iDreamPost
android-app
ios-app

Saagar K Chandra : సూపర్ హిట్ తర్వాత ఏ హీరోతో చేస్తారో

  • Published Mar 01, 2022 | 3:41 PM Updated Updated Mar 01, 2022 | 3:41 PM
  • Published Mar 01, 2022 | 3:41 PMUpdated Mar 01, 2022 | 3:41 PM
Saagar K Chandra : సూపర్ హిట్ తర్వాత ఏ హీరోతో చేస్తారో

మొన్నటిదాకా పెద్దగా లైం లైట్ లో లేని దర్శకుడు సాగర్ కె చంద్ర ఇప్పుడు భీమ్లా నాయక్ పుణ్యమాని అగ్ర హీరోల దృష్టిలో పడ్డారు. మలయాళం హిట్ రీమేక్, త్రివిక్రమ్ రచన లాంటి అంశాలు ఉన్నప్పటికీ సాగర్ ప్రతిభను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇతను ఎంత కష్టపడ్డాడో  మాటల మాంత్రికుడే స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే. అయ్యారేతో పేరు తెచ్చుకుని అప్పట్లో ఒకడుండేవాడుతో క్రిటిక్స్ మెప్పు పొందిన సాగర్ కమర్షియల్ గా వాటిని పెద్ద స్థాయికి తీసుకెళ్లలేకపోవడం ఆఫర్లు రాకుండా చేసింది. ఏదైతేనేం మొత్తానికి పవర్ స్టార్ తో సినిమా డ్రీమ్ ని చాలా తక్కువ టైంలో సాధించుకున్న సాగర్ నెక్స్ట్ మూవీ ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది.

ఓ ఇంటర్వ్యూలో తనే వరుణ్ తేజ్ కోసం ఓ కథ రాశానని, 14 రీల్స్ బ్యానర్ పై అనుకున్నప్పటికీ ఏవో కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చిందని చెప్పాడు. మరి ఇప్పుడు దీన్ని సెట్స్ పైకి తీసుకెళ్తారా లేదా అనేది వేచి చూడాలి. మరో వైపు ఎనర్జిటిక్ హీరో రామ్, న్యాచురల్ స్టార్ నానిలు ఎప్పటి నుంచో సాగర్ చంద్రతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. వీళ్ళలో ఒకరు ఎస్ చెప్పే అవకాశాలు లేకపోలేదు. కానీ వాళ్ళకు ప్రస్తుతమున్న కమిట్ మెంట్స్ ని బట్టి చూస్తే మరో ఆరు నెలల వరకు వెయిటింగ్ తప్పదు. ఎలాగూ ఓకే అవ్వడానికి స్క్రిప్ట్ తదితర పనులకు ఆ మాత్రం టైం కావాలి కాబట్టి ఎవరిది ఫైనల్ అవుతుందో చూడాలి.

అప్పటిదాకా సాగర్ భీమ్లా నాయక్ ప్రమోషన్లలో బిజీగా ఉండబోతున్నాడు. 107 కోట్ల షేర్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమాకు నిన్న డ్రాప్ కాస్త ఎక్కువగానే కనిపించడం ట్రేడ్ ని టెన్షన్ పెట్టింది. ఇవాళ శివరాత్రి పండగ సెలవుతో పాటు అర్ధరాత్రి స్పెషల్ షోలు కలెక్షన్ల పరంగా ఏ మేరకు బూస్ట్ ఇస్తాయో చూడాలి. ఇంకో ముప్పై కోట్లకు పైగా షేర్ రావాల్సిన తరుణంలో యూనిట్ హైప్ ని కొనసాగించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇక సాగర్ విషయానికి వస్తే కాస్త ఆలస్యమైనా కోరుకున్న బ్రేక్ దక్కి మంచి కెరీర్ ని సెట్ చేసుకునే దిశగా వెళ్తున్నాడు. నెక్స్ట్ ఏ హీరోతో చేయబోతున్నాడనేది మాత్రం ఇంకొంత కాలం వెయిట్ చేయాల్సిన సస్పెన్స్

Also Read : Jr NTR : తారక్ ఎందుకు వెనుకడబడుతున్నాడు

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet