iDreamPost
android-app
ios-app

మళ్లీ తమిళం వైపు.. కార్తీతో డైరెక్టర్ అనుదీప్ కొత్త సినిమా..?

  • Author ajaykrishna Published - 10:44 AM, Fri - 28 July 23
  • Author ajaykrishna Published - 10:44 AM, Fri - 28 July 23
మళ్లీ తమిళం వైపు.. కార్తీతో డైరెక్టర్ అనుదీప్ కొత్త సినిమా..?

ఇండస్ట్రీలో కొన్నిసార్లు ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేయకుండానే క్రేజీ కాంబినేషన్స్ సెట్ అవుతుంటాయి. తర్వాత సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. కాంబినేషన్ మాత్రం భలే కుదిరింది కదా అనిపిస్తుంది. ఒక్కోసారి ఈ కాంబినేషన్ నిజంగా పడితే ఎలా ఉంటుందో అనే ఫీలింగ్ కూడా రాకపోదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారిన కాంబినేషన్ డైరెక్టర్ అనుదీప్ – హీరో కార్తీ. ఒకరు తెలుగు దర్శకుడు.. మరొకరు తమిళ హీరో. జాతిరత్నాలు సినిమాతో ఫేమ్ లోకి వచ్చిన డైరెక్టర్ అనుదీప్ కి మంచి కామెడీ పట్టు ఉంది. అది ఒక్క సినిమాతోనే ప్రూవ్ చేసుకున్నాడు. దీంతో అనుదీప్ నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడా? అనే ఆత్రుత ఫ్యాన్స్, ఆడియన్స్ లో కనిపిస్తుంది.

ఇక జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ తర్వాత అనుదీప్.. తమిళ హీరో శివకార్తికేయన్ తో ‘ప్రిన్స్’ అనే మూవీ తీసిన సంగతి తెలిసిందే. కామెడీ డ్రామా నేపథ్యంలో కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిందని చెప్పాలి. ఒరిజినల్ గా తమిళంలో షూట్ చేసినప్పటికి.. తెలుగులో కూడా రిలీజై పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే.. కొంచం గ్యాప్ తీసుకొని మరోసారి బైలింగ్వేల్ మూవీనే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖైదీ, సుల్తాన్, విరుమాన్, సర్దార్ సినిమాలతో సూపర్ ఫామ్ లో ఉన్న కార్తీ.. ప్రస్తుతం జపాన్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే.. ఇప్పుడు అందుతున్న ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. కార్తీ డైరెక్టర్ అనుదీప్ తో జతకట్టబోతున్నాడని తెలుస్తుంది.

డైరెక్టర్ అనుదీప్ మరోసారి కామెడీ టచ్ తోనే కార్తీతో ద్విభాషా చిత్రం ప్లాన్ చేస్తున్నాడని టాక్. ప్రెజెంట్ వీరి కాంబినేషన్ గురించి ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. హీరోగా కార్తీకి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి విదితమే. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తుందంటే.. ఖచ్చితంగా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది. అయితే.. కార్తీ కంటే ముందు అనుదీప్.. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కి ఓ కథ చెప్పాడని.. ఆయనతో త్వరలో అనౌన్స్ మెంట్ ఉండబోతుందని కథనాలు బయటికి వచ్చాయి. కానీ.. దానిపై ఇప్పటిదాకా క్లారిటీ రాలేదు. మరి వెంకటేష్ తో మూవీ గురించి.. ఇప్పుడు కార్తీతో మూవీ గురించి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. సో.. ఈ క్రేజీ కాంబో పై క్లారిటీ వచ్చేదాకా వెయిట్ చేయకతప్పదు. మరి అనుదీప్ – కార్తీ కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabetmarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet