Prashanth Neel Caste: సలార్ సక్సెస్ ఎఫెక్ట్.. ప్రశాంత్ నీల్ ది మా కులమే అంటూ మీడియాలో రచ్చ!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రతి ఒక్కరు ప్రశాంత్ నీల్ ను ప్రశంసిస్తుండగా.. కొందరు మాత్రం తమ పైత్యం చాటుకుంటున్నారు. నీల్ క్యాస్ట్ గురించి పోస్ట్ లు చేస్తున్నారు. ఆ వివరాలు..

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రతి ఒక్కరు ప్రశాంత్ నీల్ ను ప్రశంసిస్తుండగా.. కొందరు మాత్రం తమ పైత్యం చాటుకుంటున్నారు. నీల్ క్యాస్ట్ గురించి పోస్ట్ లు చేస్తున్నారు. ఆ వివరాలు..

బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఆకాశమంత పెరిగింది. బాహుబలి రెండు పార్టుల విడుదల తర్వాత.. పాన్ ఇండియా స్టార్ గా నిలిచాడు ప్రభాస్. మన దగ్గరే కాక విదేశాల్లో సైతం అతడికి అభిమానులు ఏర్పడ్డారు. బాహుబలి సినిమాతో ఇండియా సూపర్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ పై ప్రేక్షకుల్లో ఓ రేంజ్ లో అంచనాలు పెరిగాయి. డార్లింగ్ సినిమా అంటే దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అయితే బాహుబలి తర్వాత రెబల్ స్టార్ నటించిన.. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్.. సినిమాలు వరుసగా ఒకదాన్ని మించి ఒకటి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. ఈ స్థితిలో ప్రభాస్.. కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో జట్టు కట్టడంతో.. మరోసారి డార్లింగ్ మీద అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

కేజీఎఫ్ 1,2 సినిమాలతో దేశాన్ని ఉర్రూతలూగించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అలాంటి డైరక్టర్ కాంబినేషన్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అనగానే దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దాంతో సలార్ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా సెకన్ల వ్యవధిలో వైరల్ అయ్యేది అంటే.. అభిమానులు అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా.. ప్రభాస్ కటౌట్ ఇమేజ్ కు తగ్గట్టుగా సలార్ సినిమాను తీర్చిదిద్దాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. సలార్ సినిమాలో ప్రభాస్ ఎలివేషన్లు, యాక్షన్ ఘట్టాలు అద్భుతంగా పండడంతో అభిమానులు, మాస్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ప్రభాస్ సినిమా అంటే ఇలా ఉండాలి కదా అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో సలార్ సినిమాను నిర్మించింది హోంబలే ఫిల్స్మ్. సినిమా విడుదలకు ముందు ఎలాంటి ఈవెంట్స్, ప్రెస్ మీట్స్, ప్రమోషన్స్, ఆఖరికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా లేదు. అవేం లేకపోయినా.. ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేసుకుంది ఈ సినిమా. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేని విధంగా థియేటర్ల వద్ద టికెట్ల కోసం క్యూలు కట్టారు ప్రేక్షకులు. ఆన్‌లైన్‌లో బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది సేపటిలోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇక ఓవర్సీస్‌లోనూ ప్రీమియర్స్ కోసం అడ్వాన్స్ బుకింగ్స్.. రికార్డు స్థాయిలో జరిగాయి. ఇవన్నీ చూశాక కచ్చితంగా ‘సలార్’ ఓపెనింగ్ డే కలెక్షన్స్ అదిరిపోతాయని అందరూ అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే తొలిరోజు వసూళ్లు అదిరిపోయాయి. మొదటి రోజు సలార్.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 160 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

సలార్ సినిమాతో మరో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. సినిమా చూసినవారంతా.. అతడిపై ప్రశంసలు కురిపిస్తుంటే.. కొందరు మాత్రం తమ పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. సలార్ సినిమా తీసిన ప్రశాంత్ నీల్.. మా సామాజిక వర్గానికి చెందిన వాడే అంటూ పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో. అతడిది మా క్యాస్ట్ అంటే మా క్యాస్ట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. వీరి పైత్యాన్ని చూసిన నెటిజనులు.. రాకెట్ యుగంలో ఇంకా ఈ కులాల కొట్లాట ఏందిరా నాయనా.. చదువుకున్నారు కదా.. అయినా మీ బుద్ధి మారదా.. అని మండిపడుతున్నారు.

అయినా ఎవరైనా విజయం సాధిస్తే అభినందిస్తారు. కానీ మన దరిద్రం ఏంటంటే.. కుల పిచ్చితో వారు సాధించిన విజయాలను కూడా దిగజారుస్తాం. గతంలో ఒలంపిక్స్ లో దేశం తరఫున పీవీ సింధు పతకం గెలిస్తే.. గూగుల్ లో అత్యధిక మంది వెతికింది ఆమె క్యాస్ట్ గురించే. ప్రతి దాన్ని ఇలా కుల పిచ్చితో చూడటం ఏంటి.. ఇక మీరు మారరా అని ప్రశ్నిస్తున్నారు నెటిజనులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments