Swetha
Pushpa2 Updates: పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటెర్నేషనల్. ఇది ఆల్రెడీ అందరు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు. అందుకే సుక్కు కూడా ప్రతి చిన్న విషయాన్నీ దగ్గరుండి మరీ.. పరిశీలిస్తున్నాడు. రిలీజ్ కు ముందు మూవీ టీం ప్రమోషన్లు కొంచెం గట్టిగానే చేస్తోంది. ఈ ప్రాసెస్ లో మూవీ టీం చేసే ప్రమోషన్స్ కంటే కూడా ఓ వివాదానికి పబ్లిసిటీ బాగా పెరుగుతుంది. రీసెంట్ గా జరిగిన ఈవెంట్ లో దేవి గొంతు విప్పడంతో అది కాస్త అనేక రకాల డిస్కషన్స్ కు దారి తీసింది.
Pushpa2 Updates: పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటెర్నేషనల్. ఇది ఆల్రెడీ అందరు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు. అందుకే సుక్కు కూడా ప్రతి చిన్న విషయాన్నీ దగ్గరుండి మరీ.. పరిశీలిస్తున్నాడు. రిలీజ్ కు ముందు మూవీ టీం ప్రమోషన్లు కొంచెం గట్టిగానే చేస్తోంది. ఈ ప్రాసెస్ లో మూవీ టీం చేసే ప్రమోషన్స్ కంటే కూడా ఓ వివాదానికి పబ్లిసిటీ బాగా పెరుగుతుంది. రీసెంట్ గా జరిగిన ఈవెంట్ లో దేవి గొంతు విప్పడంతో అది కాస్త అనేక రకాల డిస్కషన్స్ కు దారి తీసింది.
Swetha
పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటెర్నేషనల్. ఇది ఆల్రెడీ అందరు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు. అందుకే సుక్కు కూడా ప్రతి చిన్న విషయాన్నీ దగ్గరుండి మరీ.. పరిశీలిస్తున్నాడు. రిలీజ్ కు ముందు మూవీ టీం ప్రమోషన్లు కొంచెం గట్టిగానే చేస్తోంది. ఈ ప్రాసెస్ లో మూవీ టీం చేసే ప్రమోషన్స్ కంటే కూడా ఓ వివాదానికి పబ్లిసిటీ బాగా పెరుగుతుంది. రీసెంట్ గా జరిగిన ఈవెంట్ లో దేవి గొంతు విప్పడంతో అది కాస్త అనేక రకాల డిస్కషన్స్ కు దారి తీసింది. లాస్ట్ మినిట్ లో కొన్ని డెసిషన్స్ తీసుకోవడంతో రకరకాల మాటలు వచ్చాయి. సుక్కు కి దేవి కి ఏమైందో తెలియదు కానీ.. చివరి నిమిషంలో ముగ్గురు సంగీత దర్శకులను ఎంపిక చేసుకున్నాడు. ఈ క్రమంలో తమన్, అజనీష్, శ్యామ్ సీఎస్ వచ్చి పుష్ప 2ని పంచుకున్నారు. అలా అని దేవిని పుష్ప నుంచి తీసేయలేదు. ఉన్న బ్యాలెన్స్ వర్క్ ను నలుగురికి షేర్ చేసాడు లెక్కల మాస్టారు. అయితే సినిమాలో మెజారిటీ సీన్లలో మాత్రం దేవి బీజీఎంనే వాడుతున్నట్లు సమాచారం.
రీసెంట్ గా తమన్ తన వర్క్ ని ఫినిష్ చేసినట్లు అప్డేట్ ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ అంత థమన్ కొట్టేసి ఉంటాడని ఇప్పటికే టాక్ వినిపిస్తుంది. దీనితో శ్యాం , అజనీష్ కలిసి సెకండ్ హాఫ్ ఫినిష్ చేసి ఉంటారని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే తాజాగా శ్యాం చేసిన ఓ ట్వీట్ తో మరో విషయం బయటపడింది. మొన్నటివరకు పుష్ప లో మోస్ట్ ఐకానిక్ సీన్ అయిన జాతర సీన్ కు బిజిఎమ్ అజనీష్ ఇస్తాడేమోనని అనుకున్నారంతా. ఎందుకంటే కాంతార , మంగళవారం లాంటి సినిమాలకు అజనీష్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదో తెలియనిది కాదు. సో ఈ ఐకానిక్ సీన్ కు కూడా అజనీష్ ఉండొచ్చని అనుకున్నారు. కానీ శ్యాం చేసిన ట్వీట్ తో ఓ క్లారిటీ వచ్చేసింది. ఆ జాతర సీన్స్ కు బ్యాక్గ్రౌండ్ స్కోర్ శ్యాం కంపోజ్ చేసినట్లుగా కనిపిస్తుంది.
ఎందుకంటే ఆ సీన్ కు సంబంధించిన షాట్ ను శ్యాం సిఎస్ షేర్ చేశాడు. దీనితో ఈ ట్వీట్ తో ప్రేక్షకులు డైలమాలో పడ్డారు. ఏ పార్ట్ కు ఎవరు కంపోజ్ చేశారు. ఏ సీన్ ఎవరిదీ అంటూ కామెంట్ చేస్తున్నారు. సుకుమార్ కానీ , మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ప్రమోషన్స్ అప్పుడు దీనిపై క్లారిటీ ఇస్తే అప్పుడు అసలు మ్యాటర్ బయటకు వస్తుంది. ఆల్రెడీ ఈ సినిమా సంగీతం విషయంలో కాస్త వైరల్ అయింది. ఇక తర్వాత ఏమౌతుందో చూడాలి. సుకుమార్ కూడా షూటింగ్ కు ప్యాక్ అప్ చెప్పేశాడట. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మాత్రమే బ్యాలెన్స్. అటు సౌత్ లో ఈవెంట్స్ కు డేట్స్ కన్ఫర్మ్ చేసుకున్నారట మేకర్స్. కనీసం ఈ ఈవెంట్స్ కైనా సుక్కు అటెండ్ అవుతాడేమో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.