iDreamPost
android-app
ios-app

తెలంగాణ MLA బయోపిక్‌లో నటించనున్న సముద్రఖని!

  • Published Dec 11, 2023 | 6:58 PM Updated Updated Dec 11, 2023 | 6:58 PM

సముద్రఖనికి తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్‌ ఉంది. ఆయన ప్రస్తుతం తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యే బయోపిక్‌లో నటించబోతున్నారట. ఇందుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయట.

సముద్రఖనికి తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్‌ ఉంది. ఆయన ప్రస్తుతం తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యే బయోపిక్‌లో నటించబోతున్నారట. ఇందుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయట.

  • Published Dec 11, 2023 | 6:58 PMUpdated Dec 11, 2023 | 6:58 PM
తెలంగాణ MLA బయోపిక్‌లో నటించనున్న సముద్రఖని!

కోలీవుడ్ యాక్టర్, డైరెక్టర్ సముద్రఖని. ఈయన గురించి సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. దర్శకుడిగానే కాదు.. నటుడిగా కూడా ఆయన తన సత్తా చాటుతున్నారు. వైవిధ్యమైన పాత్రలో నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా.. హీరోగా కూడా సినిమాలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన మొదటగా ‘శంభో శివ శంభో’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

‘అల వైకుంఠపురం’ సినిమాతో  పాపులర్ అయ్యారు. ప్రస్తుతం సముద్రఖని అటు తమిళ్‌తో పాటు.. తెలుగులోనూ అత్యంత బిజీ నటుల్లో ఒకరిగా మారారు. సముద్రఖని ప్రాధాన్యత, కొత్తదనం ఉన్న పాత్రల్నే ఎంచుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే.. తాజాగా సముద్రఖనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆయన ప్రముఖ రాజకీయ నాయకుని బయోపిక్‌లో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇటీవలే సముద్రఖని ప్రముఖ రాజకీయ నాయకుడి బయోపిక్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు. ఆ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. అయితే సముద్రఖని తెలంగాణకు చెందిన గుమ్మడి నర్సయ్య బయోపిక్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, గుమ్మడి నర్సయ్య 1983 -1994, 1999- 2009 మధ్య యెల్లందు శాసనసభ సభ్యుడిగా పని చేశారు. యెల్లందు నుంచి ఆయన వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ.. ఇప్పటికీ ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు.

గుమ్మడి నర్సయ్య అవినీతి మచ్చలేని వ్యక్తిగా, పేద ప్రజల ఆశా జ్యోతిగా పేరు తెచ్చుకున్నారు. ఉండడానికి స్వంత ఇళ్లు కూడా సరిగ్గా నిర్మించుకోలేని ఓ గొప్ప రాజకీయ నాయకుడు కావడంతో.. అటువంటి గొప్ప వ్యక్తి గురించి ప్రస్తుత జనరేషన్ కు తెలియాలనే ఉద్దేశంతో సముద్రఖని టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే ఇక సముద్రఖని ఆ పాత్రలో జీవిస్తారని చెప్పక్కరలేదు. అయితే ఈ మూవీకి సంబంధించి పూర్తి అప్‌డేట్స్‌ త్వరలోనే వెల్లడయ్యే ఛాన్స్ ఉంది.

ప్రస్తుతం ధనరాజ్ దర్శకత్వంలో సముద్రఖని ఓ సినిమా చేస్తున్నారు. ఇక చివరగా.. పవన్ కళ్యాణ్‌, సాయి ధరమ్ తేజ్‌ కాంబోలో బ్రో మూవీకి దర్శకత్వం వహించారు. తమిళంలో ఆయన నటించి దర్శకత్వం వహించిన ‘వినోదయ సితం’ను బ్రోగా రీమేక్‌ చేశారు. ఈ చిత్రం జులై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఆశించిన స్థాయిలో ఆడలేదు.  మరి, సముద్రఖని చేయబోతున్న గుమ్మడి నర్సయ్య బయోపిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetmeritbetcasibomiptv satın alCasibomcasibom