కరోనా నుంచి సినీ ప్రేక్షకులు ఎక్కువగా ఓటీటీలకు అడిక్ట్ అయిపోయారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు అంతకుముందే వచ్చినప్పటికీ వాటికి కొవిడ్ టైమ్‌లోనే క్రేజ్ బాగా పెరిగింది. వరల్డ్ సినిమాకు సంబంధించిన బెస్ట్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్‌లు, సినిమాలు ఓటీటీల్లోకి అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో వాటికి మన ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. అప్పటి నుంచి మంచి కంటెంట్‌తో వచ్చే సిరీస్‌లు, సినిమాలకు మన దగ్గర డిమాండ్ ఎక్కువైంది. టైమ్ పాస్ మూవీస్ కంటే కథ, కథనాలు బాగున్న చిత్రాలు చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
మంచి బజ్ నెలకొంటేనో లేదా టాక్ బాగుంటేనో తప్పితే సినిమాలు చూసేందుకు ఆడియెన్స్ పెద్దగా థియేటర్లకు రావడం లేదు. బిగ్స్క్రీన్స్లో కూర్చోబెట్టి, ఎంగేజ్ చేసే మూవీస్‌కు డిమాండ్ పెరుగుతోంది. అదే సమయంలో కథ, కథనాలు ఏమాత్రం దెబ్బతిన్నా ఆడియెన్స్ ఆ సినిమాల వైపు చూడటం లేదు. అలాంటి చిత్రాలను ఓటీటీల్లో చూసేద్దామని ఫిక్స్ అయిపోతున్నారు. ఇదిలా ఉంటే.. ఓటీటీలోకి తాజాగా ఒక సూపర్ థ్రిల్లర్ తెలుగు మూవీ వచ్చేసింది. స్టార్ యాక్టర్ జగపతి బాబు ప్రధాన పాత్రలో అజయ్ సామ్రాట్ తెరకెక్కించిన ఫిల్మ్ ‘రుద్రంగి’. జులై 7వ తేదీన బిగ్ స్క్రీన్స్‌లో రిలీజైన ఈ మూవీ ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.
‘రుద్రంగి’ ఫిల్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మంగళవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తెలంగాణలోని సాంఘిక పరిస్థితుల నేపథ్యంలో ‘రుద్రంగి’ సినిమాను రూపొందించారు డైరెక్టర్ అజయ్ సామ్రాట్. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ మూవీని తీశారు. ఇందులో భీమ్రావ్ దేశ్‌ముఖ్‌గా జగపతి బాబు నటించారు. ఆయనతో పాటు ఆశిష్ గాంధీ, మమతా మోహన్‌దాస్, విమలారామన్, గానవి లక్షణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పీరియడ్ డ్రామాలు, థ్రిల్లర్ మూవీస్‌ను ఇష్టపడే వారిని ‘రుద్రంగి’ ఆకట్టుకునే అవకాశం ఉంది.