iDreamPost
android-app
ios-app

Varalaxmi Sarathkumar: వామ్మో వరలక్ష్మి పెళ్లి ఖర్చు రూ.200 కోట్లా.. తండ్రి ఏమన్నారంటే..!

  • Published Jul 08, 2024 | 11:36 AM Updated Updated Jul 08, 2024 | 11:36 AM

Varalaxmi Sarathkumar Wedding Cost: ప్రముఖ నటి వరలక్ష్మి శరత్‌ తాజాగా పెళ్లి పీటలు ఎక్కింది. ప్రియుడు నికోలాయ్‌ సచ్‌దేవ్‌ను వివాహం చేసుకుంది. ఈ క్రమంలో వరలక్ష్మి పెళ్లి ఖర్చుకు సంబంధించి ఓ వార్త తెగ వైరల్‌ అవుతోంది. ఆ వివరాలు..

Varalaxmi Sarathkumar Wedding Cost: ప్రముఖ నటి వరలక్ష్మి శరత్‌ తాజాగా పెళ్లి పీటలు ఎక్కింది. ప్రియుడు నికోలాయ్‌ సచ్‌దేవ్‌ను వివాహం చేసుకుంది. ఈ క్రమంలో వరలక్ష్మి పెళ్లి ఖర్చుకు సంబంధించి ఓ వార్త తెగ వైరల్‌ అవుతోంది. ఆ వివరాలు..

  • Published Jul 08, 2024 | 11:36 AMUpdated Jul 08, 2024 | 11:36 AM
Varalaxmi Sarathkumar: వామ్మో వరలక్ష్మి పెళ్లి ఖర్చు రూ.200 కోట్లా.. తండ్రి ఏమన్నారంటే..!

వరలక్ష్మి శరత్‌ కుమార్‌.. సౌత్‌లో ఈ నటిది ప్రత్యేక ప్రస్థానం. స్టార్‌ హీరో కుమార్తెగా.. హీరోయిన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రారంభంలో హీరోయిన్‌, గ్లామర్‌ పాత్రల్లో నటిస్తూ.. మెప్పించింది. ఆ తర్వాత తన పంథా మార్చుకుంది. క్యారెక్టర్‌ నచ్చితే చాలు.. ఏ పాత్రలో అయినా సరే యాక్ట్‌ చేయడానికి అయినా రెడీ అంటుంది. ఆ నిర్ణయం ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇప్పుడు సౌత్‌లో హీరోయిన్‌లకు పోటీగా.. పైగా అధిక ప్రాధాన్యత ఉన్న రోల్స్‌లో నటిస్తూ.. కెరీర్‌లో దూసుకుపోతుంది. వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న వరలక్ష్మి.. మొన్నటి వరకు ప్రేమ, పెళ్లి అంటే ప ఎద్దగా ఆసక్తి లేదన్నట్లు మాట్లాడేది. అలాంటి ఈ భామ.. ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని అందరికి సడెన్‌ షాక్‌ ఇచ్చింది. ఇక తాజాగా పెళ్లి పీటలు ఎక్కింది.

ముంబైకి చెందిన ఆర్ట్‌ గ్యాలరిస్ట్‌ నికోలాయ్‌ సచ్‌దేవ్‌తో కలిసి మూడు ముళ్ల బంధంలోకి ప్రవేశించింది వరలక్ష్మి శరత్‌ కుమార్‌. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకుందీ భామ. థాయ్‌లాండ్‌ వేదికగా జులై 2న వీరి వివాహం ఘనంగా జరిగింది. టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వరలక్ష్మి వివాహ వేడుకలో పాల్గొన్నారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇక వివాహానికి హాజరు కాలేని వారి కోసం చెన్నైలోని తాజ్ హోటట్‌లో ఘనంగా రిసెప్షన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు తమిళనాడు సీఎం స్టాలిన్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు.

వరలక్ష్మి పెళ్లి, రిసెప్షన్‌ వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అదే సమయంలో వరలక్ష్మి పెళ్లి ఖర్చు గురించి తమిళనాట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదేంటంటే.. ఈ భామ పెళ్లి కోసం ఆమె తండ్రి శరత్‌కుమార్‌.. ఏకంగా రూ. 200 కోట్లకు పైగానే ఖర్చు చేశారట. ఇప్పుడీ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీనిపై శరత్‌ కుమార్‌ స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘అంత డబ్బు ఎక్కడుందో నాకు తెలియదు.. అసలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టిస్తారో నాకు అర్థం కావడం లేదు. పెళ్లి కోసం అంత ఖర్చు చేయడం ఏంటి.. నేను ఎంతో సింపుల్‌గా నా బిడ్డ పెళ్లి చేశాను. నిజానిజాలు తెలుసుకోకుండా మీకు మీరే ఊహించుకుని.. తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి’’ అని కాస్త ఘాటుగా స్పందించారు.

ఇక వరలక్ష్మి శరత్‌ కుమార్‌.. వివాహం చేసుకున్న నికోలయ్‌ సచ్‌దేవ్‌ ముంబైలోని అత్యంత సంపన్నుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అక్కడ ఆయనకు సొంతంగా ఆర్ట్‌ గ్యాలరీ కూడా ఉంది. ఇక నికోలయ్‌ మొత్తం ఆస్తుల విలవు సుమారు 900 కోట్ల రూపాయలు అని జోరుగా ప్రచారం సాగుతుంది. అదలా ఉంచితే.. నికోలాయ్‌కు ఇది రెండో వివాహం. వరలక్ష్మి శరత్‌ కుమార్‌ కన్నా ముందే అతడికి మరో మహిళతో వివాహం అయ్యింది. అతడికి 15 ఏళ్ల కుమార్తె కూడా ఉంది.