iDreamPost
android-app
ios-app

కరణ్ జోహార్ కాళ్లు మొక్కబోయిన సమంత.. రియాక్షన్ చూడండి..

Samantha- Karan Johar: సమంత అమెజాన్ ఈవెంట్ లో తమ సిరీస్ సిటాడెల్ ప్రమోషన్స్ లో పాల్గొంది. ఆ క్రమంలోనే ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో అతని రియాక్షన్ నెట్టింట వైరల్ అవుతోంది.

Samantha- Karan Johar: సమంత అమెజాన్ ఈవెంట్ లో తమ సిరీస్ సిటాడెల్ ప్రమోషన్స్ లో పాల్గొంది. ఆ క్రమంలోనే ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో అతని రియాక్షన్ నెట్టింట వైరల్ అవుతోంది.

కరణ్ జోహార్ కాళ్లు మొక్కబోయిన సమంత.. రియాక్షన్ చూడండి..

ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో అమెజాన్ ప్రైమ్ పేరు మారుమోగుతోంది. అందుకు కారణం లేకపోలేదు. ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ చేయనంత అట్టహాసంగా ఒక ఈవెంట్ నిర్వహించింది. ఈ ఏడాది అమెజాన్ లోకి రాబోతున్న సినిమాలు, వాల్లు చేపట్టబోయే ప్రాజెక్ట్స్, ఈ ఏడాది రిలీజెస్ కి సంబంధించిన ప్రమోషన్స్ మొత్తం ఈ ఈవెంట్ లో చేపట్టారు. ఇండియా వైడ్ గా ఉన్న అన్న ఇండస్ట్రీస్ కి సంబంధించిన నిర్మాతలు, ప్రముఖ డైరెక్టర్స్, యాక్టర్స్ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. అలాగే ప్రమోషన్స్ కూడా నిర్వహించారు. అందులో భాగంగానే సమంత కూడా వారి సిటాడెల్ ఇండియన్ వర్షన్ ప్రమోషన్ కోసం వరుణ్ ధావన్ తో కలిసి పాల్గొంది. ఈ నేపథ్యంలోనే ఒక ఆసక్తికర విషయం జరిగింది.

సమంత- వరుణ్ ధావన్ కలిసి సిటాడెల్ సిరీస్ ఇండియన్ వర్షన్ లో నటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. దానికి సంబంధించి అమెజాన్ ఈవెంట్ లో ఈ వెబ్ సిరీస్ టీమ్ ప్రమోషనల్ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సమంత- వరుణ్ ధావన్, కరణ్ జోహార్ పాల్గొన్నారు. వరుణ్ ధావన్ స్టేజ్ మీద ఉన్న కరణ్ జోహార్ ని పలకరిచింన తర్వాత అతని కాళ్లకు నమస్కారం చేశాడు. ఆ తర్వాత అతడిని చూసి సమంత కూడా నేను కూడా చేస్తాను అంటూ ముందుకు వచ్చింది. కరణ్ జోహార్ కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేసింది. అందుకు కరణ్ జోహార్ వారించాడు. వద్దు.. వద్దంటూ వెనక్కి వెళ్లిపోయాడు. సమంత కూడా నవ్వుకుంటూ వచ్చేసింది.

Karan Johar

ఆ తర్వాత వరుణ్ ధావన్ ఎవరైనా ఆయన కాళ్లకు నమస్కరించాల్సిందే అంటూ కామెంట్ చేశాడు. ఆ వ్యాఖ్యలకు కరణ్ జోహార్ రాయాక్ట్ అయ్యాడు. అందరూ నన్ను అప్పుడే అంత పెద్దవాడిని చేసేయకండి అంటూ కామెంట్స్ చేశాడు. ఇటీవలే 50 ఏళ్లు దాటిన విషయాన్ని గుర్తుచేస్తూ.. రీసెంట్ గానే ఒక ఏజ్(50) దాటేశాను. అప్పుడే అంత పెద్దవాడిని చేయద్దు అంటూ సూచించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్స్ ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కరణ్ జోహార్ అంటే ఎవరైనా అలా రియాక్ట్ అవ్వాల్సిందే అంటున్నారు. అలాగే కొందరు మాత్రం కరణ్ ని ఆటపట్టించడానికే అలా చేశారు. అంటున్నారు.

ఇంక అమెజాన్ ఈవెంట్ విషయానికి వస్తే.. ఈ ఏడాది అమెజాన్ నుంచి మొత్తం సినిమాలు కావచ్చు, వెబ్ సిరీస్లు కావచ్చు 60 వరకు రిలీజ్ కానున్నాయి. వాటిలో గేమ్ ఛేంజర్, కంగువ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఫ్యామిలీ స్టార్, ఓం భూమ్ బుష్, డాన్ 3, యోధా, హౌస్ ఫుల్ 5, సింగం 3, ఉప్పు కప్పు రంబు, చీకటిలో, సుబేదార్, చోరీ2 వంటి మూవీస్ రానున్నాయి. అలాగే మీర్జాపూర్ 3, ఫ్యామిలీ మ్యాన్ 3, సిటాడెల్, పాతాళ్ లోక్ సీజన్ 2, బందిష్ బాండిట్స్ సీజన్ 2, పంచాయత్ సీజన్ 3 ఇలాంటి సూపర్ డూపర్ హిట్ వెబ్ సిరీస్ లు ఉన్నాయి. మరి.. ఎంతటి వాళ్లైనా కరణ్ జోహార్ కాళ్లకు నమస్కారం చేయాల్సిందే అని వరుణ్ ధావన్ అనడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet