iDreamPost
android-app
ios-app

Salaar Trailer: వన్‌ లా కాదు.. అంతకు మించి.. డైనోసార్‌ వేట మొదలైంది…

  • Published Dec 18, 2023 | 3:44 PM Updated Updated Dec 18, 2023 | 3:44 PM

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురు చూస్తున్న సలార్‌ ట్రైలర్‌ నిన్న సాయంత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండింది. అయితే, సాంకేతిక కారణాల వల్ల ఈ రోజు ఉదయానికి వాయిదా పడింది. కానీ...

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురు చూస్తున్న సలార్‌ ట్రైలర్‌ నిన్న సాయంత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండింది. అయితే, సాంకేతిక కారణాల వల్ల ఈ రోజు ఉదయానికి వాయిదా పడింది. కానీ...

  • Published Dec 18, 2023 | 3:44 PMUpdated Dec 18, 2023 | 3:44 PM
Salaar Trailer: వన్‌ లా కాదు.. అంతకు మించి.. డైనోసార్‌ వేట మొదలైంది…

ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురు చూస్తున్న సలార్‌ సినిమా విడుదలకు కేవలం 5 రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో సలార్‌ బృందం ట్రైలర్‌ 2ను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసింది. 17వ తేదీ సాయంత్రం ట్రైలర్‌ 2 విడుదల కావాల్సింది. అయితే, సాంకేతిక సమస్యల కారణంగా ట్రైలర్‌ విడుదల వాయిదా పడింది. దీంతో ట్రైలర్‌ను 18వ తేదీ ఉదయం 10:42 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు సలార్‌ టీం తెలిపింది. కానీ, అనుకోని విధంగా ఈ రోజు ఉదయం కూడా ట్రైలర్‌ బయటకు రాలేదు.

మళ్లీ సాంకేతిక లోపాల కారణంగానే ట్రలర్‌ విడుదల అవ్వటం లేదని చిత్ర బృందం పేర్కొంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే, ఫ్యాన్స్‌లో మాత్రం భయం ఉండింది. ఈ రోజు విడుదల అవుతుందా? లేదా? అన్న మీమాంసలో పడిపోయారు. అభిమానుల భయం నిజం అయింది. ట్రైలర్‌ 2 గంటలకు కూడా రాలేదు. చివరకు మూడున్నర గంటల ప్రాంతంలో అభిమానులకు ఊరట ఇస్తూ ట్రైలర్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ట్రైలర్‌ విడుదలైంది.

సలార్‌ సెకండ్‌ ట్రైలర్‌ ఎలా ఉందంటే..

ఫస్ట్‌ ట్రైలర్‌ను మించి సెకండ్‌ ట్రైలర్‌ ఉంది. ప్రతీ సీను గూస్‌బమ్స్‌ తెప్పించేలా ఉన్నాయి. ఫస్ట్‌ ట్రైలర్‌లో పరిచయం చేయని పాత్రల్ని ప్రశాంత్‌ నీల్‌ ఇందులో పరిచయం చేశాడు. మొదటి ట్రైలర్‌లో ఇద్దరు మిత్రుల స్నేహం గురించి, సాయం గురించి చెబితే.. ఇందులో ఇద్దరు స్నేహితులు శత్రువులుగా మారారన్న దాన్ని రివీల్‌ చేశారు. హాలీవుడ్‌ సినిమాను మించి ప్రతీ షాట్‌ అద్భుతంగా ఉందని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

కాగా, సలార్‌ బుకింగ్స్‌ విషయంలో రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. ఓవర్‌సీస్‌లో 1 మిలియన్‌ మార్కును చేరుకుంది. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో పాత రికార్డులను తిరగరాసింది. ఎలాంటి ప్రమోషన్లు చేయకపోయినా.. కేవలం ప్రభాస్‌ స్టామినాతో చిత్రానికి విపరీతమైన హైప్‌ వచ్చింది. సలార్‌ నిర్మాతలు కూడా ‍ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ల మీద నమ్మకంతో ఎలాంటి ప్రమోషన్లు చేయకుండా మూవీని జనాల్లోకి వదులుతున్నారు. విడుదల నేపథ్యంలో ప్రశాంత్‌ నీల్‌, ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌లు రాజమౌళితో ఇంటర్వ్యూ నిర్వహించారు.

 ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రానుంది. ఒక పాట, రెండు ట్రైలర్లు, ఇంగ్లీష్‌లో ఓ ఇంటర్వ్యూ వీడియోతోనే సలార్‌ ప్రమోషన్లు ముగియనున్నాయి. ఇక, ఈ సినిమా ఇద్దరు ప్రాణ స్నేహితుల కథగా తెరకెక్కింది. ప్రభాస్‌ మిత్రుడిగా మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించారు. ప్రభాస్‌కు జంటగా శృతి హాసన్‌ కనిపించనున్నారు. జగపతి బాబు, ఈశ్వరీ రావు, బాబీ సింహ, బ్రహ్మాజీలు కీలక పాత్రల్లో నటించారు. మరి, సలార్‌ సెకండ్‌ ట్రైలర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio