినిమా అంత సులభంగా మర్చిపోగలమా. అందులో మమ్ముట్టి నటన, మహి రాఘవ్ దర్శకత్వం ప్రేక్షకులను ఆ రోజులకు తీసుకెళ్లి గొప్ప అనుభూతినిచ్చాయి. నిజంగా ఇలాగే మాట్లాడుకుని ఉంటారన్నంత సహజంగా అందులో ఉన్న సంభాషణలు ఆడియన్స్ కి బాగా నచ్చేశాయి.

ఇప్పుడా టాపిక్ ఎందుకంటే మహేష్ బాబు కొత్త మూవీ సర్కారు వారి పాటలో యాత్ర డైలాగ్ ని వాడటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరోయిన్ కీర్తి సురేష్ మహేష్ దగ్గరకు వచ్చి తన ఇబ్బంది చెప్పుకుని కొంత డబ్బు అప్పు అడుగుతుంది. అప్పుడు ప్రిన్స్ తనదైన స్టైల్ లో నేనున్నా నేను విన్నా అంటూ చెప్పడం బాగా పేలింది.

దర్శకుడు పరశురామ్ కి ఈ ఐడియా ఎలా వచ్చిందో కానీ భలేగా క్లిక్ అయ్యింది. చాలా గ్యాప్ తర్వాత అప్పుడెప్పుడో దూకుడు చూశాక మళ్ళీ ఆ రేంజ్ కామెడీ టైమింగ్ ఇందులోనే కనిపిస్తోంది. అందుకే ఫ్యాన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకో పదే రోజుల్లో విడుదల కానున్న సర్కారు వారి పాటలో పోకిరి నాటి మహేష్ ని చూస్తామనే అంచనాలు భారీగా ఉన్నాయి. లెట్ సీ.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş