iDreamPost
android-app
ios-app

ఓటీటీలో రిలీజైన నిత్యామీన‌న్ మాస్ట‌ర్ పీస్ వెబ్‌సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇప్పుడంతా వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తోంది. ఆడియోన్స్ అభిరుచులకు తగ్గట్టు వెబ్ సిరీస్ లను రూపొందిస్తున్నారు. ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లకు ప్రేక్షకుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.

ఇప్పుడంతా వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తోంది. ఆడియోన్స్ అభిరుచులకు తగ్గట్టు వెబ్ సిరీస్ లను రూపొందిస్తున్నారు. ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లకు ప్రేక్షకుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.

ఓటీటీలో రిలీజైన నిత్యామీన‌న్ మాస్ట‌ర్ పీస్ వెబ్‌సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓ వైపు వన్డే వరల్డ్ కప్ సమరం ఆడియెన్స్ లో ఫుల్ జోష్ నింపేస్తుంటే, మరో వైపు సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీల్లోకి రిలీజ్ అవుతూ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తున్నాయి. అటు క్రికెట్ ప్రియులకు, ఇటు సినీ ప్రియులకు కావాల్సినంత వినోదం లభిస్తోంది. థియేటర్ కు వెళ్లి సినిమా చూసే సమయం లేని వారు తమకు ఇష్టమైన సినిమాలు ఓటీటీలో రిలీజ్ కోసం ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ ప్రధాన పాత్రలో నటించిన మాస్టర్ పీస్ వెబ్ సిరీస్ ఈ రోజు ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

ఇప్పుడంతా వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తోంది. ఆడియోన్స్ అభిరుచులకు తగ్గట్టు వెబ్ సిరీస్ లను రూపొందిస్తున్నారు. ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లకు ప్రేక్షకుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రీజీత్ ద‌ర్శ‌క‌త్వం వహించిన మాస్టర్ పీస్ వెబ్ సిరీస్ బుధ‌వారం ఓటీటీలోకి విడుదలైంది. డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. నిత్యామీనన్ ప్రధాన పాత్రలో ఫ‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందింది మాస్ట‌ర్ పీస్ వెబ్‌సిరీస్. ఈ మ‌ల‌యాళ వెబ్ సిరీస్ తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో అందుబాటులో ఉన్న‌ట్లు డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ప్ర‌క‌టించింది.

భిన్న మ‌న‌స్త‌త్వాలు క‌లిగిన ఓ జంట పెళ్లితో ఒక్క‌టైన త‌ర్వాత ఏం జ‌రిగింద‌న్న‌ది వినోదాత్మ‌క పంథాలో ఈ సిరీస్‌లో డైరెక్ట‌ర్ శ్రీజీత్ ఆవిష్క‌రించారు. ఇందులో రియా అనే పాత్ర‌లో నిత్యామీన‌న్ న‌టించింది. గ‌త సినిమాల‌కు, సిరీస్‌ల‌కు భిన్నంగా ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్‌లో నిత్యామీన‌న్ ఈ సిరీస్‌లో క‌నిపించింది. అంతే కాకుండా మాతృభాష‌ మ‌ల‌యాళంలో నిత్యామీన‌న్ న‌టించిన ఫ‌స్ట్ వెబ్ సిరీస్ కూడా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. బ్రీత్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన నిత్యామీన‌న్ తెలుగులో మోడ్ర‌న్ ల‌వ్ ఇన్ హైద‌రాబాద్‌, శ్రీమ‌తి కుమారి వెబ్‌సిరీస్‌ల‌లో న‌టించింది. వెబ్ సిరీస్ లకు ఆధరణ లభిస్తున్న తరుణంలో స్టార్ హీరోయిన్లు సైతం నటిస్తున్నారు. ఇటీవల మిల్కీ బ్యూటీ తమన్నా లస్ట్ స్టోరీస్ 2 లో రెచ్చిపోయి నటించిన విషయం తెలిసిందే.

Jojobet GirişMadridbetMadridbetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren Sitelerdeneme bonusugrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet