iDreamPost
android-app
ios-app

అల్లు అర్జున్ సినిమాలు అన్నీ చూశా.. నేను హ్యూజ్ ఫ్యాన్: సాక్షి ధోని

అల్లు అర్జున్ సినిమాలు అన్నీ చూశా.. నేను హ్యూజ్ ఫ్యాన్: సాక్షి ధోని

కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంత మంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ధోనీ ఎవరికి అభిమానో అందరికీ తెలిసిందే. ఆమె మరెవరో కాదు.. సాక్షి ధోని. కోట్ల మంది అభిమానులు కలిగిన ధోనీ.. సాక్షి ధోనీకి వీరాభిమని. మరి.. ధోనీనే ఫ్యాన్ గా పొందిన సాక్షికి ఇష్టమైన హీరో ఎవరు అనగానే.. మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు చెప్పేసింది. ఒక్క అభిమానిని అని కాకుండా.. అల్లు అర్జన్ వీరాభిమానిని అంటూ చెప్పడం ఇప్పుడు వైరల్ గా మారింది.

క్రికెట్ కి బ్రేక్ ఇచ్చి ఇప్పుడు ధోనీ ఎంటర్ టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టాడు. ధోనీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ ద్వారా తమిళ్ లో LGM అనే సినిమా కూడా నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఆ ప్రమోషన్స్ లో సాక్షి ధోనీ కూడా పాల్గుంటోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో సాక్షి ధోనీని సౌత్ సినిమాలు చూస్తారా? అంటూ ప్రశ్నించగా నేను అల్లు అర్జున్ సినిమాలు మొత్తం చూశాను అని సమాధానం చెప్పారు.

“ఇప్పుడంటే నెట్ ఫ్లిక్స్, ఓటీటీ అంటూ ఉన్నాయి. వీటికంటే ముందు సౌత్ సినిమాలను గోల్డ్ మైన్స్ వాళ్లు హిందీలోకి డహ్ చేసేవాళ్లు. అలా అల్లు అర్జున్ సినిమాలు మొత్తం చూశాను. నేను అల్లు అర్జున్ కు హ్యూజ్ ఫ్యాన్ ని” అంటూ సాక్షి ధోనీ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా హిందీలో రిలీజ్ అయ్యే సౌత్ సినిమాలు చూస్తానన్నారు. ఎంఎస్ ధోనీకి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందుకే ఎల్జీఎం సినిమాని తెలుగులో కూడా డబ్ చేసినట్లు చెప్పారు. త్వరలోనే మరిన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తామని చెప్పారు.

అంతేకాకుండా టాలీవుడ్ లో కూడా వాళ్లు తప్పకుండా సినిమాలు చేస్తామంటూ పరోక్షంగా హింట్ ఇచ్చారు. ప్రస్తుతం సాక్షి ధోనీ కామెంట్స్ తో ఒక్క అల్లు అర్జున్ అభిమానులు మాత్రమే కాకుండా.. తెలుగు ప్రేక్షకులు అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ధోనీ ఒక తెలుగు హీరోకి వీరాభిమాని అని చెప్పుకుంటున్నారు. ఇంక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు అయితే ఆనందంతో నేల మీద నిలబడటం లేదు. బాలీవుడ్ లో ఇంతటి క్రేజ్ సంపాదించుకోవడం అంత ఈజీ కాదని కొందరు.. అల్లు అర్జున్ అభిమాని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం అంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పెద్ద సర్ ప్రైజ్ అనే చెప్పాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet