iDreamPost
android-app
ios-app

కాంతార తర్వాత కన్నడ ఇండస్ట్రీకి ఊపు తెచ్చిన చిన్న సినిమా!

  • Author ajaykrishna Updated - 09:12 AM, Wed - 26 July 23
  • Author ajaykrishna Updated - 09:12 AM, Wed - 26 July 23
కాంతార తర్వాత కన్నడ ఇండస్ట్రీకి ఊపు తెచ్చిన చిన్న సినిమా!

కొన్నిసార్లు ఇండస్ట్రీలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేసేస్తుంటాయి. అలాంటి సినిమా అంత పెద్ద విజయం సాధిస్తాయని కనీసం మేకర్స్ కి తెలియదు. అలా జరిగిపోతుంటాయి. ఒక్కోసారి డల్ గా ఉన్న ఇండస్ట్రీకి ఊపు తీసుకొచ్చే సినిమాలు అవుతుంటాయి. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ కి అలాంటి సినిమాలు అవసరం రాలేదు. ఎందుకంటే ప్రతీ నెల ఏదొక సినిమా పెద్ద హిట్ అవుతూనే ఉన్నాయి. రీసెంట్ గా తెలుగులో చిన్న సినిమాగా వచ్చిన బేబీ మూవీ.. ఎలాంటి హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు.. రూ. 8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా.. ఏకంగా బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ రూ. 60 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది.

ఇదే విధంగా కన్నడ ఇండస్ట్రీలో కూడా ఓ చిన్న సినిమా రచ్చ చేస్తోంది. గతేడాది విడుదలైన 777 చార్లీ, విక్రాంత్ రోణ, కాంతార సినిమాల తర్వాత కన్నడ నుండి ఏ సినిమా పేరు పెద్దగా బయటికి రాలేదు. పెద్ద హిట్ అయినట్లు టాక్ కూడా లేదు. ఈ ఏడాది భారీ అంచనాలతో దిగిన కబ్జా, క్రాంతి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో బోల్తాపడ్డాయి. అప్పటినుండి ప్రతీ వారం సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికి.. ఏది పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. కానీ.. రీసెంట్ గా విడుదలైన ఓ చిన్న సినిమా.. కన్నడ ఇండస్ట్రీకి ఊపు తెచ్చిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి అది ఏం సినిమా? అనే వివరాల్లోకి వెళ్తే..

ఆ సినిమా పేరు ‘హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే’. కొంతకాలంగా సరైన హిట్ లేని కన్నడ ఇండస్ట్రీకి.. ఈ హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే కొంత ఊరట ఇచ్చిందని అంటున్నారు. టైటిల్ చూస్తే అర్ధమవుతుంది కదా.. ఈ సినిమా కథ హాస్టల్ చుట్టూ తిరుగుతుందని.. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో పాటు మంచి వసూళ్లు రాబడుతోంది. యూత్ ని ఆకట్టుకునే క్రైమ్ కామెడీ జానర్ లో హాస్టల్ స్టూడెంట్స్, వార్డెన్ చుట్టూ ఈ స్టోరీ రన్ అవుతుంది. ఇక ‘హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే’ అంటే.. ‘హాస్టల్ పిల్లలు కోరుకుంటే’ అని అర్ధం. ప్రస్తుతం కన్నడలో ఊపుతున్న ఈ సినిమా త్వరలో తెలుగులో రిలీజైనా ఆశ్చర్యపోయే అవసరం లేదు. మరి కన్నడ ఇండస్ట్రీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.