iDreamPost
android-app
ios-app

Salman Khan: నా సినిమాలకు కలెక్షన్లు తగ్గడానికి కారణం అదే.. సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్!

  • Author Soma Sekhar Updated - 04:28 PM, Sat - 2 December 23

తన సినిమాలకు కలెక్షన్లు ఎందుకు తగ్గాయో చెప్పుకొచ్చాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. వారిలా నేనూ చేస్తే.. నా మూవీలు కూడా భారీ వసూళ్లు సాధిస్తాయని పేర్కొన్నాడు.

తన సినిమాలకు కలెక్షన్లు ఎందుకు తగ్గాయో చెప్పుకొచ్చాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. వారిలా నేనూ చేస్తే.. నా మూవీలు కూడా భారీ వసూళ్లు సాధిస్తాయని పేర్కొన్నాడు.

  • Author Soma Sekhar Updated - 04:28 PM, Sat - 2 December 23
Salman Khan: నా సినిమాలకు కలెక్షన్లు తగ్గడానికి కారణం అదే.. సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్!

థియేటర్లలోకి స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే చాలు.. ప్రేక్షకుల్లో ఎక్కడాలేని సంతోషం. ఇక ఆ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంటే కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. అయితే బాలీవుడ్ కండల వీరుడు మాత్రం తన సినిమాలకు డబ్బులు రావడం లేదని తెగ బాధపడిపోతున్నాడు. కాగా.. తన సినిమాలకు భారీ కలెక్షన్లు ఎందుకు రావడంలేదో తనే ఓ కారణం చెప్పుకొచ్చి.. అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇదిలా ఉండే సల్మాన్ నుంచి వచ్చిన గత రెండు, మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏమంత ప్రభావం చూపించలేకపోయాయి. దీంతో కండల వీరుడు కాస్త వెనకబడిపోయాడు. ఈ క్రమంలోనే కలెక్షన్లపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ తన మూవీలకు పైసలు రాకపోవడానికి సల్మాన్ చెప్పిన రీజన్ ఏంటో తెలుసా?

సల్మాన్ ఖాన్.. బాలీవుడ్ కండల వీరుడిగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఇండియా వైడ్ గా గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక తన సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడంలో ముందుటాడు సల్మాన్. అయితే గత కొన్ని సంవత్సరాలుగా అతడి చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. గతంలో వచ్చిన రెండు, మూడు మూవీలతో పాటుగా.. ఇటీవల వచ్చిన టైగర్ 3 కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్ల గురించి పక్కన పెడితే.. కనీసం ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయాడు కండల వీరుడు.

ఇక ఇదే విషయంపై తాజాగా స్పందించాడు సల్మాన్ . “నా మూవీలకు టికెట్ ధరలు తక్కువగా ఉంటాయి. అందుకే కలెక్షన్లు తగ్గాయి. నేను కూడా ఎక్కువ ధరలతో మూవీని విడుదల చేస్తే.. నా చిత్రాలకు కూడా డబ్బులు బాగానే వస్తాయి. ఇక నుంచి నా నెక్ట్స్ మూవీలకు ఇలాగే చేయాలనుకుంటున్నాను” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు సల్మాన్ ఖాన్. ప్రస్తుతం అతడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సల్మాన్ తీసుకున్న నిర్ణయంతో సగటు ప్రేక్షకులు నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పటికే స్టార్ హీరోల చిత్రాలకు విడుదల రోజు టికెట్ రేట్స్ ఆకాశాన్ని తాకుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సల్మాన్ తమిళ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ తెరకెక్కిస్తున్న ‘ది బుల్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీని బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. నిజ జీవిత కథతో రాబోతున్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ను త్వరలోనే మెుదలు కానుంది. టికెట్ రేట్స్ తక్కువ ఉండటం వల్లే తన సినిమాలకు కలెక్షన్లు రావడం లేదన్న సల్మాన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş