iDreamPost
android-app
ios-app

రజినీకాంత్ వెట్టయాన్ కథ అదేనా?

  • Published Feb 20, 2024 | 1:27 PM Updated Updated Feb 20, 2024 | 1:36 PM

సూపర్ స్టార్ రజినీ కాంత్ నుండి వచ్చిన తాజా చిత్రం లాల్ సలామ్. ఎటువంటి ప్రమోషన్లు చేయకుండా నేరుగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ అంతగా మెప్పించలేకపోయింది. అయితే.. రజినీ కాంత్ తన నెక్ట్ మూవీని షురూ చేశాడు.

సూపర్ స్టార్ రజినీ కాంత్ నుండి వచ్చిన తాజా చిత్రం లాల్ సలామ్. ఎటువంటి ప్రమోషన్లు చేయకుండా నేరుగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ అంతగా మెప్పించలేకపోయింది. అయితే.. రజినీ కాంత్ తన నెక్ట్ మూవీని షురూ చేశాడు.

  • Published Feb 20, 2024 | 1:27 PMUpdated Feb 20, 2024 | 1:36 PM
రజినీకాంత్ వెట్టయాన్ కథ అదేనా?

సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా ముఖ్య పాత్రలో నటించిన లాల్ సలామ్ సినిమా బాక్సాఫీసు వద్ద దారుణమైన డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తదుపరి చిత్రం కథ విషయంలో తాజాగా ఒక ఆసక్తికరమైన పుకారు బయటకొచ్చింది. ప్రస్తుతం రజినీ వెట్టయాన్ అనే సినిమా కోసం పని చేస్తున్నారు. జై భీమ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టీజే జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకుడు. సుభాస్కరన్ నిర్మించనున్న ఈ తమిళ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమా కథ ఖచ్చితంగా సామాజిక అంశం చుట్టూ తిరుగుతుందని అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే దర్శకుడి చివరి సినిమా జై భీమ్ కూడా అలాంటిదే కాబట్టి రజినీకాంత్ తో తీసే సినిమా కూడా అలానే ఉంటుందని అందరూ అనుకుంటున్నారు..

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అదే నిజం అయ్యేలా ఉంది. విద్యా సంస్థలు, విద్యా వ్యాపారవేత్తల దోపిడీకి సంబంధించిన బూటకపు ఎన్‌కౌంటర్లు ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడిందట. ఈ సినిమా 80, 90ల నేపథ్యంలో సాగుతుంది. రజినీకాంత్ ఒక సిన్సియర్ ముస్లిం పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి వంటి స్టార్ లు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.ఇప్పటికీ ఈ సినిమా 2/3 వంతుకు పైగా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ఏప్రిల్ నాటికి షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. ఆ తర్వాత టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెడుతుంది. ఆ పైన లోకేష్ కనగరాజ్ సినిమాలో రజినీకాంత్ జాయిన్ అవుతారు.

rajnikanth vettaina

80 – 90ల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న కారణంగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం చాలా సమయం కావాలి. ఈ ఏడాది దీపావళికి సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. వెట్టయాన్ సినిమాలోని మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అది సూపర్ స్టార్ రజినీకాంత్ – బిగ్ బి అమితాబ్ బచ్చన్ ల కలయికే. అమితాబ్, రజనీలు చివరిగా హమ్ (1991) సినిమాలో నటించారు. 32 ఏళ్ల తర్వాత తొలిసారిగా వెట్టయాన్ కోసం మళ్ళీ కలిసి పని చేయనున్నారు. అమితాబ్ ఇప్పటికే పలు సార్లు రజినీ అంటే తనకు ఉన్న ఇష్టాన్ని చూపుతూనే ఉన్నారు. అలానే రజినీ కూడా అమితాబ్ తనకు ఆదర్శమని చెప్తూ ఆయన పై ఉన్న గౌరవాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వచ్చారు. గతంలో అమితాబ్ కోడలు ఐశ్వర్యరాయ్ రజినీకాంత్ తో కలిసి నటించిన రోబోట్ సినిమా విడుదల సమయంలో ఒక విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş