iDreamPost
android-app
ios-app

టెన్త్‌లో సత్తా చాటిన బజరంగీ భాయిజాన్‌ పాప.. ట్రోలర్స్‌కి ‍గట్టి కౌంటర్‌

  • Published May 15, 2024 | 10:09 AM Updated Updated May 15, 2024 | 10:09 AM

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ కెరీర్‌ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ మూవీ బజరంగీ భాయిజాన్. అయితే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో సమానంగా ఓ చిన్నారి అందరికీ గుర్తుండే ఉంటుంది. కాగా, తాజాగా ఈ చిన్నారి 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి ట్రోలర్స్‌ నోరుమూయించింది.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ కెరీర్‌ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ మూవీ బజరంగీ భాయిజాన్. అయితే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో సమానంగా ఓ చిన్నారి అందరికీ గుర్తుండే ఉంటుంది. కాగా, తాజాగా ఈ చిన్నారి 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి ట్రోలర్స్‌ నోరుమూయించింది.

  • Published May 15, 2024 | 10:09 AMUpdated May 15, 2024 | 10:09 AM
టెన్త్‌లో సత్తా చాటిన బజరంగీ భాయిజాన్‌ పాప.. ట్రోలర్స్‌కి ‍గట్టి కౌంటర్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ కెరీర్‌ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ మూవీ ‘బజరంగీ భాయిజాన్’. ఈ సినిమాకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించాడు. అయితే 2015లో విడుదలైన ఈ హిందీ సినిమా.. అప్పటిలో ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డుకెక్కింది. ఇక ఇందులో కరీనా కపూర్‌ హీరోయిన​్‌గా నటించింది. అలాగే నవాజుద్దీన్‌ సిద్ధిఖీ కీలక పాత్రలో కనిపించారు. అయిఏత ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్‌ కథను అందించడం గమన్హారం. ఇకపోతే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో సమానంగా ఓ చిన్నారి నటించింది. కాగా, సినిమా మొత్తం ఆ చిన్నారి మాట్లాడకుండా ఉంటుంది. ఆమె మరెవరో కాదు.. హర్షాలీ మల్హోత్రా.

సల్మాన్‌ ఖాన్‌ బజరంగీ భాయిజాన్ సినిమాలో నటించిన ‘హర్షాలీ మల్హోత్రా’.. ప్రేక్షకుల అందరికి సుపరిచితమే. ఎందుకంటే.. ఆ సినిమాలో సల్మాన్‌ తో సమానంగా ఈ చిన్నారి కీలక పాత్రలో నటించింది. ఇక అప్పటిలో ఈ సినిమా వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా మూవీగా నిలిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఆ సినిమాలో  చిన్న పిల్లగా ఉన్న హర్షాలీ మల్హోత్రా..  ఈ ఏడాది 10వ తరగతి పాసైంది. కాగా, ఇటీవలే వచ్చిన పదవతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఆ ఫలితాల్లో 83% మార్కులతో ఉత్తీర్ణత  సాధించింది. ఈ క్రమంలోనే తన ఫలితాల గురించి ఆమె మాట్లాడుతూ సంతోషం వ‍్యక్తం చేసింది. ఇకపోతే ఇంతకాలం తనను ట్రోల్ చేసిన వారికి ఇప్పుడు ధీటుగా సమాధానం ఇచ్చింది ఈ చిన్నది.

కాగా, హర్షాలీ మల్హోత్రా ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. తరుచుగా ఆమె ఏదో ఒక రీల్స్‌ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే.. కొంతమంది  స్కూల్ కు వెళ్లి చదువుకో పాప’ అంటూ ఆమెను ట్రోల్ చేశారు.  అంతేకాకుండా.. ఈ ఏడాది పదో తరగతి పాస్ అవుతావా.?’ అని కూడా కొందరు కామెంట్స్ చేశారు. అయితే ఇప్పుడు అలాంటి వారి నోరు మూయించింది హర్షాలీ మల్హోత్రా. CBSC 10వ తరగతిలో హర్షాలీ మల్హోత్రా 83% మార్కులు సాధించి ట్రోలర్స్‌ కు నోరుమూయించేలా చేసింది.  ఈ క్రమంలోనే.. CBSC 10వ తరగతిలో తనకు వచ్చిన మార్కుల గురించి చెబుతూ హర్షాలీ మల్హోత్రా ఆనందం వ్యక్తం చేసింది.

ఇక ఇన్ని రోజులు తనకు వచ్చిన నెగెటివ్ కామెంట్స్ ని ఓ వీడియో ద్వారా చూపించింది. రీల్స్ చేస్తూనే రియల్ లైఫ్ లో విజయం సాధించవచ్చని హర్షాలీ మల్హోత్రా తెలిపింది. తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. ఇక  ఎస్‌ఎస్‌ఎల్‌సీలో మంచి మార్కులు సాధించినందుకు హర్షాలీ మల్హోత్రా పై అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. మరి, టెన్త్‌ క్లాస్‌ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి  ట్రోలర్స్‌కు నోరుమూయించేలా చేసిన హర్షాలీ మల్హోత్రా పై మీ అభిప్రాయాలు కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

 

 

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş