iDreamPost
android-app
ios-app

Salaar: సలార్ షో నిలిపివేత.. పోలీసులతో వాగ్వాదానికి దిగిన ప్రేక్షకులు

  • Published Dec 22, 2023 | 3:28 PM Updated Updated Dec 22, 2023 | 3:28 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన మూవీ సలార్ ది సీజ్ ఫైర్ నేటి నుండి థియేటర్లలో సందడి చేస్తోంది. తెలంగాణలో అర్థరాత్రి నుండి ఈ మూవీ ప్రదర్శితమౌతుంది. ఈ క్రమంలో రాత్రి 1 గంటలకు ప్రీమియర్ షోకు అనుమతినిచ్చిన థియేటర్ల వద్ద సందడి చేశారు ఫ్యాన్స్.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన మూవీ సలార్ ది సీజ్ ఫైర్ నేటి నుండి థియేటర్లలో సందడి చేస్తోంది. తెలంగాణలో అర్థరాత్రి నుండి ఈ మూవీ ప్రదర్శితమౌతుంది. ఈ క్రమంలో రాత్రి 1 గంటలకు ప్రీమియర్ షోకు అనుమతినిచ్చిన థియేటర్ల వద్ద సందడి చేశారు ఫ్యాన్స్.

  • Published Dec 22, 2023 | 3:28 PMUpdated Dec 22, 2023 | 3:28 PM
Salaar: సలార్ షో నిలిపివేత.. పోలీసులతో వాగ్వాదానికి దిగిన ప్రేక్షకులు

ప్రభాస్-ప్రశాంత్ నీల్ మూవీ సలార్ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగానే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి మూవీ టికెట్లు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్ మూడు సినిమాలు ప్రభాస్ అభిమానుల్ని నిరాశపర్చాయి. ఈ సినిమాపైనే హోప్స్ పెట్టుకున్నారు డై హార్ట్ ఫ్యాన్స్. విడుదల తేదీ రానే వచ్చింది. డిసెంబర్ 22న అర్థరాత్రి నుండే ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఓవర్సీస్‌తో పాటు తెలంగాణలో ప్రీమియర్ షోలు వేశారు. హైదరాబాద్‌లో కూడా పలు థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితమైంది. ఆ ఒక్క థియేటర్‌లో తప్ప.

అదే మల్లిఖార్జున థియేటర్. సలార్ ప్రీమియర్ షోను నిర్వాహకులు నిలిపివేశారు. ఎక్కువ మంది థియేటర్లలోకి రావడంతో షోను నిలిపివేసింది యాజమాన్యం. దీంతో అభిమానులు ఆగ్రవేశాలకు గురయ్యారు. ఇక నానా హంగామా సృష్టించారు. రద్దీని నియంత్రించేందుకు వచ్చిన పోలీసులతో ప్రేక్షకులు వాగ్వాదానికి దిగారు. షో ఎందుకు ఆపేశారంటూ ప్రశ్నించారు. టికెట్లు అమ్మేటప్పుడు తెలియదా ఇంత క్రౌడ్ ఉందంటూ నిలదీశారు. వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. మొత్తానికి సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీలో ఉన్నారు. ప్రభాస్ ఖాతాలో హిట్ పడిందని భావిస్తున్నారు సినీ పండితులు.

పలుమార్లు వాయిదా పడినప్పటికీ.. ఎలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకుండా థియేటర్లలోకి వచ్చి సందడి చేస్తోంది సలార్. అర్థరాత్రి నుండి ఆయా థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. సినిమా విడుదలను ఓ పండుగలా సెలబ్రేట్ చేశారు.  దీంతో సందడి వాతావరణం కనపడింది థియేటర్ల వద్ద. ప్రభాస్ లుక్స్, ఎలివేషన్, యాక్షన్ సీక్వెన్స్, బీజీఎం టాప్ నాచ్ అంటున్నారు అభిమానులు. చాన్నాళ్ల తర్వాత ప్రభాస్ మేకోవర్ చూసి సంబరపడిపోతున్నారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్ చేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరీ ఈ సినిమా.. ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగా ఉందని భావిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss