iDreamPost
android-app
ios-app

Pushpa 2: ట్రెండింగ్ లో ‘కిస్సిక్’ సింగర్! ఇంతకీ ఎవరీమే?

  • Published Nov 26, 2024 | 5:29 PM Updated Updated Nov 26, 2024 | 5:29 PM

Pushpa 2: పుష్ప 2 నుంచి విడుదల అయిన కిస్సిక్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఈ పాట తెగ ట్రెండ్ అవుతుంది.

Pushpa 2: పుష్ప 2 నుంచి విడుదల అయిన కిస్సిక్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఈ పాట తెగ ట్రెండ్ అవుతుంది.

  • Published Nov 26, 2024 | 5:29 PMUpdated Nov 26, 2024 | 5:29 PM
Pushpa 2: ట్రెండింగ్ లో ‘కిస్సిక్’ సింగర్! ఇంతకీ ఎవరీమే?

పుష్ప 2 ప్రమోషన్స్ మామూలుగా లేవు. విడుదలకు ముందే దేశమంతటా పుష్ప రాజ్ ర్యాంప్ ఆడిస్తున్నాడు. దీనికి కారణం పుష్ప 1 సెన్సేషన్ హిట్ కావడమే. ముఖ్యంగా పుష్ప లోని పాటలు ఎంత పెద్ద చార్ట్ బస్టర్స్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో అన్ని పాటలు ఒక ఎత్తు అయితే ఊ అంటావా పాట మాత్రం మరో ఎత్తు. ఎందుకంటే ఆ పాట పాడిన సింగర్ ఇంద్రావతి చౌహాన్ వాయిస్ చాలా మత్తుగా కొత్తగా అనిపించింది. దాంతో ఆ సింగర్ ఎవరా అని నెటిజెన్స్ తెగ వెతికారు. తరువాత ఆమె పాపులర్ సింగర్ మంగిలి సిస్టర్ అని తెలిసింది. అలా తన వాయిస్ తో మ్యాజిక్ చేసింది ఇంద్రావతి చౌహాన్. ఇక పుష్ప 2 సినిమాపై బజ్ అంతా బాగుంది కానీ జనాలకు కొత్తదనం ఏదో మిస్ అవుతున్న టైమ్ లో వచ్చింది ‘కిస్సిక్ సాంగ్’. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాని తగలబెట్టేస్తుంది. ఈ పాట పాడిన సింగర్ వాయిస్ అయితే చాలా కొత్తగా అనిపిస్తుంది. దాంతో ఎవరీ గాన కోకిల అంటూ నెటిజెన్స్ తెగ సెర్చింగులు చేస్తున్నారు.

ఇక ఈ సాంగ్ ను పాడిన అమ్మాయి పేరు సుభ్లాషిణి. ఈమె హస్కీ వాయిస్.. సాంగ్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ పాటకు మెయిన్ అసెట్ గా మారింది. సింగర్ విషయంలో దేవిశ్రీ ఛాయిస్ మళ్ళీ పర్ఫెక్ట్ అని ప్రూవ్ అయింది. యంగ్ టాలెంట్ ను ఆయన ఎంచుకున్న తీరు.. ఫ్రెష్ నెస్ ను తెచ్చిపెట్టిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక సుభ్లాషిణి విషయానికి వస్తే ఆమె కోలీవుడ్ సింగర్. ఆమె వయసు కేవలం 24 సంవత్సరాలు మాత్రమే.. మల్టీ టాలెంట్, ఆకట్టుకునే ప్రదర్శనలతో ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఇప్పటికే తనదైన ముద్ర వేసుకుంది. ఈమె కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా పాడింది. అందులో ‘కాతాడి’ అనే సాంగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. అలాగే తమిళ సినిమాల్లో కూడా పలు సాంగ్స్ పాడింది.

ఇన్ స్టాగ్రామ్ ద్వారా మ్యూజిక్ జర్నీ స్టార్ట్ చేసింది సుభ్లాషిణి. తన మ్యూజికల్ వీడియోస్ తో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. 2020లో ఓ కంటెస్ట్ లో గెలిచి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ న్యూక్లియాతో వర్క్ చేసి పాపులర్ అయిపోయింది. అలా తన డైనమిక్ వాయిస్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోని ఓ రేంజ్ లో మెప్పించింది. ఇప్పుడు మళ్ళీ కిస్సిక్ సాంగ్ తో ట్రెండ్ అవుతుంది. ఇక మున్ముందు రోజుల్లో తెలుగులో ఈ సూపర్ సింగర్ మెప్పిస్తుందో లేదో చూడాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet