iDreamPost
android-app
ios-app

మరోసారి ‘లవ్ స్టోరీ’ జంట! ఈసారి దర్శకుడు మారాడు!

  • Author ajaykrishna Published - 12:58 PM, Sun - 17 September 23
  • Author ajaykrishna Published - 12:58 PM, Sun - 17 September 23
మరోసారి ‘లవ్ స్టోరీ’ జంట! ఈసారి దర్శకుడు మారాడు!

వెండితెరపై సూపర్ హిట్ అయిన కాంబినేషన్స్ చాలా ఉంటాయి. ఇంకా చాలా వస్తుంటాయి. కాకపోతే.. తెరపై ఎన్ని జంటలు కంటికి ఇంపుగా అనిపించినా.. మనసు వరకు వెళ్ళేవి కొన్నే ఉంటాయి. అలాంటి జంటలు మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తే చూడాలని తెగ ఆసక్తి చూపిస్తుంటారు అభిమానులు. టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ పెయిర్స్ లో నాగచైతన్య, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి జంట ఒకటి. వీరిద్దరూ కలిసి 2021లో లవ్ స్టోరీ మూవీ చేశారు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడమే కాకుండా చైతూ, సాయిపల్లవి జంటకు మంచి ఫేమ్ తీసుకొచ్చింది.

జనరల్ గా సినిమాలలో చూసిన జంటలు మళ్లీ రిపీట్ అవుతాయని ఎవరు అనుకోరు. కానీ.. మనసుకు నచ్చితే మళ్ళీ రిపీట్ అయితే బాగుంటుందని అనిపిస్తుంది. లవ్ స్టోరీ మూవీ రిలీజ్ అయ్యాక.. చైతూ, సాయిపల్లవిల జంట గురించి అలాగే మాట్లాడుకున్నారు జనాలు. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత మళ్ళీ వీరిద్దరూ.. కొత్త ప్రాజెక్ట్ కోసం చేతులు కలపబోతున్నారని టాక్ వినిపిస్తుంది. లవ్ స్టోరీ మూవీలో వీరి కెమిస్ట్రీ మామూలుగా వర్కౌట్ కాలేదు. ఆద్యంతం ఇద్దరు ఎమోషనల్ గా కూడా ఆకట్టుకున్నారు. అయితే.. అది తీసింది సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఈసారి రెండో మూవీకి దర్శకుడు మారాడు.

ఆల్రెడీ నాగచైతన్యతో ప్రేమమ్, సవ్యసాచి సినిమాలు చేసి.. గతేడాది కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు చందూ మొండేటి. నిఖిల్ హీరోగా.. శ్రీకృష్ణుడు, ద్వారక నేపథ్యంలో తెరకెక్కిన కార్తికేయ మూవీ.. దేశం మొత్తాన్ని ఊపేసి ఏకంగా రూ. 120 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. సో.. ఇప్పుడు చైతన్యతో కొత్త సినిమా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కబోతుందని తెలుస్తోంది. అయితే.. చైతూతో ముచ్చటగా మూడో సినిమా కోసం సాయిపల్లవిని తీసుకోబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. మరి ఈ సినిమాకి సాయిపల్లవి ఓకే చేసిందా లేదా అనేది అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరి చూడాలి.. ఈ హిట్ పెయిర్ మళ్ళీ తెరపై సందడి చేస్తారేమో! చైతూ, పల్లవి జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş