iDreamPost
android-app
ios-app

పుష్ప 2 కి భారీ రన్ టైం ను లాక్ చేసుకుంది.?

  • Published Nov 26, 2024 | 5:29 PM Updated Updated Nov 26, 2024 | 5:29 PM

Pushpa 2 Runtime Locked: నిన్న మొన్నటివరకు సుకుమార్ లాస్ట్ మినిట్ షూటింగ్ వర్క్స్ తో టెన్షన్ పెడుతున్నాడని అన్నారు. కానీ సుక్కు దానిని కూడా ఫినిష్ చేసేసాడు. ఇక కేవలం కొన్ని ప్యాచ్ వర్క్స్ , పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ మాత్రమే బ్యాలెన్స్. మరో మూడు నాలుగు రోజుల్లో అది కూడా కంప్లీట్ అవుతుంది. ఇక ఇప్పుడు అందరిని షాక్ కు గురి చేసే విషయం ఏంటంటే.. ఈ సినిమా భారీ రన్ టైం ను లాక్ చేసుకుంది.

Pushpa 2 Runtime Locked: నిన్న మొన్నటివరకు సుకుమార్ లాస్ట్ మినిట్ షూటింగ్ వర్క్స్ తో టెన్షన్ పెడుతున్నాడని అన్నారు. కానీ సుక్కు దానిని కూడా ఫినిష్ చేసేసాడు. ఇక కేవలం కొన్ని ప్యాచ్ వర్క్స్ , పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ మాత్రమే బ్యాలెన్స్. మరో మూడు నాలుగు రోజుల్లో అది కూడా కంప్లీట్ అవుతుంది. ఇక ఇప్పుడు అందరిని షాక్ కు గురి చేసే విషయం ఏంటంటే.. ఈ సినిమా భారీ రన్ టైం ను లాక్ చేసుకుంది.

  • Published Nov 26, 2024 | 5:29 PMUpdated Nov 26, 2024 | 5:29 PM
పుష్ప 2 కి భారీ రన్ టైం ను లాక్ చేసుకుంది.?

పుష్ప 2 డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా గురించి రోజు ఎదో ఓ న్యూస్ వింటూనే ఉంటున్నాం. నిన్న మొన్నటివరకు సుకుమార్ లాస్ట్ మినిట్ షూటింగ్ వర్క్స్ తో టెన్షన్ పెడుతున్నాడని అన్నారు. కానీ సుక్కు దానిని కూడా ఫినిష్ చేసేసాడు. ఇక కేవలం కొన్ని ప్యాచ్ వర్క్స్ , పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ మాత్రమే బ్యాలెన్స్. మరో మూడు నాలుగు రోజుల్లో అది కూడా కంప్లీట్ అవుతుంది. ఇక ఇప్పుడు అందరిని షాక్ కు గురి చేసే విషయం ఏంటంటే.. ఈ సినిమా భారీ రన్ టైం ను లాక్ చేసుకుంది. పుష్ప 2 సినిమాను ఏకంగా 3గంటల 15 నిమిషాల నిడివితో విడుదల చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పుడున్న ట్రెండ్ లో 3 గంటల సినిమా అంటేనే కాస్త రిస్క్ అని అంతా భావిస్తూ ఉంటారు. అలాంటిది ఈ సినిమా 3 గంటల 15 నిమిషాలంటే.. ఇక ఎలా ఉండబోతుందా అని అంతా చర్చించుకుంటున్నారు.

పుష్ప పార్ట్ 1.. 2 గంటల 59 నిమిషాల నిడివితో వచ్చి.. బాక్స్ ఆఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించింది. పుష్ప 2 మీద అంచనాలు బాగానే పెరిగాయి. చెప్పాలంటే అంతకు మించి అనే రేంజ్ లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సుకుమార్ ఏం ప్లాన్ చేసాడో ఏమో తెలియదు కానీ.. మొత్తానికి పెద్ద ప్రయోగం చేస్తున్నాడని చెప్పి తీరాల్సిందే. అంత సేపు ప్రేక్షకులను సీట్లో కుర్చోపెట్టడం అంటే మామూలు విషయం కాదు. అదిరిపోయే యాక్షన్ సిక్వెన్స్ లు, స్క్రీన్ ప్లే , ఇంటర్వెల్ బ్యాంగ్ , కథ , కథనం అంతా చాలా ఎంగేజింగ్ గా ఉంచాల్సి ఉంటుంది. సో ఇంత టైం పెట్టాడంటే సుకుమార్ చాలా పకడ్బందీగా వీటి అన్నిటిని సమకూర్చడమో అనిపిస్తుంది. ఈ భారీ రన్ టైం కాస్త షాకింగ్ గా అనిపిస్తున్నా కూడా.. పుష్ప రాజ్ వస్తున్నాడంటే ఆ మాత్రం టైం ఉండాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. పుష్ప నామ్ చోట హాయ్ లేకిన్ సౌండ్ బహుత్ బడా… అని ట్రైలర్ లో చెప్పినట్లు చాలా గట్టిగానే సౌండ్ చేసేలా కనిపిస్తుంది పుష్ప . ఇప్పటివరకు సినిమా మీద ఒక అంచనా ఉంటె.. ఇప్పుడు అసలు 3 గంటల సేపు సినిమాలో ఏం ఉంటుందా అనే క్యూరియాసిటీ పెరిగిపోయింది.

ఈ లెక్కన చూస్తే మొదటి రోజు 200 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టడం చాలా ఈజీ అనిపిస్తుంది. అలాగే మూవీ టీం లాంగ్ రన్ లో 1000 కోట్ల మార్క్ ను టచ్ చేసే టార్గెట్ ను ఫిక్స్ చేసుకుంది. ప్రస్తుతానికైతే హైప్ పరంగా ఎక్కడ లోటు లేదు. మూవీ నుంచి రావాల్సిన ట్రైలర్ , ఐటెం సాంగ్ అన్ని బాగానే వర్క్ అవుట్ అయ్యాయి. కిస్సిక్ సాంగ్ కూడా మెల్ల మెల్లగా ఊపందుకుంటుంది. ఇక మరో సాంగ్ బ్యాలెన్స్ ఉందని అంటున్నారు. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. ఇక రిలీజ్ తర్వాత పుష్ప 2 ఎలాంటి సెన్సేషనల్ రికార్డులను క్రియేట్ చేస్తుందో..అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందో లేదో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabet