iDreamPost
android-app
ios-app

Samantha: నా లైఫ్ లో నేను చేసిన పెద్ద తప్పు అదే.. మాజీ భర్తపై సమంత షాకింగ్ కామెంట్స్!

  • Published Jan 18, 2024 | 9:58 PM Updated Updated Jan 18, 2024 | 9:58 PM

నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే అంటూ స్టార్ హీరోయిన్ సమంత షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ సామ్ చేసిన ఆ తప్పు ఏంటి?

నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే అంటూ స్టార్ హీరోయిన్ సమంత షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ సామ్ చేసిన ఆ తప్పు ఏంటి?

  • Published Jan 18, 2024 | 9:58 PMUpdated Jan 18, 2024 | 9:58 PM
Samantha: నా లైఫ్ లో నేను చేసిన పెద్ద తప్పు అదే.. మాజీ భర్తపై సమంత షాకింగ్ కామెంట్స్!

సమంత.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. కానీ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. మయోసైటిస్ అనే వ్యాధితో కొన్ని నెలలుగా బాధపడుతూ, దానికి చికిత్స తీసుకుంటూ వస్తోంది. దీంతో పూర్తిగా సినిమాలకు దూరమైంది. అయితే సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో టచ్ లో ఉంటూనే ఉంది. తన హెల్త్, ఇతర విషయాల గురించి సోషల్ మీడియాలో పంచుకుంటూ.. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తోంది. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసి ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఫ్యాన్స్ అడిన ప్రశ్నలకు సమాధానం చెప్పే క్రమంలో తన జీవితంలో చేసిన అతిపెద్ద ఇదే అంటూ సామ్ చెప్పుకొచ్చింది. మరి ఇంతకీ సామ్ తన లైఫ్ లో చేసిన ఆ తప్పేంటో ఇప్పుడు చూద్దాం.

సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత.. సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ అభిమానులతో టచ్ లోనే ఉంటూ వస్తోంది. నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూ.. టైమ్ దొరికినప్పుడల్లా ఫ్యాన్స్ తో చిట్ టాచ్ చేస్తుంది సామ్. తాజాగా కూడా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికతో ఆన్సర్స్ ఇచ్చింది. అందులో భాగంగా తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఇదే అంటూ చెప్పి బాంబ్ పేల్చింది సామ్. తాను లైఫ్ లో ఫెయిల్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది. “నాకు ఏది ఇష్టమో.. ఏది ఇష్టం లేదో తెలుసుకోవడానికి చాలా టైమ్ పట్టింది. ఎందుకంటే? వాటిని గతంలో నా పార్ట్ నర్ వాటిని ప్రభావితం చేశాడు. కఠిన సమయాల్లో నుంచి విలువైన పాఠాలు అప్పటి నుంచే నేర్చుకున్నాను. అప్పటి నుంచే నా ఎదుగుదల స్టార్ట్ అయ్యింది” సామ్ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ప్రస్తుతం సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత గతంలో ఓ ఇంగ్లీష్ ఛానల్ తో కూడా మాట్లాడింది. “చైతన్యతో డివోర్స్ తర్వాత వరుసగా ఫ్లాపులు వచ్చాయి. వీటితో పాటుగా అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో మానసికంగా చాలా కుంగిపోయాను” అంటూ సామ్ చెప్పుకొచ్చింది. ఇద్దరి మధ్య అభిప్రాయా భేదాలు రావడంతో నాగచైతన్య-సమంతలు విడిపోయారు. 2017లో లవ్ మ్యారేజ్ చేసుకున్న వీరు 2021లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఎవరి కెరీర్ వారు చూసుకుంటున్నారు. మరి సమంత చేసిన ఈ కామెంట్స్ పై మాజీ భర్త ఏ విధంగా స్పందిస్తాడో వేచిచూడాలి. మరి సామ్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by THEATRE SAMOSA (@theatre_samosa)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş