Swetha
యంగ్ హీరో సంగీత్ శోభన్ ఓ మిస్టరీ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా పేరు 'గ్యాంబ్లర్'. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసినప్పుడు.. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా గ్యాంబ్లర్ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

మ్యాడ్ లాంటి సినిమాలతో సంగీత్ శోభన్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ యంగ్ హీరో ఓ మిస్టరీ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా పేరు ‘గ్యాంబ్లర్’. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసినప్పుడు.. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా గ్యాంబ్లర్ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
‘యుద్ధం..జూదం ఒక్కటే! యుద్ధం ఎక్కడ మొదలుపెట్టాలో తెలియాలి.. జూదం ఎక్కడ ఆపాలో తెలియాలి’ అనే డైలాగ్ తోనే సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేసారు. టీజర్ చూస్తే మాత్రం సినిమా ఇంట్రెస్టింగ్ గానే ఉందని అనిపిస్తూ ఉంటుంది. అయితే మొత్తం కథ ఏంటో చెప్పకపోయినా.. కొన్ని కొన్ని హింట్స్ మాత్రం ఇచ్చారు. ఈ సినిమాకు ఎస్‌కే చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రాకింగ్ రాకేష్ ఓ కీలక పాత్రలో కనిపించారు.
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయట. జూన్ 6న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. మరి ఈ మిస్టరీ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి. అసలే జూన్ లో చాలా సినిమాలు రిలీజ్ కు ఉన్నాయి. ఇక ఈ రేస్ లో ఈ సినిమా ఏ స్థానాన్ని సంపాదించుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.