iDreamPost
android-app
ios-app

గుర్తుంచుకోదగ్గ క్యారెక్టర్.. సంపూతో కామెడీ చెయ్యట్లేదుగా!

  • Author ajaykrishna Published - 08:07 AM, Wed - 20 September 23
  • Author ajaykrishna Published - 08:07 AM, Wed - 20 September 23
గుర్తుంచుకోదగ్గ క్యారెక్టర్.. సంపూతో కామెడీ చెయ్యట్లేదుగా!

ఒక భాషలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు ఇంకో భాషలో రీమేక్ చేస్తున్నారంటే.. ఆ సినిమాపై కాస్తో కూస్తో ఆసక్తి ఏర్పడుతుంది. ఏంటి.. ఆ హిట్ సినిమా ఎవరు తీస్తున్నారు? ఎవరిని పెట్టి తీస్తున్నారు? ఆ క్యారెక్టర్స్ కి వాళ్ళు సెట్ అవుతారా లేదా? అని ఎన్నో విధాలుగా ఆరాలు తీస్తుంటారు. తాజాగా టాలీవుడ్ లో హీరో సంపూర్ణేశ్ బాబు కొత్త సినిమా అనౌన్స్ మెంట్ తో అదే జరుగుతుంది. సంపూ హీరోగా ‘మార్టిన్ లూథర్ కింగ్’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తో అనౌన్స్ చేశారు. ఈ సినిమా తమిళ బ్లాక్ బస్టర్ ‘మండేలా’ మూవీకి రీమేక్. సంపూతో ఆ సినిమా రీమేక్ అని తెలిసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు జనాలు.

ఎందుకంటే.. సంపూ కెరీర్ స్టార్ట్ చేసి హిట్ కొట్టింది స్పూఫ్ సినిమాలతో. హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి సినిమాలతో హిట్స్ కొట్టిన సంపూ.. అదే విధంగా రెగ్యులర్ కామెడీ రోల్స్ లో ఇప్పటిదాకా మెప్పించలేకపోయాడు. హృదయ కాలేయం, కొబ్బరిమట్ట సినిమాలు తప్పితే ఇంకా వేరే హిట్స్ ఏవి సంపూ కెరీర్ లో లేవు. స్పూఫ్ సినిమాల హీరోగా పేరున్నా.. ఇప్పుడా జానర్ సినిమాలు ప్రేక్షకులకు ఎక్కట్లేదు. ఇప్పుడు మేకర్స్ కంటే ఆడియన్స్ ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. వెరైటీ క్యారెక్టర్స్, ఇంకా వెరైటీ స్టోరీస్ తో దేన్నీ అనుకరించకుండా సినిమాలు చేస్తే థియేటర్స్ వద్ద బ్రహ్మరధం పడుతున్నారు.

ఇప్పుడు సంపూ చేస్తున్న మండేలా రీమేక్ కూడా అలాంటి గ్రేట్ ఫిలిమ్స్ లో ఒకటి. వినోదాత్మకంగా సాగుతూనే అంతర్లీనంగా హార్ట్ టచ్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో తమిళంలో వచ్చిన బెస్ట్ ఫిలిమ్స్ లో మండేలా ఒకటి. మరి కొన్నాళ్ళుగా ఏ సినిమాలోను కనిపించకుండా పోయిన సంపూ.. సడన్ గా మార్టిన్ లూథర్ కింగ్ పేరుతో సినిమా అనౌన్స్ చేయడం విశేషం. ఈ సినిమాని పూజా కొల్లూరు తెరకెక్కించారు. కాగా.. ఇప్పటికే సినిమా షూటింగ్ ముగించుకొని అక్టోబర్ 27 రిలీజ్ కి రెడీ అవుతోంది మార్టిన్. మరి ఓ బార్బర్ ఓటు చుట్టూ ఎంతో వినోదంతో పాటు ఎమోషన్స్ ని బాగా పండించే క్యారెక్టర్ అది. ఒరిజినల్ లో యోగిబాబు అద్భుతమైన నటన కనబరిచాడు. ఇక్కడేమో సంపూ కామెడీ స్పూఫ్ సినిమాతో కహైలైట్ అయ్యాడు. మరి సంపూ ఉన్నాడని మార్టిన్ తో కేవలం కామెడీపై ఫోకస్ చెయ్యలేదుగా అని నెటిజన్స్ అంటున్నారు. ఇక సంపూ మార్టిన్ లూథర్ కింగ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet