iDreamPost
android-app
ios-app

విదేశాల్లో RRRకు ప్రేక్షకుల బ్రహ్మరథం, పాక్ లో టాప్ ప్లేస్

  • Published May 25, 2022 | 12:07 PM Updated Updated May 25, 2022 | 12:07 PM
విదేశాల్లో RRRకు ప్రేక్షకుల బ్రహ్మరథం, పాక్ లో టాప్ ప్లేస్

అదేంటి థియేటర్లలో దాదాపుగా వెళ్ళిపోయిన సినిమాను కొత్తగా ఎగబడి చూడటం ఏమిటనుకుంటున్నారా. ఇది ఓటిటి రిలీజ్ గురించి లెండి. ఇటీవలే డిజిటిల్ లో విడుదలైన ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రావడంతో వ్యూస్ పరంగా టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతోంది. పాకిస్థాన్ లోనూ నెంబర్ వన్ పొజిషన్ లో ఉందంటే ఇందులో ఉన్న కంటెంట్ జనానికి ఏ స్థాయిలో కనెక్ట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. మలేషియా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, సింగపూర్ తదితర దేశాల్లో ఆర్ఆర్ఆర్ చూసినవాళ్లు ఆ ఎగ్జైట్ మెంట్ తో ట్వీట్లు పెట్టడం చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి బృందం ప్రమోషన్ కొనసాగుతోంది.

తెలుగుతో సహా సౌత్ లాంగ్వేజెస్ జీ5లో వచ్చిన సంగతి తెలిసిందే. కానీ దీనికి వరల్డ్ వైడ్ రీచ్ లేకపోవడంతో నెట్ ఫ్లిక్స్ కు ట్రిపులార్ బంగారు బాతులా మారింది. కనీసం ఒక నెల రోజుల పాటు మొదటి స్థానంలో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. వ్యూస్ పరంగా అందులోని పాత రికార్డులు కూడా బద్దలు కొట్టడం గ్యారంటీ. జక్కన్న విజువల్ ఎఫెక్ట్స్ ని వాడుకున్న విధానం, ఎమోషన్స్ ని మిస్ చేయకుండా పాత్రల మధ్య ఎస్టాబ్లిష్ మెంట్ చేసిన తీరు ఎందరో టెక్నీషియన్ల ప్రశంసలు అందేలా చేస్తోంది. అందుకే ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు క్రమం తప్పకుండా ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన స్క్రీన్ షాట్లు కాంప్లిమెంట్లు కనిపిస్తున్నాయి.

సుమారు 1150 కోట్ల దాకా వసూలు చేసిన ఆర్ఆర్ఆర్ ఊహించని విధంగా కెజిఎఫ్ 2 ని దాటలేకపోయింది. అది పన్నెండు వందల కోట్లతో జెండా ఎగరేయగా మన మల్టీ స్టారర్ కొద్దిదూరంలో ఆగిపోయింది. అయినా కూడా ట్రిపులార్ ని తక్కువ చేసి చూడలేం కానీ మొత్తానికి బాహుబలి తర్వాత పెట్టుకున్న అంచనాలకు రాజమౌళి న్యాయం చేయగలిగారు. శాటిలైట్ టెలికాస్ట్ లోనూ కొత్త బెంచ్ మార్క్ సెట్ కావొచ్చని అంచనా. అసలు పైరసీ అనేది లేకపోతే ఆర్ఆర్ఆర్ లాంటి విజువల్ వండర్లు ఓటిటిలోనూ ప్రపంచ రికార్డులు సృష్టించేవి. కానీ ఆ భూతం దెబ్బ థియేటర్లకే కాదు డిజిటల్ కంపెనీలను ఈ రకంగా ప్రభావితం చేస్తోంది.