iDreamPost
android-app
ios-app

డబుల్‌ ఇస్మార్ట్‌లో సంజయ్‌.. షాకింగ్‌ రెమ్యూనరేషన్‌!

ఇప్పుడు ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ కోసం సంజయ్‌ దత్‌ తీసుకున్న రెమ్యూనరేషన్‌కు సంబంధించిన వార్తలు....

ఇప్పుడు ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ కోసం సంజయ్‌ దత్‌ తీసుకున్న రెమ్యూనరేషన్‌కు సంబంధించిన వార్తలు....

డబుల్‌ ఇస్మార్ట్‌లో సంజయ్‌.. షాకింగ్‌ రెమ్యూనరేషన్‌!

టాలీవుడ్‌ స్టార్‌ దర్శకుడు పూరీ జగన్నాథ్‌- రామ్‌ పోతినేని కాంబినేషన్లో ప్రస్తుతం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 2019లో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. పేరుకు తగ్గట్టుగానే సినిమాను ఓ డబుల్‌ రేంజ్‌లో తీయడానికి పూరీ సిద్ధమయ్యారు. డబుల్‌ ఇస్మార్ట్‌ను ప్యాన్‌ ఇండియా లెవెలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు. అందుకే భారీ తారాగణాన్ని సైతం చిత్రంలో భాగం చేస్తున్నారు. డబుల్‌ ఇస్మార్ట్‌లో సంజయ్‌ దత్‌ విలన్‌గా నటిస్తున్నారు.

ఇందుకు సంబంధించి చాలా రోజుల క్రితమే అప్‌డేట్‌ వచ్చింది. ఇప్పుడు ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ కోసం సంజయ్‌ దత్‌ తీసుకున్న రెమ్యూనరేషన్‌కు సంబంధించిన వార్తలు మీడియాలో.. సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. సంజయ్‌ దత్‌ ఈ సినిమా కోసం ఏకంగా ఆరు కోట్ల రూపాయలు తీసుకున్నాడట. సంజయ్‌కు దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు ఇంత మొత్తం ఇవ్వడానికి సిద్దమయ్యారట. అయితే, ఈ రెమ్యూనరేషన్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

కాగా, పూరి జగన్నాథ్‌ చివరగా ‘లైగర్‌’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చింది. అయితే, ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అట్టర్‌ ప్లాపుగా నిలిచింది. ఈ సినిమా ప్లాపు కావటంతో పూరీ కొంత ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్లారు. అయినప్పటికీ కృంగిపోకుండా రెట్టించిన ఉత్సాహంతో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’కు శ్రీకారం చుట్టారు. మరి, డబుల్‌ ఇస్మార్ట్‌ కోసం సంజయ్‌ 6 కోట్ల రూపాయలు తీసుకున్నాడని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap