iDreamPost
android-app
ios-app

Khusi ఖుషీలో సామ్, విజ‌య్ ల‌ లిప్ లాక్ సీన్స్?

  • Published May 21, 2022 | 12:09 PM Updated Updated May 21, 2022 | 12:09 PM
  • Published May 21, 2022 | 12:09 PMUpdated May 21, 2022 | 12:09 PM
Khusi ఖుషీలో సామ్, విజ‌య్ ల‌ లిప్ లాక్ సీన్స్?

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత క్రేజీ కాంబినేష‌న్ లో ఓ ల‌వ్ స్టోరీ తెర‌కెక్కుతోంది. శివ నిర్మాణ డైరెక్ట‌ర్. పేరు… ఖుషి. కాశ్మీర్ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ జ‌రుగుతోంది. ఇందులో సామ్… ట్రెడిష‌న‌ల్ అమ్మాయిగా, విజ‌య్ మోడ‌ర్న్ కుర్రాడిగా క‌నిపించ‌నున్నారు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ లో ఈ సంగ‌తి అంతా తెలుసు. ఇదికాదు పాయింట్. అస‌లు రౌడీ బాయ్ తో సామ్ జంట‌గా న‌టించ‌డమంటేనే ఫ్యాన్స్ కు గొప్ప ఊపు వ‌చ్చింది. క‌థ చాలా ఇంటెన్సీవ్. యాక్టింగ్ ఇర‌గ‌దీయాల్సిందే. అందుకే సినిమాలో ముద్దు స‌న్నివేశాలున్నాయి కాస్త ఎక్కువ‌గానే ఉన్నాయ‌న్న‌ది ఫిల్మ్ న‌గ‌ర్ టాక్. క‌థ డిమాండ్ చేసిందికాబ‌ట్టి, ఈ ఇద్ద‌రు స్టార్లు ఒకే అనేశారు.

సామ్ తో విజయ్ సినిమా అన‌గానే మోడ‌ర్న్ టేకింగ్ ఉంటుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అదికాస్తా నిజ‌మైయ్యేలాగ ఉంది. ఇద్ద‌రి మ‌ధ్య ఇంటిమేట్ సీన్స్ చిత్రీక‌రించారంట‌. ఫార్ములా సినిమాల‌ను ఇద్ద‌రూ ఒప్పుకోవ‌డంలేదు. ఇది పాన్ ఇండియ‌న్ సినిమా. ఓవ‌ర్ సీస్ లో బాగా ఆడే అవ‌కాశం ఉంద‌ని మైత్రీ మూవీ మేక‌ర్స్ అంచ‌నావేస్తున్నారు.

కశ్మీర్ సామ్ కు బాగా న‌చ్చేసిందికూడా. అందుకే షూటింగ్ అయిపోగానే చుట్టుప్ర‌క్క‌ల ప్రాంతాల‌కు వెళ్తోంది. ఫోటోలు తీస్తోంది. క‌శ్మీర్, ఇక నిన్ను ఎప్పుడు త‌ల‌చుకున్నా, నా పెదాల‌పై చిరున‌వ్వు వ‌స్తుంద‌ని రాసుకుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss