iDreamPost
android-app
ios-app

Salaar: సలార్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ విషయంలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌!

  • Published Dec 02, 2023 | 2:05 PM Updated Updated Dec 02, 2023 | 3:15 PM

సలార్‌ సినిమా ట్రైలర్‌ డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్‌కు భారీ ఎత్తున స్పందన లభించింది. సోషల్‌ మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది. డిసెంబర్‌ 22న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

సలార్‌ సినిమా ట్రైలర్‌ డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్‌కు భారీ ఎత్తున స్పందన లభించింది. సోషల్‌ మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది. డిసెంబర్‌ 22న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Published Dec 02, 2023 | 2:05 PMUpdated Dec 02, 2023 | 3:15 PM
Salaar: సలార్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ విషయంలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌!

నిన్నటి నుంచి దేశం మొత్తం సలార్‌ జపం చేస్తోంది. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో సలార్‌ రచ్చ మొదలైంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ట్రైలర్‌కు సూపర్‌ రెస్పాన్స్‌ లభించింది. 3:47 నిమిషాలు ఉన్న ట్రైలర్‌ ఐ ఫీస్ట్‌గా ఉంది. ప్రభాస్‌ ఎంట్రీ అయితే మామూలుగా లేదు. ఫ్యాన్స్‌తో పాటు అందరికీ పిచ్చ పిచ్చగా నచ్చింది. సోషల్‌ మీడియాలో అయితే, ట్రైలర్‌ ట్రెండింగ్‌లో ఉంది. 17 గంటల్లో 24 మిలియన్ల వ్యూస్‌ సాధించింది. ట్రైలర్‌ తర్వాత సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుడు చిత్రం విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిత్రం డిసెంబర్‌ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, టికెట్స్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ విషయంలో సలార్‌ టీం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇండియా వ్యాప్తంగా సలార్‌ టికెట్‌ బుకింగ్స్‌ డిసెంబర్‌ 15నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా హోం బళే ఫిల్మ్స్‌ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో తెలియజేసింది. సలార్‌ ప్రీ బుకింగ్స్‌ లోనూ రికార్డులు సృష్టించటం ఖాయం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కాగా, ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన శృతి హాసన్‌ నటించారు. పృథ్వీ రాజ్‌ సుకుమార్‌, జగపతి బాబు, టిన్ను ఆనంద్‌, ఈశ్వరీ రావు, శ్రీరామ్‌ రెడ్డి, శ్రేయరెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం ఇద్దరు బెస్ట్‌ ఫ్రెండ్స్‌కు సంబంధించిన స్టోరీ అని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ట్రైలర్‌లో ప్రభాస్‌, పృథ్వీ రాజ్‌ సుకుమార్‌ల మధ్య సీన్స్‌ మామూలుగా లేవు. కొద్దిరోజుల క్రితం సలార్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఓ బాలీవుడ్‌ మీడియాతో మాట్లాడుతూ.. సినిమాపై ఓ క్లారిటీ ఇచ్చారు.

కేజీఎఫ్‌ సినిమాలకు సలార్‌ సినిమాలకు ఎటువంటి సంబంధం ఉండదని చెప్పారు. సలార్‌ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందని అన్నారు. ప్రశాంత్‌ నీల్‌ ఇచ్చిన క్లారిటీతో సలార్‌కు కేజీఎఫ్‌కు సంబంధం ఉందని గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. సినిమా విడుదలకు కొద్దిరోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో టీం ప్రమోషన్లకు సిద్ధం చేస్తోంది. సలార్‌ ప్యాన్‌ ఇండియా సినిమా కాబట్టి.. దేశ వ్యాప్తంగా పలు ముఖ్య పట్టణాల్లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్లు చేసే అవకాశం ఉంది.

ట్రైలర్‌ కారణంగా సినిమాపై అంచనాలు పెరిగాయి. దానికి తోడు ప్రమోషన్‌ విషయంలో ట్రైలర్‌ ఎంతో మేలు చేసింది. కోట్లు ఖర్చు పెట్టినా లభించని ప్రమోషన్‌ లభించింది. ఈ నేపథ్యంలో సినిమా టీం ప్రమోషన్లను తగ్గించాలని భావిస్తోందట. మరి, ప్రీ బుకిం‍గ్స్‌ విషయంలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు అందిన ఈ గుడ్‌న్యూస్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetkolik girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş