iDreamPost
android-app
ios-app

Sandeep Reddy Vanga: ‘మాస్టర్‌’లో సందీప్ రెడ్డి వంగ చెప్పిన సీన్ ఇదే.. చిరు అంటే ఇది!

  • Published Jan 02, 2024 | 2:58 PM Updated Updated Jan 02, 2024 | 3:19 PM

సందీప్‌ రెడ్డి యానిమల్‌ చిత్ర ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి నటించిన మాస్టర్‌ సినిమాలోని ఓ సీన్‌ గురించి మాట్లాడారు.

సందీప్‌ రెడ్డి యానిమల్‌ చిత్ర ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి నటించిన మాస్టర్‌ సినిమాలోని ఓ సీన్‌ గురించి మాట్లాడారు.

  • Published Jan 02, 2024 | 2:58 PMUpdated Jan 02, 2024 | 3:19 PM
Sandeep Reddy Vanga: ‘మాస్టర్‌’లో సందీప్ రెడ్డి వంగ చెప్పిన సీన్ ఇదే.. చిరు అంటే ఇది!

ప్రముఖ ప్యాన్‌ ఇండియా దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగ హార్డ్‌కోర్‌ చిరంజీవి ఫ్యాన్‌ అన్న సంగతి తెలిసిందే. సందీప్‌ రెడ్డి చిన్నప్పటినుంచి ఎంతో పిచ్చిగా చిరంజీవిని ఆరాధిస్తూ ఉన్నారు. ఆయన స్పూర్తితోనే సినిమాల్లోకి కూడా వచ్చారు. ప్రస్తుతం దర్శకుడిగా తన సత్తా చాటుతున్నారు. తాజాగా, యానిమల్‌ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రణబీర్‌ కపూర్‌, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్‌ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అయింది. సూపర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు 800 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసింది. ఇక, యానిమల్‌ ప్రమోషన్ల సందర్భంగా సందీప్‌ వంగ చిరంజీవి యాక్టింగ్‌ గురించి మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు పాతికేళ్ల క్రితం విడుదలైన చిరంజీవి సినిమాలోని ఓ సీన్‌ గురించి ఆయన వివరించి చెప్పటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

ఆ వీడియోలో సందీప్‌ చిరంజీవి గురించి మాట్లాడుతూ.. ‘‘ సీ ఇనుఫ్లుయెన్స్‌, ఇంప్రెషన్‌ ఎప్పుడూ ఉంటది. ఫర్‌ ఎగ్జాంపుల్‌.. మీరు చిరంజీవి గారి ఫిల్మ్‌ మాస్టర్‌ చూశారా? నాకు ఇంకా గుర్తుంది.. చిరంజీవిగారు గ్రీన్‌ షర్టులో ఉంటారు. ‘నేను ఎవరో తెలుసా?’ అని సాక్షి శివానంద్‌కు చెబుతూ ఉంటాడు. నా గతం తెలుసా? అని సిగరెట్‌ తాగుతూ ఉంటాడు. చిరంజీవి గారు స్క్రీన్‌ మీద సిగరెట్‌ తాగడం చూసి బాగా అట్రాక్ట్‌ అయ్యా. నేను స్మోకింగ్‌కు ఆట్రాక్ట్‌ అయ్యా. ఆ షాట్‌ చూసి.

అది అప్పుడు బాగా గుర్తుండిపోయింది. అది వెంటనే మొదలవ్వలేదు’’ అని పేర్కొన్నారు. సందీప్‌.. మాస్టర్‌ సినిమాలో చిరంజీవి వేసుకున్న షర్టు కలర్‌తో సహా చెప్పటంతో మెగా ఫ్యాన్స్‌తో పాటు సాధారణ నెటిజన్లు కూడా షాక్‌ అవుతున్నారు. ‘‘ నువ్వు మరీ ఇంత కల్ట్‌ ఫ్యాన్‌వి ఏంటి అన్నా! ’.. ‘ఫిల్మ్‌ మేకింగ్‌లోనే కాదు.. ఫ్యాన్‌ మేకింగ్‌లోనూ ట్రెండ్‌ సృష్టిస్తున్నావ్‌ అన్నా’ అంటున్నారు ప్రశంసలు కురిస్తున్నారు. ఇప్పుడు మాస్టర్‌ మూవీలోని ఆ సీన్‌ కూడా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతూ ఉంది.

కాగా, సందీప్‌ రెడ్డి వంగ అర్జున్‌ రెడ్డి సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ సినిమాను హిందీలో ‘కబీర్‌ సింగ్‌’గా రీమేక్‌ చేశారు. అక్కడ కూడా మూవీ బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. మరి, మెగాస్టార్‌ ఫ్యాన్‌లలో తాను ప్రత్యేకం అనిపించుకుంటున్న సందీప్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss