Sandeep Reddy Vanga: ప్రశాంత్ నీల్ ని వెనక్కు నెట్టిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ని తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వెనక్కి నెట్టేశాడు. మరి.. అసలు ఏం జరిగింది? సందీప్ ఎలా పైచేయి సాధించాడో చూద్దాం.

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ని తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వెనక్కి నెట్టేశాడు. మరి.. అసలు ఏం జరిగింది? సందీప్ ఎలా పైచేయి సాధించాడో చూద్దాం.

సందీప్ రెడ్డి వంగా.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈ డైరెక్టర్ పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 1న యానిమల్ సినిమా రిలీజ్ అయితే ఇప్పటికీ ఆ మూవీ గురించి చర్చ జరుగుతూనే ఉంది. అయినా అందులో ఆశ్చర్యం ఏముందిలెండి. అప్పుడెప్పుడో 2017లో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటారు. మరి.. సందీప్ మార్క్ అంత డీప్ గానే ఉంటుంది. ఇప్పుడు యానిమల్ తో కూడా అలాంటి ఒక ఇంపాక్ట్ నే క్రియేట్ చేశాడు. ఇంతవరకు అంతాబాగానే ఉంది. కానీ, తన సినిమాతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయడం మాత్రమే కాకుండా.. రికార్డులు క్రియేట్ చేశాడు.. అవార్డులు అందుకున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నాడు.

యానిమల్ సినిమా గురించి పాన్ ఇండియా లెవల్లో ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సినిమా జనాల్లోకి అంత బాగా వెళ్లింది. నిజానికి ఏ సర్టిఫికేట్ అయినా కూడా రూ.750 కోట్లకుపైగా కలక్షన్స్ రాబట్టి రికార్డులు క్రియేట్ చేసింది. ఇది బాక్సాఫీస్ ఊచకోత అనే చెప్పాలి. ఇప్పుడు ఓటీటీలో దుమ్ము రేపుతోంది. అంతేకాకుండా.. నెట్ ఫ్లిక్స్ లో కూడా సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా సలారోడికి పెద్ద పోటీగా నిలిచింది. యానిమల్ సినిమా లేకపోతే సలార్ మూవీకి నెట్ ఫ్లిక్స్ లో అడ్డు లేదనే చెప్పాలి. విదేశాల్లో కూడా సలార్ దుమ్మురేపుతోంది. కానీ, నెట్ ఫ్లిక్స్ ఇండియాలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఇక్కడ యానిమల్ అడ్డంగా నిలబడిపోతున్నాడు.

నెట్ ఫ్లిక్స్ ఇండియాలో యానిమల్ సినిమా టాప్ 1లో ట్రెండ్ అవుతోంది. సలార్ మాత్రం రెండో స్థానంతో సరిపెట్టుకోక తప్పడం లేదు. ఈ నేపథ్యంలోనే సందీప్ రెడ్డి వంగా పేరు మరోసారి వైరల్ అవుతోంది. సలార్ సినిమాలో ప్రభాస్, ప్రశాంత్ నీల్ లాంటి ఇప్పటికే పాన్ ఇండియా లెవల్లో మార్క్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ఉన్నారు. కానీ, ఇటువైపు మాత్రం సందీప్ రెడ్డి వంగా, రణ్ బీర్ కపూర్ మాత్రమే ఉన్నారు. కానీ, వీళ్లిద్దరు మ్యాజిక్ చేశారు. సందీప్ రెడ్డి మార్క్ డైరెక్షన్, డైలాగ్స్ అన్నీ కూడా ప్రేక్షకులకు నిద్రపట్టనివ్వకుండా చేస్తున్నాయి. అందుకే థియేటర్లలో అంత సత్తా చాటినా కూడా ఓటీటీలో కూడా దూసుకుపోతోంది. అయితే అన్ కట్ వర్షన్ వస్తుందని చెప్పిన సందీప్ వంగా మాత్రం ఆ విషయంలో నిరాశ పరిచాడు.

మరోవైపు యానిమల్ సినిమా 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో కూడా సత్తా చాటుతోంది. ఏకంగా 6 అవార్డులతో అదరగొట్టింది. ఉత్తమ నటుడిగా రణ్ బీర్ కపూర్, ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ గా అవార్డు, అర్జన్ వెయిలీ సాంగ్ కు ఉత్తమ సింగర్ గా భూపిందర్ బాబల్, ఉత్తమ్ బ్యాగ్రౌండ్ స్కోర్ కు రామేశ్వర్ ఇలా ఏకంగా మొత్తం 6 అవార్డులతో యానిమల్ సినిమా సత్తా చాటింది. ఇలా ఓటీటీలోనే కాకుండా.. ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో కూడా సందీప్ రెడ్డి వంగా మార్క్ మ్యాజిక్ చేసేశాడు. పాన్ ఇండియా స్థాయిలో సందీప్ రెడ్డి వంగా.. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ని కూడా దాటేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. యానిమల్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments