iDreamPost
android-app
ios-app

ఒకప్పుడు అందాల తార.. తరువాత రోడ్డుపై ఇలా! అంతా ఆ హీరో వల్లనే?

  • Published Mar 21, 2024 | 12:29 PM Updated Updated Mar 21, 2024 | 12:29 PM

ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరో సరసన నటించి మంచి స్టార్ స్టెటస్ ను సంపాదించుకున్న హీరోయిన్ ఇప్పుడు అనారోగ్యానికి గురయ్యి గుర్తుపట్టాలేనంతగా మారిపోయింది. అలాగే రూ. 100 సాయం కోసం ఎదురు చూసే దీనస్థితిలో ఉంది. ఇంతకి ఆమె ఎవరంటే..

ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరో సరసన నటించి మంచి స్టార్ స్టెటస్ ను సంపాదించుకున్న హీరోయిన్ ఇప్పుడు అనారోగ్యానికి గురయ్యి గుర్తుపట్టాలేనంతగా మారిపోయింది. అలాగే రూ. 100 సాయం కోసం ఎదురు చూసే దీనస్థితిలో ఉంది. ఇంతకి ఆమె ఎవరంటే..

  • Published Mar 21, 2024 | 12:29 PMUpdated Mar 21, 2024 | 12:29 PM
ఒకప్పుడు అందాల తార.. తరువాత రోడ్డుపై ఇలా! అంతా ఆ హీరో వల్లనే?

సినీ పరిశ్రమలో అవకాశాలకు కొదవే ఉండదు. ఈ క్రమంలోనే ఎంతోమంది నటి, నటులు తమని తాము నిరుపించుకోవడం కోసం ఇండసస్ట్రీ పై ఎంట్రీ ఇస్తూ చాలా కష్టపడుతుంటారు. కానీ, ఈ రంగుల ప్రపంచంలో నిలదక్కుకోవడం అంటే అంతా ఈజీ అయినా పని కాదు. ఒకవేళ నిలదక్కుకున్న అదృష్టం కూడా తోడై ఉండాలి. ఇలా అదృష్టం కలిసివచ్చి, అవకాశాలు అందుకొని.. వరుస విజయాలతో దూసుకోపోయే తారలు ఎంతోమంది ఉన్నారు. వీరిలో కొందరు ఒకప్పుడు టాప్ హీరోయిన్లు గా చెలామణి అయినవారు కూడా ఇప్పుడు గుర్తుపట్టాలేని స్థితిలో, ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ సతమతవుతున్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ కూడా ఒకరు. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ సరసన ఆడిపాడిన ఈ అందాల తార ఇప్పుడు రూ. 100 సాయం కోసం ఎదురుచూసే దీనస్థితిలో ఉంది. ఇంతకి ఈమె ఎవరంటే..

ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వరుస సినిమాలతో అలరించిన చాలామంది తారలు ఇప్పుడు తమ వ్యక్తిగత జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. అలాంటి వారిలో ‘పూజ దద్వాల్’ ఒకరు. ఒకప్పుడు సల్మాన్ సరసన 1995లో విడుదలైన ‘వీరగతి’ చిత్రంలో ఈమె హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఇద్దరికీ మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. కానీ, ఆ సినిమా తర్వాత పూజా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి.ఈ క్రమంలోనే.. తీవ్ర అనారోగ్య సమస్యలతో ఒంటరిగా జీవిస్తన్న పూజ ఇప్పుడు గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది.అయితే పూజ 2018లో అనారోగ్యానికి గురైంది. దీంతో ఆసుపత్రిలో చేరిన పూజకు వైద్యులు టీబీ సోకిందని తెలిపారు. దీంతో భర్త, అత్మామామలు ఆమెతో బంధాలు తెంచుకున్నారు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ పూజ ఒంటరిగా మారిపోయింది. అయితే దీన స్థితికి చేరుకొని సాయం కోసం ఎదురు చూస్తున్న పూజకు నటుడు రాజేంద్ర సింగ్ సహాయం చేసి ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఆ సమయంలో పూజా యూట్యూబ్‌లో వీడియో పోస్ట్ చేసి ఆర్థిక సహాయం కోరింది.దీంతో వెంటనే స్పందించిన సల్మాన్ ఖాన్ ఆమెకు సాయం చేశాడు. అలాగే ఆరు నెలల పాటు పూజా చికిత్స ఖర్చులను భరించాడు. ఇక అనారోగ్యం నుంచి కొలుకున్న తర్వాత పూజ ఒంటరిగా ముంబైలోని ఒక చిన్న ఇంట్లో నివసిస్తుంది.

Once a beauty star then on the road like this

కాగా, పూజ 1977 జనవరి 5న ముంబైలో జన్మించింది. ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే, నటన అంటే ఇష్టం. అందుకే స్కూల్ ఎడ్యుకేషన్‌తో పాటు యాక్టింగ్ పాఠాలు కూడా నేర్చుకుంది. ఒకరోజు యాక్టింగ్ క్లాస్ లో పూజాకి సినిమా ఆఫర్ వచ్చింది. 17 ఏళ్ల వయసులో సల్మాన్ ఖాన్ ‘వీరగతి’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. దీని తర్వాత పూజా మరికొన్ని చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకు ఆశించిన విజయం దక్కలేదు. సినిమాల్లో సక్సెస్ లేకపోవడంతో పూజా చివరికి బుల్లితెర రంగం వైపు మొగ్గు చూపింది. ‘ఆషికీ’, ‘ఘరానా’ వంటి సీరియల్స్‌లో నటించింది. పెళ్లి తర్వాత తన భర్తతో కలిసి గోవాలో నివసించింది.ఇక అనారోగ్యంకు గురైన పూజను భర్త, అత్తమామలు వదిలేయడంతో అనాథగా మారిపోయింది.

ఇక చివరిగా పూజ 2020లో ఆమె పంజాబీ చిత్రం ‘శుక్రనా: గురునానక్ దేవ్‌జీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దాంతో పూజ మరోసారి ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ప్రస్తుతం ఆమె డాబా సర్వీస్ నడుపుతున్నట్లుగా తెలుస్తోంది. తన స్నేహితుడు డైరెక్టర్ రాజేంద్ర సింగ్ తనకు డాబా సర్వీస్ నడిపేందుకు అవసరమైన వస్తువులను, స్థలాన్ని సమకూర్చాడని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. మరి, తన అందచందలతో ఎంతో అద్భుతంగా నటించిన హీరోయిన్ పూజ అనారోగ్యంకి గురై దీన స్థితిలో మారిపోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibommeritbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetcasibom