OTTలోకి వచ్చేసిన ఆలియా భట్ హిట్ మూవీ.. కానీ ఈ సినిమా చూడాలంటే..?

  • Author singhj Updated - 11:33 PM, Thu - 2 November 23
  • Author singhj Updated - 11:33 PM, Thu - 2 November 23
OTTలోకి వచ్చేసిన ఆలియా భట్ హిట్ మూవీ.. కానీ ఈ సినిమా చూడాలంటే..?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్​కు తెలుగు నాట కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పలు హిందీ హిట్ సినిమాలతో పాటు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’తో తెలుగుతో తన ఫాలోయింగ్​ను మరింత పెంచుకున్నారు ఆలియా. అందుకే ఆమె మళ్లీ ఎప్పుడు టాలీవుడ్​లో నటిస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. వరుస హిట్లతో ఫుల్ ఫామ్​లో ఉన్న ఆలియా నటించిన లేటెస్ట్ మూవీ ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’. ఇందులో రణ్​వీర్ సింగ్ హీరోగా నటించారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ చిత్రం.. లాంగ్​ రన్​లో వరల్డ్​ వైడ్​గా రూ.315 కోట్ల మేర వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దుమ్మురేపిన ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ మూవీ ఇప్పుడు సైలెంట్​గా ఓటీటీలోకి వచ్చేసింది.

‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ సినిమా కథ విషయానికొస్తే.. ఢిల్లీలో స్వీట్ల బిజినెస్ చేసే పంజాబీ కుటుంబానికి చెందిన కుర్రాడు రాకీ (రణ్​వీర్). రాకీ తాత అయిన కన్వల్ (ధర్మేంద్ర).. తన ఫ్రెండ్ జామినీ ఛటర్జీ (షబానా ఆజ్మీ)ని కలిసేందుకు ప్రయత్నిస్తాడు. వీళ్లిద్దర్నీ కలిపేందుకు రంగంలోకి దిగిన రాకీ.. జామినీ మనవరాలు రాణీ (ఆలియా)తో ప్రేమలో పడతాడు. వీళ్ల ప్రేమ సుఖాంతం అయ్యిందా లేదా అనేది ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ స్టోరీ. కథ సింపులే అయినప్పటికీ.. రణ్​వీర్, ఆలియాల కెమిస్ట్రీ సినిమాలో బాగా వర్కవుట్ అయింది. జులై 28వ తేదీన ఆడియెన్స్ ముందుకు వచ్చిన ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. అలాంటి ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్​లోకి తీసుకొచ్చింది. అయితే ఈ మూవీని చూడటం కుదరదు.

ప్రైమ్ అకౌంట్ ఉన్నా గానీ ఆలియా భట్ లేటెస్ట్ హిట్ ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ మూవీని ఓటీటీలో చూడాలంటే రూ.349 కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాను ప్రైమ్ వీడియో రెంట్ (అద్దె) విధానంలో స్ట్రీమింగ్​కు తీసుకొచ్చింది. రెంట్ వద్దనుకుంటే మరికొన్ని రోజులు ఆగితే చాలు.. ఉచితంగా అందుబాటులోకి వస్తుంది. అయితే ఇలా రెంట్ విధానంలో తీసుకురావడంపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. థియేటర్లలో టికెట్ల రేట్ల కంటే ఓటీటీ రెంట్ ఛార్జీలే అధికంగా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. డిమాండ్ ఉన్న కొత్త చిత్రాలను ఓటీటీ సంస్థలు ఇలా రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ చేయడంపై మీరేం అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: హీరోలకు తగ్గని రేంజ్​లో షారుఖ్ మేనేజర్ జీతం!

Show comments