iDreamPost
android-app
ios-app

కుబేర ట్రైలర్ చూసి సందీప్ వంగా ఫిదా

  • Published Mar 10, 2024 | 6:37 PM Updated Updated Mar 10, 2024 | 6:38 PM

నిన్నమొన్న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహనరావు సంయుక్తంగా నిర్మిస్తున్న కుబేర అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది.శేఖర్ కూడా కనిపించడు కానీ, సందీప్ వంగా లాగే.....మొండి మనిషి. దేనికీ లొంగే రకం కాదు

నిన్నమొన్న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహనరావు సంయుక్తంగా నిర్మిస్తున్న కుబేర అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది.శేఖర్ కూడా కనిపించడు కానీ, సందీప్ వంగా లాగే.....మొండి మనిషి. దేనికీ లొంగే రకం కాదు

  • Published Mar 10, 2024 | 6:37 PMUpdated Mar 10, 2024 | 6:38 PM
కుబేర ట్రైలర్ చూసి సందీప్ వంగా ఫిదా

సందీప్ వంగా అంటేనే ఇప్పుడు పిచ్చ క్రేజ్. అర్జున్ రెడ్డి తెలుగులో, హిందీలో కబీర్ సింగ్, తర్వాత మొన్నమొన్నటి యానిమల్….ఇండియా మొత్తాన్ని కుదిపేశాయి. రామ్ గోపాల్ వర్మ తర్వాత రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్….ఇప్పుడు తాజాగా సందీప్ వంగా. బాలీవుడ్ బాబులకు కళ్లు బైర్లు కమ్మాయి. ఏంటా కలెక్షన్లు….ఏంటా సంచలనం? భయంకరమైన రికార్డు క్రియేట్ చేసింది సందీప్ యానిమల్.అటువంటి దర్శకుడు, ప్రపంచమంతా ట్రెండింగ్ లో ఉన్న సెన్సేషనల్ డైరెక్టర్ ఇంకొక డైరెక్టర్ సినిమా ట్రైలర్ చూసి ఎక్సైట్ మెంట్ తో ట్వీట్ చేయడం ఆ దర్శకుడికి తిరుగులేని బూస్ట్. ఆ ప్రాజెక్టుకి కూడా అత్యద్ధుతమైన క్రేజ్ ఎలిమెంట్. ఆ దర్శకుడే శేఖర్ కమ్ముల. ఆ సినిమాయే కుబేర. నిన్నమొన్న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహనరావు సంయుక్తంగా నిర్మిస్తున్న కుబేర అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. షాకింగ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది ట్రైలర్. నాగార్జునలాటి హీరో కూడా సినిమాలో ఉన్నా సరే నాగార్జునను సింగిల్ ఫ్రేమ్ లో కూడా చూపించలేదు డైరెక్టర్ శేఖర్.

శేఖర్ కూడా కనిపించడు కానీ, సందీప్ వంగా లాగే…..మొండి మనిషి. దేనికీ లొంగే రకం కాదు. ఏది చేయాలనుకుంటాడో, ఎలా తీయాలనుకుంటాడో, ఎందుకు ఎవరిని చూపించాలనుకుంటాడో….తన అవుట్ లుక్ తనదే. మొహమాటమ్స్ అస్సలు లేవు. ఒక్క థనుష్ మీదనే ట్రైలర్ ని బేస్ చేశాడు. అదీ చింపిరి గడ్డం, చిందరవందర డ్రస్….ఇలా డీ గ్లామర్డ్ గా చూపించడానికి గట్స్ కావాలి.ఈ స్టయిల్ సందీప్ వంగాకి బాగా నచ్చినట్టుంది పెద్ద మెసేజ్ పెట్టాడు తన ఎక్స్ హేండిల్ ద్వారా. ‘’కథ చెప్పడంలో శేఖర్ కమ్ములగారి నాణానికి మరోవైపు చూడ్డంతో చాలా ఎక్సైట్ మెంటుకి గురయ్యాను. టైటిల్ కూడా చాలా మిస్టీరియస్ గా ఉంది. పిక్చర్లోనూ, టైటిల్ లోనూ యూనిక్ సింబాలిజమ్ ఉంది. కుబేర ఎలా ఉంటుంది, శేఖర్ గారు ఎలా తీసుంటారు అనేది చూడాలని ఉవ్విళ్ళూరుతున్నాను.’’అని సందీప్ వంగా ట్వీట్ చేశాడు.

సందీప్ వంగా కుబేర సినిమా మీద, దర్శకుడిగా శేఖర్ కమ్ముల మీద చేసిన ట్వీట్ అగ్గి పుట్టించింది. దెబ్బకి శేఖర్ కమ్ముల బాలీవుడ్ లో కూడా పాప్యులర్ అయిపోయాడు. ఇంక సినిమా గురించి చెప్పనక్కర్లేదు. సునీల్ నారంగ్ అండ్ పుస్కూర్ రామ్మోహనరావు కాంబోకి బాలీవుడ్ బ్రాకెట్లో మంచి పేరుప్రతిష్టలే ఉన్నాయి. దాంతో పాటు సందీప్ వంగా కూడా మెచ్చుకుంటూ ట్వీట్ చేయడంతో బాలీవుడ్ మీడియా దాన్ని విపరీతంగా వైరల్ చేసిపారేసింది. ఇప్పుడు కుబేర నిజమైన పాన్ ఇండియా సినిమాగా కేక పుట్టించింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss