iDreamPost
android-app
ios-app

తల్లిదండ్రులు కాబోతున్న జబర్దస్త్ రాకేశ్- సుజాత.. వైరలవుతున్న ఫోటోలు

  • Published Aug 03, 2024 | 8:55 PM Updated Updated Aug 03, 2024 | 8:55 PM

Rocking Rakesh And Jordar Sujatha Expecting A Baby: రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాత దంపతులు తమ అభిమానులకు భారీ శుభవార్త చెప్పారు. తాము త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నాం అంటూ ఫొటోలు, వీడియో షేర్ చేసి వెల్లడించారు.

Rocking Rakesh And Jordar Sujatha Expecting A Baby: రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాత దంపతులు తమ అభిమానులకు భారీ శుభవార్త చెప్పారు. తాము త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నాం అంటూ ఫొటోలు, వీడియో షేర్ చేసి వెల్లడించారు.

  • Published Aug 03, 2024 | 8:55 PMUpdated Aug 03, 2024 | 8:55 PM
తల్లిదండ్రులు కాబోతున్న జబర్దస్త్ రాకేశ్- సుజాత.. వైరలవుతున్న ఫోటోలు

రాకింగ్ రాకేశ్.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు గురించి పరిచయాలు అక్కర్లేదు. లైఫ్ లో ఎన్నో కష్టాలు పడి.. ఇప్పుడు జబర్దస్త్ లో టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు. అంతేకాకుండా.. సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఒకవైపు జబర్దస్త్ చేసుకుంటూనే.. షోలు కూడా చేస్తూ బిజీగానే గడిపేస్తున్నాడు. రాకింగ్ రాకేశ్ ఒక ఇంటి వాడు అయిన విషయం తెలిసిందే. జోర్దార్ సుజాతను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి జబర్దస్త్ లో స్కిట్లు కూడా చేస్తున్నారు. వీళ్ల జోడీకి మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఇప్పుడు వీళ్లిద్దరు తమ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఇన్నాళ్లు చెప్పకుండా ఇప్పుడు రివీల్ చేస్తున్నాం అంటూ.. తాము తల్లిదండ్రులు కాబోతున్నాం అని చెప్పారు.

రాకింగ్ రాకేశ్- సుజాత తమ అభిమానులను సర్ ప్రైజ్ చేశారు. ఇన్ని రోజులు ఈ విషయాన్ని చెప్పలేదని.. ఒక మంచి సమయం చూసి చెప్పాలి అనుకున్నట్లు సుజాత చెప్పుకొచ్చింది. రాకింగ్ రాకేశ్ తండ్రి కాబోతున్నాడు అంటూ సుజాత చెప్తుండగా.. రాకేశ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. తాజాగా సీమంతం నిర్వహించినట్లు ఉన్నారు. అందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. కేవలం ఫొటోలు రిలీజ్ చేయడమే కాకుండా.. ఒక వీడియో కూడా చేసి తమ ఆనందాన్ని తమ ఫాలోవర్స్, ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Rocking Rakesh (@jabardasthrakesh)

“ఒక మంచి సందర్భం చూసి ఈ విషయాన్ని మీకు తెలియజేయాలి అని వెయిట్ చేశాం. ఇదే ఆ సందర్భం అనిపించింది. మా ఇద్దరి ప్రేమకు ప్రతిరూపం ఈ భూమి మీదకు రాబోతోంది. ఆయన ఇలా ఏడవడం, ఆయన అందమైన గడ్డాన్ని పెంచుకోవడం నాకు బాగా నచ్చింది” అంటూ సుజాత ఎమోషనల్ అయ్యింది. ఇలా ఎమోషనల్ అవుతాననే ఇన్ని రోజులు వీడియో చేయలేదు అంటూ సుజాత చెప్పుకొచ్చింది. రాకేశ్ కూడా తనని తండ్రిని చేయబోతున్నందుకు సుజాతకు థ్యాంక్స్ చెప్పాడు. సుజాత అత్త గారు కూడా ఈ శుభవార్తను చెప్పినందుకు ఎంతో సంతోషంగా ఉంది.. అంటూ ఆవిడ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోయారు. రాకేశ్- సుజాత ఫ్యాన్స్ వారికి నెట్టింట శుభాకాంక్షలు చెబుతున్నారు. మరి.. ఈ జంటకు మీరు కూడా కామెంట్స్ రూపంలో మీ శుభాకాంక్షలను తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Strikers (@strikersinsta)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio