iDreamPost
android-app
ios-app

Samantha: ఫ్యామిలీ మేన్ మొత్తం పాడు చేసింది. అయినా….

సినిమా ద్వారా సమాజానికి పరిచయమై, స్టార్స్ గా ఎదిగి, తిరుగులేని పాప్యులారిటీని సొంతం చేసుకున్నవారైతే ఇంక ఎక్కడైనా వాళ్ళకి ఓ ప్రత్యేకస్థానం....అదీ సినిమా ప్రభంజనం.ఊ అంటావా పాట గురించి, ది ఫ్యామిలీ మేన్ గురించి సమంతా స్పెషల్ గా మాట్లాడడం అందరినీ ఆకర్షించింది.

సినిమా ద్వారా సమాజానికి పరిచయమై, స్టార్స్ గా ఎదిగి, తిరుగులేని పాప్యులారిటీని సొంతం చేసుకున్నవారైతే ఇంక ఎక్కడైనా వాళ్ళకి ఓ ప్రత్యేకస్థానం....అదీ సినిమా ప్రభంజనం.ఊ అంటావా పాట గురించి, ది ఫ్యామిలీ మేన్ గురించి సమంతా స్పెషల్ గా మాట్లాడడం అందరినీ ఆకర్షించింది.

Samantha: ఫ్యామిలీ మేన్ మొత్తం పాడు చేసింది. అయినా….

టోటల్ గా వరల్డ్ మొత్తమంతా ఎంటర్ టైన్మెంట్ అనే వింగ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే అది మాటల్లో చెప్పలేం. ప్రపంచాన్ని ఎంటర్ టైన్ మెంట్ రూపంలో సినిమా అనేది శాసిస్తోంది. ఏ వ్యవహారం సినిమాతో ముడిపెట్టుకోకుండా జరగడం లేదు. సినిమా ద్వారా సమాజానికి పరిచయమై, స్టార్స్ గా ఎదిగి, తిరుగులేని పాప్యులారిటీని సొంతం చేసుకున్నవారైతే ఇంక ఎక్కడైనా వాళ్ళకి ఓ ప్రత్యేకస్థానం….అదీ సినిమా ప్రభంజనం.
నిన్ననే ప్రారంభమైన ఇండియా టుడే 2024 కాంక్లేవ్ సందర్భంగా మున్ముందు సమంతాని తీసుకొచ్చి, అమెతో ఏకంగా ఓ పెద్ద ప్రోగ్రామే ఇండియా టుడే లాటి టాపెస్ట్ న్యూస్ హౌస్ నడిపిందంటే ఆలోచించండి. ఆమె ప్రోగ్రామ్ కి కూడా’’ Splendid Miss Samantha: From Pushpa To The family Man, Carving Her Own Niche’’ అనే ప్రత్యేకమైన పేరు పెట్టి మరీ ఓ స్పెషల్ సెషన్ని ఆమెకు డెడికేట్ చేశారు.

అందులో సమంతా తన కెరీర్ గురించి, తన భావావేశాలు, భయాలు, ఆందోళనలు, అనారోగ్యం లాంటి టాపిక్స్ అన్నీ మాట్లాడింది. ఊ అంటావా పాట గురించి, ది ఫ్యామిలీ మేన్ గురించి సమంతా స్పెషల్ గా మాట్లాడడం అందరినీ ఆకర్షించింది. కొన్నాళ్ళ క్రితమైతే ఇటువంటి పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమాలకి సోషల్ యాక్టివిస్టులని, పేరుప్రతిష్టలున్న రాజకీయనాయకుల్ని, సైంటిస్టులని, స్కాలర్స్ ని, మేధావుల్ని పిలిచేవారు. ఆ వరసలో ఇప్పుడు సినిమా సాధించిన అత్యున్నత ప్రభావం కారణంగా సమంతా లాటి పాప్యులర్ స్టార్ ని కూడా ఇండియా టు డే ఆహ్వానించింది. బెస్ట్ సెల్లింగ్ పాడక్ట్ ఇప్పుడు సినిమానే ప్రపంచవ్యాప్తంగా. బాహుబలి సినిమా గురించి ఎకాడిమిక్ ఎగ్జామినేషన్స్ లో కూడా ప్రశ్నలు పడ్డాయంటే, దేశ ప్రధానే తాను కట్టప్పలా దేశాన్ని కాపాడతానని పబ్లిక్ డయాస్ మీద మాట్లాడారంటే…..ఇంకేం చెప్పాలి.

Samantha

ఈ సందర్భంగా మాట్లాడుతూ సమంత ‘’ నా కెరీర్లో 14 ఏళ్ళు ఇట్టే గడిచిపోయాయి. అన్నిటికీ భయపడిపోయే ఓ బుజ్జి పిల్లని నేను. భయం అనే కోణంలోనే నా కెరీర్ చాలా కాలం నడిపించాను. కానీ మనకి నచ్చిన పని చేస్తున్నప్పుడు 14 ఏళ్ళు గిర్రున తిరిగిపోయాయి. బైటవాళ్ళకి ఇది చాలా లాంగ్ టైం పీరియడ్ లా అనిపించొచ్చు. నాకున్న అవకాశాలు చాలా తక్కువ. పెయిల్యూర్ పట్ల నాకున్న భయమే ఎక్కువగా డామినేట్ చేస్తూ వచ్చింది. నాకే తెలియదు. నేనీ రోజున సాధించినదానికి ఇష్టమనే కోణమే హెల్స్ అయిందా అనిపిస్తుంటుంది కూడా. ఆరోగ్య పరంగా నేను సిక్ అయిన తర్వాతే నేను బాగా మారాను. నేను ఈ మధ్య గ్రహించింది ఏంటంటే భయమే నన్ను నడిపిస్తోందని, అదే నన్ను నాశంన చేస్తోందని. ఈ గందరగోళం ప్రపంచంలో నేనూ ఓ భాగాన్ని. దానితో నేను పరిగెత్తాలి. ప్రయాణించాలి. బ్రేక్ తీసుకోమని ఎవ్వరూ నాకు చెప్పలేరు కదా. పది విషయాలు నా డే టు డే లైఫ్ లో నేను ఫాలో అవుతాను. అందులో 5 గంటలు మాత్రమే నిద్రకి దొరుకుతుంది. ఏస్….నేను ప్రొడక్టివ్ పర్సన్ని. 14 ఏళ్ళు నేను మైండ్ కి, బాడీకి అస్సలు రెస్ట్ ఇవ్వనే లేదు. నిజాయితీగా చెప్పాలంటే గడిచిన 14 ఏళ్ళు చాలా విచారకరమైనవి. ఇంపోస్టర్ సిండ్రోమ్ తో బాధపడుతున్నా. ఒక్కోరోజు అనిపిస్తుంటుంది ఉదయం లేవగానే నేనుండను అని. నేనెంత టాప్ లో ఉన్న టైంని కూడా ఈ సిండ్రోమ్ కారణంగా ఎంజాయ్ చేయలేకపోయాను. అందుకే నా సక్సెస్ ని నేను క్లెయిమ్ చేయలేను. కొలీగ్స్ కే దాన్ని డెడికేట్ చేస్తా. అఖరుకి, నాకు నేను పర్మిషన్ ఇచ్చుకున్నా….నేను పక్కా మనిషినని.’’ అని చెప్పుకుంది సమంత.
పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు తప్పలేదు

ఈ అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఒక పక్క, మరో వైపు ఫిల్మ్ ప్రమోషన్స్ కి వెళ్ళవలసి వచ్చినప్పుడు తనకింక అనారోగ్యం గురించి చెప్పుకోక తప్పలేదని బాధ పడింది సమంత. ‘’ ఓ ఫిమేల్ ఓరియంటెడ్ సినిమా రిలీజు టైంలో నిర్మాతలు నన్ను ఫోర్స్ చేశారు ప్రమోషన్లకి రమ్మని లేకపోతే సినిమా చచ్చిపోతుందని భయపడ్డారు. నేను అస్సలు బాగులేనని నాకు తెల్సు. అనారోగ్యంతో పూర్తిగా ఢీలా అయిపోయి ఉన్నాను. ఓపిక లేకపోయినా వెళ్ళక తప్పలేదు. ఇంక నామీద రాశారూ…అంతా తప్పుడు సమాచారం చెలరేగిపోయింది. సరే ఒక్క ఇంటర్వ్యూ చేస్తానని ఒప్పుకున్నాను. హై డోజెస్ మెడికేషన్లో ఉన్నదానిని పూర్వంలా ఎలా కనిపిస్తాను. అప్పుడింక నా అనారోగ్యం చెప్పడం తప్పితే గత్యంతరం లేనేలేదు. అలా చెప్పుకుంటే నాకు సింపతీ క్వీన్ అని పేరు పెట్టేశారు. అయితే ఈ టఫ్ జర్నీ వల్ల నేనైతే మాత్రం బాగా ఎదిగాను. పొద్దున్నే లేవగానే నా గురించి ఏం రాశారా అన్ లైన్లో అని చూస్తూ ఉండేదాన్ని. నన్ను నిందిస్తూ రాసిన ప్రతీ సందర్భంలోనూ నాకు నేను ప్రతీ ప్రశ్నకూ నాదైనా సమాధానం చెప్పుకుంటూ వచ్చేదాన్ని. అలా రాసినవాళ్ళే నేనీ రోజున మానసికంగా ఎదగడానికి, గట్టి పడడానికి కారణమయ్యారు. నన్ను చూసి నాకు నేనే గర్వపడే మనిషిగా తయారు చేశారు.’’ అని వివరించింది సమంత.

Samantha

ఊ అంటావా, ఫ్యామిలీ మేన్ గురించి….ఇంత పెద్ద కార్యక్రమంలో కూడా ఊ అంటావా పాట గురించి, ఫ్యామిలీ మేన్ గురించి ప్రస్తావన రాకుండా ఆగలేదు. వీటి గురించి కూడా సమంతా ఓపిగ్గా మాట్లాడింది. ‘’ ఊ అంటావా పాట ఎందుకు చేశానో అందుకే ఫ్యామిలీ మేన్ కూడా చేశాను. మంచి విషయం ఏంటంటే ఊ అంటావా పాట చేయడానికి నేకు ఎక్కువమందిని అడగవలసిన అవసరం రాలేదు. నన్ను నేను నిరూపించుకోవడానకే ఆ సాంగ్ చేశాను. నాలో సెక్స్యువల్ లుక్ గురించి నేనెప్పుడూ కాన్ఫిడెంట్ కాదు. నేనంత బాగుండననే అధైర్యం నాలో ఉంది. సెక్స్ నా చాప్టర్ కాదు. అందుకే అది పె ద్ద ఛాలెంజ్ లా కనిపించింది. యాక్టర్ గా ఎదగడానికి ప్రతీసారీ టఫ్ సిట్యువేషస్సే ఫేస్ చేశాను. బైట పడడానికి ఫైట్ చేయాల్సి వచ్చింది. నాలో ఉండే దెయ్యాలను నేను చంపాల్సి వచ్చింది. చాలా మంది అడిగారు నన్ను ఇంత నాజూగ్గా ఉండి అలాంటి పంచ్ పాటలో ఎలా పలికించానని. ఇంక అలాటి పంచ్ ఐటెమ్ సాంగ్స్ చేయాల్సిన అవసరం లేదు. నాకు నేను ప్రూ అయ్యాను, చాలు. సిటాడెల్ సీరీస్ చాలా హార్డ్ స్రాజెక్టు. దారుణమైన పరిస్థితులలో చేయాల్సివచ్చింది. ఊ అంటావా పాట ఆడవాళ్ళని సెక్సీగా చూపించడానికి కాదు. బాగా కనిపించాలనే తాపత్రయాన్ని వదిలేసుకోవచ్చనిపించింది. ఊ అంటావా పాట కన్నా ఫ్యామిలీ మేన్ లో రాజీ క్యారెక్టరే ఎనీ డే బెటర్ అవుతుంది.’’ అని చెప్పుకుంది.
ఫ్యామిలీ మేన్ ఇంటినే పాడు చేసింది. అయినా….

Samantha

ఫ్యామిలీ మేన్ కారణంగా సమంతా తీవ్రమైన విమర్శలకు గురైంది. దాని కారణంగా చాలా పర్సనల్ వ్యవహారాలు, జీవితానికి సంబంధించిన చాలా డెలికేట్ లింక్స్ కూడా సమంత తెంచుకోవాల్సి వచ్చిందని తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద టాకే నడిచింది ఒక టైంలో. తర్వాత అన్నీ చల్లబడిపోయాయి. ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. ముఖ్యంగా నాగచైతన్యకి దూరమైపోవడం కూడా ఫ్యామిలీ మేన్ క్యారెక్టరేనని అనుకున్నారు చాలామంది. దీని గురించేనేమో సమంత ఇన్డైరెక్ట్ గా మాట్లాడింది. ఫ్యామిలీమేన్ గురించి టాపిక్ వచ్చినప్పుడు సమంత మాట్లాడుతూ ‘’ రియల్ ఇన్సిడెంట్స్ మీద ఆదరాపడిన క్యారెక్టర్ రాజీ. అందుకు అది చేయడం బాధ్యతగా పీలయ్యాను. దాని వల్ల్ ఎవ్వరైనా హర్ట్ అయితే సారీ. కొన్ని సందర్బాలలో నా హోమ్ ని కూడా అది దెబ్బ కొట్టింది.’’ అని షాకింగ్ కామెంట్ చేసింది సమంత.