iDreamPost
android-app
ios-app

నాగ చైతన్య , శోభిత మ్యాటర్ లో ఆ డీల్ నిజం కాదట !

  • Published Nov 27, 2024 | 6:31 PM Updated Updated Nov 27, 2024 | 6:31 PM

అక్కినేని అన్నదమ్ముల పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. రీసెంట్ గా అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ విషయం వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈలోపే నాగచైతన్య- శోభిత పెళ్లి గురించి మరో న్యూస్ బయటకు వచ్చింది.

అక్కినేని అన్నదమ్ముల పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. రీసెంట్ గా అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ విషయం వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈలోపే నాగచైతన్య- శోభిత పెళ్లి గురించి మరో న్యూస్ బయటకు వచ్చింది.

  • Published Nov 27, 2024 | 6:31 PMUpdated Nov 27, 2024 | 6:31 PM
నాగ చైతన్య , శోభిత మ్యాటర్ లో ఆ డీల్ నిజం కాదట !

అక్కినేని అన్నదమ్ముల పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. రీసెంట్ గా అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ విషయం వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈలోపే నాగచైతన్య- శోభిత పెళ్లి గురించి మరో న్యూస్ బయటకు వచ్చింది. డిసెంబర్ 4న చైతు- శోభితల వివాహం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగబోతుంది. అతి కొద్దీ మంది కుటుంబ సభ్యులు , సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరగనుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఆల్రెడీ సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. అయితే వీరి వివాహానికి సంబంధించిన లైవ్ స్ట్రీమింగ్ హక్కులను కొన్ని ఓటీటీ ఛానెల్స్ కొనుగోలు చేస్తున్నాయి. ఇది కొత్తేమి కాదు.. గతంలో హన్సిక , నయనతార పెళ్ళికి సంబంధించి స్ట్రీమింగ్ రైట్స్ కొన్ని ఓటీటీ యాప్స్ కొనుగోలు చేసి.. టెలికాస్ట్ చేశాయి. ఇప్పుడు చైతు – శోభితల వివాహానికి సంబంధించి కూడా ఇలాంటి ఓ ప్రచారమే బయటకు వచ్చింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ ఈ రైట్స్ తీసుకుందనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. అదేంటంటే.. చైతు- శోభితల పెళ్లి వేడుక స్ట్రీమింగ్ హక్కులను ఏ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ కు ఇవ్వలేదట. వారి కుటుంబానికి సంబంధించిన ఈ వేడుకను పబ్లిక్ చేసే ఆలోచన లేదని సమాచారం. వారి వివాహ వేడుకను సాధ్యతమైనంత వరకు ప్రైవేట్ గా సెలెబ్రేట్ చేసుకునే ప్లాన్ లో ఉన్నారట ఈ జంట. కాబట్టి ఇప్పటివరకు సోషల్ మీడియాలో వినిపించిన కథనాలన్నీ తప్పని తేల్చి చెప్పేశారు అక్కినేని ఫ్యామిలీ సన్నిహితులు. సో ప్రస్తుతానికి వీరి వివాహానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదని చెప్పాలి. అలాగే అటు అఖిల్ అక్కినేని వివాహ తేదీ గురించి కూడా ఎలాంటి అప్డేట్ లేదు. ఇక తర్వాత కింగ్ నాగ్ ఎలాంటి న్యూస్ చెప్తారో చూడాలి. ఇక నాగచైతన్య సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం చైతు తండేల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ను స్ఫూర్తిగా తీసుకుని ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కుతుంది.

రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా బుజ్జి తల్లి సాంగ్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. ప్రస్తుతం అయితే సినిమా మీద డీసెంట్ హైప్ ఏ ఉంది. ఈ సినిమాకు సంబందించిన అప్డేట్స్ కూడా అంతగా ఏమి వినిపించట్లేదు. పెళ్లి హడావిడి అంతా అయ్యాక మూవీ అప్డేట్స్ ఇస్తారేమో చూడాలి. మొత్తానికి అక్కినేని అభిమానులకు మాత్రం అటు సినిమా, ఇటు చైతు , అఖిల్ లా వివాహనికి సంబంధించిన అప్డేట్స్ ఫుల్ కిక్ ఇస్తున్నాయి. రెండు రోజుల నుంచి మీడియా , సోషల్ మీడియా అంత వీరిద్దరికి సంబంధించిన డిస్కషన్ ఏ జరుగుతుంది. తర్వాత ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibom