Dharani
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత దడ్డర జాబ్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే. ఇంతకు ఏం జాబ్.. ఎలా కాంటాక్ట్ అవ్వాలి వంటి వివరాలు మీ కోసం..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత దడ్డర జాబ్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే. ఇంతకు ఏం జాబ్.. ఎలా కాంటాక్ట్ అవ్వాలి వంటి వివరాలు మీ కోసం..
Dharani
సెలబ్రిటీలను దగ్గర నుంచి చూడాలని చాలా మంది భావిస్తారు. వారిని కలిస్తే చాలనుకుంటారు. ఒక్క సెల్ఫీ కోసం ఎగబడతారు. సెలబ్రిటీలు బయటకు వస్తే.. అభిమానులు తాకిడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారికి ఊపిరి ఆడనివ్వరు. కొన్నిసార్లు అత్యుత్సాహం ప్రదర్శించి.. వారిని ఇబ్బందులకు గురి చేస్తారు. పాపం నవ్వుతూనే ఈ ఇబ్బందులను భరిస్తారు సెలబ్రిటీలు. అదలా ఉంచితే మనలో చాలా మందికి సినీ సెలబ్రిటీల దగ్గర పని చేయాలని ఉంటుంది. కానీ వారిని ఎలా సంప్రదించాలో తెలియదు. మీకు కూడా ఇదే కోరిక ఉందా.. అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత దగ్గర పని చేసే అవకాశం మీ కోసం. ఎలా అంటే..
టాలీవుడ్‌లోనే కాక.. దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది సమంత. అందం, అభినయంతో పాటు మంచితనం కూడా ఆమె సొంతం. ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ.. మంచి మనసు చాటుకుంటుంది. సమంత అనగానే అందం, నటనతో పాటుగా తనలోని ఈ మంచి లక్షణాలు కూడా గుర్తుకు వస్తాయి. అవే ఆమెను అభిమానులకు మరింత చేరువ చేసింది. ఇక ఇప్పటికే సామ్ నటిగా పలు సంస్థలకు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్నేళ్ల క్రితం ఆమె స్వయంగా ‘సాకి’ అనే దుస్తుల బ్రాండ్‌ను స్థాపించిన విషయం తెలిసిందే. తన బ్రాండ్‌కు చెందిన డిజైనర్ దుస్తులు మార్కెట్‌లో భారీగా ట్రెండ్ అవుతున్నాయి. సాకి బ్రాండ్ అంటే సమంతకు చాలా ఇష్టం. ఈ బ్రాండ్ వస్త్రాలు చూస్తే సమంత ఫ్యాషన్ సెన్స్ మనకు అర్థం అవుతుంది.
అయితే, సమంత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ ఒకటి తెగ వైరల్ అవుతుంది. ఇంతకు ఇది దేని గురించి అంటే.. సమంత దగ్గర జాబ్ చేసే అవకాశం గురించి తెలుపుతుంది. తనకు ఎంతో ఇష్టమైన ‘సాకి’లో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు ప్రకటించింది సామ్. అందుకు సరిపడా అర్హతలు ఉన్నవారు సంప్రదించవచ్చని ఒక మెయిల్ అడ్రస్‌ను కూడా వెల్లడించింది. తన కంపెనీలో ఉన్న ఉద్యోగ వివరాలను తెలుపుతూ ఒక పోస్ట్ చేయగా.. అది తెగ వైరల్ అవుతోంది.. ఫ్యాషన్ డిజైన్ మేనేజర్/అసిస్టెంట్ మేనేజర్, ఫ్యాషన్ డిజైన్ ఎగ్జిక్యూటివ్, బ్రాండ్ మార్కెటింగ్ వంటి ఉద్యోగాలు ఉన్నట్లు తెలిపింది. ఈ రంగంలో ఆసక్తి ఉన్నవారందరూ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చని చెప్పుకొచ్చింది.
దీంతో పాటు సమంత ఏకమ్ ఎర్లీ లెర్నింగ్ సెంటర్ పేరుతో పిల్లల కోసం ప్లే స్కూల్ కూడా నడుపుతుంది. మీ పిల్లలను అందులో చేర్పించేందుకు కావాల్సిన వివరాలు తెలుసుకునేందుకు ఒక ఫోన్ నంబర్‌ను (9154900466) కూడా ఆమె షేర్ చేసింది. మరోవైపు సూపర్ ఫుడ్ సంస్థలో పెట్టుబడులు పెట్టిన సమంత.. ఏడాదికి మూడు మిలియన్ డాలర్లు ఆర్జిస్తున్నట్లు సమాచారం. వ్యాపారంతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలకు తన వంతు సాయం చేస్తుంది సమంత. అంతేకాక ప్రత్యేకంగా స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది.