iDreamPost
android-app
ios-app

వెండితెరపైకి RS ప్రవీణ్ కుమార్ బయోపిక్.. హీరో, డైరెక్టర్ ఎవరంటే?

  • Author Soma Sekhar Updated - 11:56 AM, Fri - 3 November 23

మరో బయోపిక్ రాబోతోంది. తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్ కుమార్ జీవిత చరిత్రను వెండితెరపైకి తీసుకొస్తున్నారు. మరి ఈ మూవీలో ప్రవీణ్ కుమార్ రోల్ ఏ హీరో చేస్తున్నారు? దీనికి డైరెక్టర్ ఎవరు? లాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మరో బయోపిక్ రాబోతోంది. తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్ కుమార్ జీవిత చరిత్రను వెండితెరపైకి తీసుకొస్తున్నారు. మరి ఈ మూవీలో ప్రవీణ్ కుమార్ రోల్ ఏ హీరో చేస్తున్నారు? దీనికి డైరెక్టర్ ఎవరు? లాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Updated - 11:56 AM, Fri - 3 November 23
వెండితెరపైకి RS ప్రవీణ్ కుమార్ బయోపిక్.. హీరో, డైరెక్టర్ ఎవరంటే?

ఇండస్ట్రీలో ఎంతో మంది నటీ, నటుల జీవిత చరిత్రలు వెండితెరపై ఆవిష్కృతం అయ్యాయి. ఎన్టీఆర్, మహానటి సావిత్రి లాంటి ఎంతో మంది మహామహుల బయోపిక్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సినిమా నటులతో పాటుగా రాజకీయ ఉద్దండుల జీవిత చరిత్రలు కూడా తెరకెక్కాయి.. భవిష్యత్ లో కూడా వస్తాయి. తాజాగా మరో బయోపిక్ రాబోతోంది. తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్ కుమార్ జీవిత చరిత్రను వెండితెరపైకి తీసుకొస్తున్నారు. ఇక ఈ సినిమాకు ‘ప్రవీణ్ IPS’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేసి.. పోస్టర్ ను రిలీజ్ చేశారు. మరి ఈ మూవీలో ప్రవీణ్ కుమార్ రోల్ ఏ హీరో చేస్తున్నారు? దీనికి డైరెక్టర్ ఎవరు? లాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

RS ప్రవీణ్ కుమార్.. ఐపీఎస్ అధికారిగా ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు నాంది పలికారు. ముఖ్యంగా తెలంగాణ గురుకుల పాఠశాలల్లో కీలక మార్పులు తీసుకొచ్చి.. యువకులకు రోల్ మోడల్ గా మారాడు. ప్రస్తుతం తెలంగాణ బహుజన సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జీవితంలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని ‘ప్రవీణ్ IPS’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ బయోపిక్ షూటింగ్ పూర్తి కాగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత వివేక్ కుచిబొట్ల విడుదల చేశారు. కాగా.. ఈ చిత్రాన్ని ఐరా ఇన్పోటైన్మెంట్ ప్రైవెట్ లిమిటెడ్ బ్యానర్ పై నీల మామిడాల నిర్మిస్తున్నారు.

ఇక ఈ మూవీతో దుర్గాదేవ్ నాయుడు డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. ప్రవీణ్ కుమార్ పాత్రను ‘నరసింహాపురం’ ఫేమ్ నంద కిషోర్ పోషిస్తున్నాడు. ఈనెల 27న మూవీ టీజర్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. నవంబర్ లోనే సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. 27 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వహించి.. రెండేళ్ల క్రితమే స్వచ్చందంగా పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చారు ప్రవీణ్ కుమార్. ప్రస్తుతం సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి తెలంగాణ అసెంబ్లీ బరిలోకి దిగుతున్నారు. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జీవితం సినిమాగా వస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom