iDreamPost
android-app
ios-app

సందీప్ రెడ్డి మాస్టర్ ప్లాన్ .. స్పిరిట్ తో సునామి.. బడ్జెట్ ఏకంగా 1000 కోట్లు !

  • Published Oct 08, 2024 | 11:46 AM Updated Updated Oct 08, 2024 | 11:46 AM

Spirit Movie Update: సందీప్ రెడ్డి వంగ.. ఈ దర్శకుడితో కనీసం ఒక సినిమా అయినా తీయాలని స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు సందీప్ ప్రభాస్ తో కమిట్ అయిన స్పిరిట్ సినిమాకు భారీ బడ్జెట్ ను ప్లాన్ చేస్తున్నాడట. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాం.

Spirit Movie Update: సందీప్ రెడ్డి వంగ.. ఈ దర్శకుడితో కనీసం ఒక సినిమా అయినా తీయాలని స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు సందీప్ ప్రభాస్ తో కమిట్ అయిన స్పిరిట్ సినిమాకు భారీ బడ్జెట్ ను ప్లాన్ చేస్తున్నాడట. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాం.

  • Published Oct 08, 2024 | 11:46 AMUpdated Oct 08, 2024 | 11:46 AM
సందీప్ రెడ్డి మాస్టర్ ప్లాన్ .. స్పిరిట్ తో సునామి..  బడ్జెట్ ఏకంగా 1000 కోట్లు !

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ శర వేగంతో దూసుకుపోతున్నాడు. నిమిషం తీరిక లేకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనితో ప్రభాస్ స్పీడ్ కు అందరు ఆశ్చర్య పోతున్నారు. కల్కి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రభాస్ వెంటనే రాజాసాబ్ షూటింగ్ తో బిజీ అయ్యాడు. ఇక ఆ తర్వాత హను రాఘవపూడి తో ఫౌజీ షూటింగ్ లో జాయిన్ అవుతాడు. ఇవి కాకుండా సలార్-2, కల్కి-2 సినిమాలు ఎలాగూ ఉన్నాయి. వీటి అన్నిటికి మించి సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమా. సో ఇలా ప్రభాస్ అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టడానికి రెడీ గా ఉన్నాడు. అయితే త్వరలో ప్రభాస్ బర్త్ డే ఉంది కాబట్టి.. ఈ సినిమాలకు సంబంధించిన ఏమైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తారేమో అని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో స్పిరిట్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. అదేంటో చూసేద్దాం.

తీసింది కొద్దీ సినిమాలే అయినా కూడా.. ఇండస్ట్రీలో సందీప్ పేరు మోత మోగిపోతుంది. సందీప్ కథ చెప్పే విధానం చాల డిఫరెంట్ గా ఉంటుంది. అతను డిజైన్ చేసే హీరో రోల్స్ ప్రేక్షకులకు కిక్ ఇస్తాయి. ఇక కంటెంట్ ను చాలా బలమైన క్యారెక్టర్స్ తో ఎలివేట్ చేయడంతో.. ప్రతి ఒక్కరు త్వరగా కనెక్ట్ అవుతారు. దీనితో సందీప్ తో సినిమాలు తీయడానికి స్టార్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సందీప్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాకు ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికి ఈ బడ్జెట్ లెక్కలు మారడం మూడో సారి. మొదట 500 కోట్లను చెప్పారు.. తర్వాత 750 కోట్లుగా మార్చారు. ఇక ఇప్పుడు ఈ లెక్కలు 1000 కోట్లకు చేరాయి. సలార్ , కల్కి సినిమాల హిట్స్ తర్వాత.. స్పిరిట్ తో పాన్ ఇండియా మార్కెట్ ను రూల్ చేయడం కోసమే ఈ బడ్జెట్ ను కేటాయించినట్లు తెలుస్తుంది. పైగా ఈ సినిమాలో నటించేందుకు కొరియా , చైనీస్ స్టార్స్ ను కూడా తీసుకుని వస్తున్నారట. సాధారణంగా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని కారణాల వలన.. మూవీ బడ్జెట్ పెరుగుతుంది. కానీ అసలు షూట్ స్టార్ట్ అవ్వకముందే బడ్జెట్ పెరగడం అనేది చిన్న విషయం కాదు.

చూడబోతుంటే సందీప్ పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నాడని అనిపిస్తుంది. 3 కోట్లు పెట్టి తీసిన అర్జున్ రెడ్డికి 50 కోట్ల వసూళ్లు వచ్చాయి. అదే 50 కోట్లతో అర్జున్ రెడ్డిని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేస్తే.. 250 కోట్లు వచ్చాయి. అలా 250 కోట్లతో యానిమల్ తీసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ సినిమా దాదాపు 900 కోట్లు రాబట్టింది. ఇప్పుడు ఈ 900 కోట్లకు మరో 100 కోట్లు యాడ్ చేసి.. టోటల్ 1000 కోట్లతో స్పిరిట్ ను తీయనున్నాడు. మరి ఇది ఎంత రాబడుతుందో చూడాలి . ఇప్పటికే స్పిరిట్ మూవీ మాటలు , కథ , కథనం అన్ని పూర్తయ్యాయట. హిందీ , మలయాళం , కన్నడ , తమిళ్ తో పాటు.. బెంగాలీ , పంజాబీ , మరాఠి , కొరియన్ , చైనీస్ , జాపనీస్ , ఇటాలియన్ , రష్యన్ , జర్మన్ లో కూడా దీనిని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడు సందీప్.

ఇక ఈ సినిమాలో అనిల్ కపూర్ , సైఫ్ అలీ ఖాన్, కరీనా స్పెషల్ రోల్స్ లో నటించనున్నారు. అయితే ఈ 1000 కోట్లలో , 300 కోట్లు ప్రభాస్ రెమ్యునరేషన్ , 300 కోట్లు మిగిలిన స్టార్స్ కు , మరో 300 కోట్లు మేకింగ్ .. 50 నుంచి 100 కోట్లు మూవీ ప్రమోషన్స్ కు డివైడ్ చేసినట్లు సమాచారం. పైగా ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ కాబట్టి.. దానికోసం స్పెషల్ టెక్నాలజీ ఉపయోగించి AI ద్వారా ప్రభాస్ ను చూపించనున్నారట. కేవలం దాని కోసం మాత్రమే 120 నుంచి 150 కోట్లు ఖర్చు అవుతుందని .. అందుకే మూవీ బడ్జెట్ 750 నుంచి 1000 కోట్లకు చేరిందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ మూవీకి సంబందించిన అప్డేట్స్ ఎప్పుడు వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.