iDreamPost
android-app
ios-app

ముగింపు పలకాల్సిన టైమ్ వచ్చేసిందంటున్న సమంత! అందుకోసమేనా?

  • Author singhj Published - 12:15 PM, Mon - 10 July 23
  • Author singhj Published - 12:15 PM, Mon - 10 July 23
ముగింపు పలకాల్సిన టైమ్ వచ్చేసిందంటున్న సమంత! అందుకోసమేనా?

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఒక్కో ప్రాజెక్టుతో తన క్రేజ్​ను మరింతగా పెంచుకుంటూ పోతున్నారు. తెలుగు, తమిళంలో ఆమె ఇమేజ్ ఏ రేంజ్​లో ఉందనేది అందరికీ తెలిసిందే. తమిళంలో స్టార్ హీరోల సరసన కమర్షియల్ మూవీస్​లో ఎక్కువగా కనిపిస్తూ వచ్చారు సామ్. కానీ తెలుగులో మాత్రం ఒకపక్క కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే.. వీలు చిక్కినప్పుడల్లా లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ యాక్ట్ చేశారు. ఈ క్రమంలో ఆమె చేసిన ‘ఓ బేబీ’, ‘యూటర్న్’, ‘యశోద’ సినిమాలు మంచి హిట్​గా నిలిచాయి. అయితే ఆ తర్వాత యాక్ట్ చేసిన ‘శాకుంతలం’ మాత్రం ఆమెకు పెద్ద షాక్​ను ఇచ్చింది. ఈ సినిమా తన కెరీర్​లోనే అతి పెద్ద ఝలక్ ఇచ్చిందని నిర్మాత దిల్ రాజు కూడా అన్నారు. దీన్ని బట్టే ‘శాకుంతలం’ రిజల్ట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

‘శాకుంతలం’ ఇచ్చిన షాక్ నుంచి సమంత త్వరగానే కోలుకున్నారు. అనంతరం పలు కొత్త ప్రాజెక్టులతో ఆమె బిజీ అయిపోయారు. టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ సినిమాలో ఆమె నటిస్తున్నారు. అలాగే హాలీవుడ్ సూపర్ హిట్ సిరీస్ ‘సిటాడెల్’ హిందీ రీమేక్​లోనూ యాక్ట్ చేస్తున్నారు. ఇందులో సామ్​తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. ఈ రెండింటిని పూర్తి చేశాక సమంత ఏ సినిమాకు ఓకే చెబుతారోనని అందరూ ఎదురు చూశారు. ఈ తరుణంలో ఒక ఏడాది పాటు తాను బ్రేక్ తీసుకుంటున్నానని చెప్పి సమంత అందరికీ షాక్ ఇచ్చారు.

సమంత ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటారనే వార్త విని ఆమె అభిమానులు బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ముంబై ఎయిర్​పోర్ట్​లో ఆమె దర్శనమిచ్చారు. ట్రీట్​మెంట్ కోసం అమెరికాకు ఆమె వెళ్తోందా అనే ప్రశ్న అందరి మెదళ్లను తొలచివేస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఇన్​స్టాలో సామ్ ఒక సెల్ఫీ పిక్​ను పోస్ట్ చేశారు. గత 6 నెలలు కష్టంగా గడిచాయని ఆ పోస్ట్​లో ఆమె రాసుకొచ్చారు. మరో మూడ్రోజులు మాత్రమే ఈ కారవాన్​లో ఉంటానని.. దీనికి ముగింపు పలకాల్సిన టైమ్ వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు. సామ్ పోస్ట్ చేసిన ఫొటోలో ఆమె ముఖం కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ఈ పోస్ట్ చూసిన ఆమె ఫ్యాన్స్.. సామ్ త్వరగా కోలుకోవాలని, తిరిగి మూవీస్​లో నటించాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Jojobet Girişivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetbetvolePokerklas güncel girişcasibomgalabetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobet