iDreamPost
android-app
ios-app

సమంతను చుట్టుముట్టిన స్కూలు పిల్లలు.. ఆమె ఏం చేసిందంటే..

సమంతను చుట్టుముట్టిన స్కూలు పిల్లలు.. ఆమె ఏం చేసిందంటే..

అందం, అభినయంతో పాటు మంచి మనసుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నారు స్మైలింగ్‌ క్వీన్‌ సమంత. ఆమె ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. తెలుగులో విజయ్‌ దేవర కొండ సరసన ‘ఖుషీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లోని ఓ గుడిలో క్లైమాక్స్‌ సీన్ల చిత్రీకరణ జరిగింది. విజయ్‌, సమంతతో పాటు పలువురు నటులు ఈ సీన్ల చిత్రీకరణ షూటింగ్‌లో పాల్గొన్నారు. తాజాగా, ఈ షూటింగ్‌కు సంబంధించిన రెండు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఓ వీడియోలో సమంత, విజయ్‌ ఇతర నటులు యాగంలో పాల్గొన్న సీన్లు ఉన్నాయి. మరో వీడియోలో సమంత మంచి మనసును తెలియజెప్పే దృశ్యాలు ఉన్నాయి. సమంత స్కూలు పిల్లలతో ఫొటోలు దిగిన వీడియో అది. ఇంతకీ సంగతేంటంటే.. సమంత తమ ఊరికి వచ్చిందని తెలిసిన కొంతమంది స్కూలు పిల్లలు షూటింగ్‌ స్పాట్‌కు వచ్చారు. సమంతను కలవటానికి ప్రయత్నించారు. అయితే, వారిని పోలీసులు, ఇతర సిబ్బంది సమంత దగ్గరకు వెళ్లనివ్వలేదు. దీంతో ఓ విద్యార్థిని ఎవరి కంటా పడకుండా సమంతను చేరుకుంది.

అది గమనించిన పోలీసులు, సిబ్బంది బాలికను అడ్డుకునే ప్రయత్నం చేశారు. సమంత వారిని వారించింది. బాలికను అడిగి విషయం తెలుసుకుంది. ఇంకా కొంతమంది తన స్నేహితులు దూరంగా ఉండిపోయారని బాలిక చెప్పింది. సమంత వారందరినీ తన దగ్గరకు పిలిపించుంది. ఎంతో ఓపిగ్గా వారందరితో ఫొటోలు దిగి పంపించేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూస్తున్న వారు సమంత మంచి మనసుకు ఫిదా అయిపోతున్నారు. కాగా, సమంత అతి త్వరలో సినిమాలకు బ్రేక్‌ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఓ సంవత్సరం పాటు సినిమాల్లో ఆమె నటించరన్న ప్రచారం జరుగుతోంది.