iDreamPost
android-app
ios-app

సల్మాన్ ఖాన్‌తో రూ.5 కోట్లు డీల్.. ఇవ్వకుంటే చంపేస్తాం!

  • Published Oct 18, 2024 | 11:27 AM Updated Updated Oct 18, 2024 | 11:27 AM

Salman Khan: సల్మాన్ ఖాన్ అడవిలో కృష్ణ జింక వేటాడిన కేసు ఆయన్ని నీడలా వెంటాడింది.ఈ కేసులో కొంతకాలం ఆయన జైలు జీవితం కూడా గడిపారు. దీనికి సంబంధించిన కేసు ఏళ్లతరబడి నడుస్తూ వచ్చింది. కృష్ణ జింక కేసులో కోర్ట్ సల్లూభాయ్ కి ఉపశమనం ఇచ్చినా బీష్ణోయ్ గ్యాంగ్ మాత్రం వదలడం లేదు.

Salman Khan: సల్మాన్ ఖాన్ అడవిలో కృష్ణ జింక వేటాడిన కేసు ఆయన్ని నీడలా వెంటాడింది.ఈ కేసులో కొంతకాలం ఆయన జైలు జీవితం కూడా గడిపారు. దీనికి సంబంధించిన కేసు ఏళ్లతరబడి నడుస్తూ వచ్చింది. కృష్ణ జింక కేసులో కోర్ట్ సల్లూభాయ్ కి ఉపశమనం ఇచ్చినా బీష్ణోయ్ గ్యాంగ్ మాత్రం వదలడం లేదు.

  • Published Oct 18, 2024 | 11:27 AMUpdated Oct 18, 2024 | 11:27 AM
సల్మాన్ ఖాన్‌తో రూ.5 కోట్లు డీల్.. ఇవ్వకుంటే చంపేస్తాం!

ఈ మధ్యనే ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దీఖీ హత్య తర్వాత అటు రాజకీయాల్లో ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీలో హై అలర్ట్ ఏర్పడింది. బాబా సిద్దీఖీ హత్య తాము చేసినట్లు బిష్ణోయ్ గాంగ్ వెల్లడించింది. అంతే కాదు తమ నెక్ట్స్ టార్గెట్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అని వార్నింగ్ ఇచ్చినట్లు బీటౌన్ లో పెద్ద చర్చ నడుస్తుంది. దానికి తోడు ఇటీవల సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ఓ వ్యక్తి కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి బీష్ణోయ్ గ్యాంగ్ కి చెందిన వాడని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు సల్మాన్ ఖాన్ కి అదనపు భద్రత కేటాయించింది ప్రభుత్వం. తాజాగా సల్మాన్ ఖాన్ కి మరో బెదిరింపు మెసేజ్ రావడం తీవ్ర కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించివ ప్రత్యేక పరిచయం అక్కరలేదు. బాలీవుడ్ లోనే కాదు సౌత్ ఇండస్ట్రీలో సైతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు సల్మాన్ ఖాన్. తాజాగా సల్మాన్ ఖాన్ ని చంపేస్తాం అంటూ బెదిరింపు వచ్చినట్లు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా సల్మాన ఖాన్, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మధ్య గొడవ గురించి అందరికీ తెలిసిందే. సల్మాన్ ఖాన్ ఆప్త మిత్రుడు బాబా సిద్దీఖీని హతమార్చిన తర్వాత ఈ గ్యాంగ్ నెక్ట్స్ టార్గెట్ నువ్వే అంటూ ఆయనకు వార్నింగ్ కూడా ఇచ్చింది. శుక్రవారం (అక్టోబర్ 18) తేదీన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ ముంబై ట్రాఫిక్ పోలీసులకు గురువారం రాత్రి వాట్సాప్ నంబర్ కి మెసేజ్ వచ్చింది. దీంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు.

‘ఈ సందేశాన్ని ఎట్టిపరిస్థితుల్లో తేలిగ్గా తీసుకోవొద్దు.. సల్లూ భాయ్ ఇకపై ప్రాణాలతో ఉండాలన్నా, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో వైరానికి ముగింపు పలకాలన్నా మాకు రూ.5 కోట్లు ఇవ్వాలి. ఈ నగదు ఇవ్వకుంటే మాజీ ఎమ్మెల్యే బాబా సిద్దీఖీ కన్నా దారుణంగా చంపేస్తాం’ అంటూ అగంతకుల నుంచి సందేశం వచ్చింది. ఈ క్రమంలోనే పోలీసులు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద మరింత భద్రత ఏర్పాటు చేశారు. ఈ సందేశాన్ని తాము సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు.ఈ మెసేజ్ ఏదైనా ముఠా నుంచి వచ్చిందా? లేక పోలీసులను ఇబ్బంది పెట్టడానికి ఆకతాయిలు చేసిన పనా? అన్న కోణంలో విచారణ చేస్తున్నామంటున్నారు పోలీసులు. ఈ మధ్యనే సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద సుకాన్ అనే యువకుడు కాల్పులు జరిపాడు. వెంటనే అలర్ట్ అయిన ముంబై నవీ పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించారు పోలీసులు.ఏప్రిల్ లో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే ముంబై పోలీస్ కమీషనర్ ని అశ్రయించారు సల్మాన్ ఖాను కుటుంబ సభ్యులు.

jojobet girişgamdomCasibomJojobet Girişjojobet güncel girişjojobet giriş