iDreamPost
android-app
ios-app

విజయ్ దేవరకొండ అలాంటివాడు కాదు! సమంత కామెంట్స్ వైరల్!

  • Author ajaykrishna Updated - 02:21 PM, Sat - 26 August 23
  • Author ajaykrishna Updated - 02:21 PM, Sat - 26 August 23
విజయ్ దేవరకొండ అలాంటివాడు కాదు! సమంత కామెంట్స్ వైరల్!

ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు సంబంధించి ఎలాంటి విషయాలైనా ఎక్కువ కాలం దాగవు. ఎందుకంటే.. ఏదొక విధంగా వాళ్లకు సంబంధించి సీక్రెట్స్ బయట పడుతుంటాయి. తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండకు సంబంధించి ఓ క్రేజీ సీక్రెట్స్ ని స్టార్ హీరోయిన్ సమంత కెమెరా ముందు లీక్ చేసేసింది. విజయ్ తో ఖుషి చేయకముందు తన అభిప్రాయం కూడా వేరేలానే ఉండేదని.. కానీ షూటింగ్ మొదలయ్యాక ఇవన్నీ సీక్రెట్స్ తెలిసినట్లు సామ్ చెప్పుకొచ్చింది. ఇంతకీ సమంత విజయ్ గురించి చెప్పిన సీక్రెట్స్ ఏంటి? విజయ్ అలాంటివాడు కాదని ఎందుకు అన్నది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం!

విజయ్, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో.. ఐదు భాషలలో విడుదల అవుతోంది. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ తో బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా పై.. అటు విజయ్, ఇటు సమంత ఫ్యాన్స్ లో అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి. రొమాంటిక్ లవ్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాని విజయ్, సమంత నెక్స్ట్ లెవెల్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇండియా వైడ్ మేజర్ సిటీలలో ఖుషి ప్రమోషన్స్ జరుపుతున్నారు. రీసెంట్ గా విజయ్, సమంత.. చెన్నై ప్రమోషన్స్ లో పాల్గొని.. ఆ తర్వాత ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా.. విజయ్ గురించి ఎవరికి తెలియని విషయం ఏదైనా చెప్పండి? అని సమంతని యాంకర్ అడిగింది. దానికి సమంత స్పందిస్తూ.. “అందరిలాగే నేను కూడా విజయ్ చాలా రెబల్, రౌడీ అనుకున్నాను. కానీ.. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. విజయ్ కి అసలు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. ఈ విషయం అందరికీ తెలుసో లేదో గానీ.. ప్రతిరోజూ వర్కౌట్స్ పైనే దృష్టి పెడతాడు. చాలా పద్దతిగా ఉంటాడు. అరే నేను విజయ్ విన్నది ఏంటి.. ఇతను ఏమో ఇలా ఉన్నాడేంటి అని చాలా షాక్ అయిపోయాను. చాలా కామ్, సాఫ్ట్.. ఫ్యామిలీ పర్సన్.” అని సామ్ తెలిపింది. దీంతో ఎప్పుడు మాస్ గా కనిపించే విజయ్ కి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవా అని ఫ్యాన్స్ సర్ప్రైజ్ అవుతున్నారు. మరి విజయ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş